గుండె నుంచి గుండెల్లోకి..క్యూబా మోహన రాగం..!

ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాశించాలని, పెద్దరికాన్ని ప్రదర్శిస్తున్న అగ్ర రాజ్యం అమెరికా పక్కలో బల్లెం లా తయారైన క్యూబా పేరు తలుచుకున్నప్పుడు, దాని గురించి ఆలోచించినప్పుడు రోమాలు పైకి లేస్తాయి. శరీరంలో ఏదో విద్వత్తు ప్రవహిస్తుంది. క్యూబా ..కాస్ట్రో ..చేగువేరా ..గుండెల్లో కదలాడుతూనే వుంటారు. ఎందుకంటే చూస్తే చిన్న దేశం. కానీ యుఎస్ కు ముచ్చెమటలు పట్టించిండ్రు. గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అమెరికా ఇప్పటికీ కాస్ట్రో పేరు తలుచుకుని భయ పడుతోంది. అంతేనా ప్రభావితం చేస్తూ నియతం వెంటాడుతున్న ఒకే ఒక్కడు చేగువేరా. ఉద్విగ్న మైన చరిత్రకు, పోరాటాలకు ఊపిరి పోసిన చరిత్ర క్యూబాది. అందుకే ఆ దేశమన్నా, దాని గురించి తెలుసుకోవాలన్నా ఎంతో ఆసక్తి. ఈ లోకంలో ఎందరో హీరోలయ్యారు. ఇంకొందరు కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసారు. జనం గుండెల్లో రాజులయ్యారు. మహారాజులై కీర్తింప బడుతున్నారు. ఏళ్ళు గడిచినా , కాలం వెళ్లి పోతున్నా, సాంకేతికత కొత్త పుంతలు తొక్కినా , పోగేసుకున్న చరిత్ర అలాగే ఉన్నది. పాడు కోవడానికో లేదా గుర్తు తెచ్చు కోవడానికో కాదు..కోట్లాది ప్రజల ఆర్త నాదం. క్యూబా గురించి ..కన్నడ నాట గొప్ప రచయితగా పేరొంది...