పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ..మహోవా వారెవ్వా..!

ఆమె అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చింది. తన ప్రతిభా పాటవాలతో, అత్యంత ధైర్య సాహసాలతో మొదటి సారిగా పార్లమెంట్ లోకి అడుగు పెట్టింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. తన ప్రసంగంతో తోటి ఎంపీలతో పాటు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దాస్ మోదీని సైతం విస్తు పోయేలా చేసింది మహువా మొయిత్రా. బెంగాల్ రాష్ట్రం లోని కృష్ణా నగర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది. ప్రత్యర్థి కేంద్రంలోని బీజేపీ పార్టీఐకి చెందిన కళ్యాణ్ చౌబే పై 63 వేల 318 ఓట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. బెంగాల్ లో మమతా బెనర్జీతో పాటు మహోవా హవా కొనసాగుతోంది.
సమాజం పట్ల విస్తృతమైన అవగాహన కలిగిన మహోవా పద్దతిగా మాట్లాడతారు. అంతే కాదు సూటిగా ప్రశ్నిస్తారు. జనాన్ని ప్రేమించే ఆమె వారికి అందుబాటులో వుంటారు. అందుకే ఆమెకు యెనలేని డిమాండ్. సామాజిక, రాజకీయ, ఆర్ధిక, సాంకేతిక , ప్రజా సమస్యల పట్ల మహోవాకు మంచి పట్టుంది. ఇదే ఆమెకు అస్సెట్ గా మారింది. దేశ ప్రధాని, స్పీకర్ ల మనసు దోచుకుంది. దీంతో ఆమె ఒక్క రోజులో దేశంలో ఎందరికో రోల్ మోడల్ గా మారి పోయారు. మహిళలు అన్ని రంగాలలో రాణించలేక పోవడం భాధ కలిగిస్తోంది. ఎక్కడో ఒక చోట అడ్డంకులు ఉండనే ఉంటాయి, వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధులై ఉండాలని పిలుపునిస్తోంది ఆమె. మహోవా ఏది మాట్లాడినా..అందులో సమాజ హితం కోసమే అయి ఉంటుంది. ఈ ఎంపీ ఇటీవల ఎంపీల గురించి చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి.
తమ చదువుకు సంబంధించి డిగ్రీలు చూపించు కోలేని పార్లమెంట్ సభ్యులు , ప్రజల బాగోగుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. కామెంట్ ఆఫ్ ది ఇయర్ గా వినుతికెక్కింది. మహిళా సాధికారత అన్నది కేవలం మాటల వరకే పరిమితమై పోయింది. చట్టాలున్నా అవి కాగితాలకే పరిమితమై పోయాయి. ఇన్నేళ్లయినా స్వేచ్ఛ, సమానత్వం లేక పోవడం ..ప్రజాస్వామ్యం ఉన్నట్టా అంటూ మహోవా పార్లమెంట్ సాక్షిగా నిలదీసింది. అమెరికాలో ఉన్నత చదువులు చదువుకున్న ఆమె..ఏకంగా జేపీ మోర్గాన్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ హోదాలో పని చేసింది. ప్రజల కోసం సేవ చేసేందుకు మొదట కాంగ్రెస్ లో ఉన్నారు. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో చేరి ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు దేశం గర్వించే స్థాయికి ఎదిగారు.

కామెంట్‌లు