ముంబయిలో అధికారిక యాపిల్ స్టోర్

ప్రపంచంలోనే నెంబర్ వన్ నమ్మకమైన కంపెనీ ఏదంటే ..ఎవరైనా ఠక్కున సమాధానం చెప్పేది యాపిల్ కంపెనీనే. కోట్లాది జనం గుండెల్ని మీటిన ఈ సంస్థ నుంచి ఏ ప్రొడక్ట్ వచ్చినా..ఏ యాక్ససరీస్ వచ్చినా సరే లైన్‌లో నిల్చుని తీసుకుంటారు. యాపిల్ బ్రాండ్ నేమ్ ఉన్నది ఏదైనా చేతిలో ఉంటే దాని లుక్, గెటప్, దాని స్టేటస్ వేరంటారు ఫ్యాన్స్. ధర ఎంతున్నా కొనేందుకు ఇష్టపడతారు. ఐటీ సెక్టార్‌లో వేగంగా దూసుకు వచ్చింది ఈ కంపెనీ. ఆయా దేశాధినేతల నుంచి సామాన్యుల దాకా ఫస్ట్ ప్రయారిటీ ఏదంటే యాపిల్‌నే. తర్వాతి స్థానం శాంసంగ్‌ది. గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు కూడా మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు మార్కెట్‌లోకి తీసుకు వచ్చినా యాపిల్ కంపెనీతో పోటీ పడలేక పోయాయి. గత కొన్నేళ్ల నుంచి యాపిల్ ప్రాడక్ట్స్ టాప్ వన్ పొజిషన్‌లో ఉంటున్నాయి. యాపిల్ ఫోన్ తయారు గురించి స్టీవ్ జాబ్స్ ఒకానొక సమయంలో మీడియా అడిగిన ..అసలు యాపిల్ సక్సెస్ సీక్రెట్ ఏమిటి అని..ఇలా జవాబిచ్చారు. మనం తయారు చేసే ఏ వస్తువు కానివ్వండి ..అమ్ముడు పోతుందా లేదా అన్నది కాదు ముఖ్యం..పది కాలాల పాటు నాణ్యవంతంగా , సమర్థవంత...