సంస్కరణలకు ఊతం..మహిళలకు వరం

అరబ్ దేశాలలో చావడం కంటే బతకడం చాలా కష్టం. కఠినతరమైన నియమ నిబంధనలు అక్కడి ప్రజలనే కాదు, ఇతర దేశాలకు చెందిన వారికి కూడా ఇబ్బంది కరమే. ప్రపంచంలో ఏ దేశాలలో లేని విధంగా సౌదీ అరేబియా దేశంలో పురుషుల కంటే మహిళలపై ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని దాటుకుని బయటకు రావాలంటే చాలా కష్టం కూడా. ప్రపంచంతో పోటీ పడాలన్నా, సాంకేతికత అందిపుచ్చు కోవాలంటే , దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే పురుషులతో పాటు మహిళలు కూడా భాగస్వామ్యం ఉండాలని ఆ దేశపు యువ రాజు భావించారు. అతడు వచ్చాక సమూలంగా మార్పులు చేశారు. ప్రతి ఒక్కరు చదువు కోవాలని, టెక్నలాజి లో మరింత పరిణతి చెందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందు కోసం భారీ ఎత్తున నిధులు, సౌకర్యాలు కల్పించారు.

తాజాగా సౌదీ మహిళలకు ఎక్కడికైనా ప్రయాణం చేసేందుకు సేచ్ఛను కల్పిస్తూ సంచల నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందు విధించిన కఠినతరమైన ఆంక్షలను ఎట్టి వేస్తున్నట్లు ప్రకటించారు. పురుషులతో సమానంగా స్త్రీలకు సమానంగా హక్కులు కల్పించేందుకు అక్కడి సర్కార్ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తాజాగా ట్రావెల్ ఫ్రీడమ్ లభించింది. 21ఏళ్లు  పైబడిన మహిళలు ఇకపై ఇంట్లోని పురుషుల పర్మిషన్ లేకుండానే పాస్ పోర్ట్ తీసుకోవచ్చు. నచ్చితే ఏ దేశానికైనా వెళ్ళవచ్చు. ఈ సంస్కరణలు తక్షణమే అమలులోకి వస్తాయని వెల్లడించింది. ఈ విషయాన్ని సౌదీ ప్రభుత్వం పాస్ పోర్ట్ విభాగం ట్విట్టర్ ద్వారా తెలిపింది.

 గార్డియన్ షిప్ యాక్టు ప్రకారం..సౌదీ అరేబియాలో మహిళలు చదువు కోవాలన్నా, ప్రయాణం చేయాలన్నా తండ్రి, భర్త లేదా సోదరుడు నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. కొన్ని రోజుల కిందట ఈ చట్టంలో కొన్ని మార్పులు చేశారు. మహిళలు అన్ని రంగాలలో ప్రగతి సాధించాలని ఆ దేశపు యువ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పలు సంస్కరణలు తీసుకు వస్తున్నారు. ఇప్పటికే మహిళలు డ్రైవింగ్ చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎట్టి వేశారు. గత సంవత్సరం నుంచే అక్కడి ఉమెన్స్ స్వంతంగా వాహనాలు నడుపుతున్నారు. మహిళలు కూడా మైదానాలకు వచ్చి మ్యాచ్‌లు వీక్షించే అవకాశం కల్పించారు.  ప్రభుత్వ నిర్ణయం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువ రాజుకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నారు. 

కామెంట్‌లు