జ‌గ‌న్ ప్ర‌జా ద‌ర్బార్ - జ‌నంతో ముఖాముఖి

ఏ ముహూర్తాన ఆంధ‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారో కానీ ..సందింటి జ‌గన్మోహ‌న్ రెడ్డి ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప‌రిపాల‌న సాగిస్తున్నారు. ఉన్న‌తాధికారుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రికి భ‌ద్రమైన జీవితం వుంటుంద‌ని స్ప‌ష్టం చేస్తూనే మ‌రో వైపు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌ని, మ‌రింత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని హెచ్చ‌రించారు. ఏ మాత్రం తేడా వ‌స్తే ఉపేక్షించ‌బోనంటూ ప్ర‌క‌టించారు. దేశంలోనే పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న అందిస్తామ‌ని, ఈ రాష్ట్రం మిగ‌తా రాష్ట్రాల‌కు ఆద‌ర్శవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతాన‌ని చెప్పారు జ‌గ‌న్. ఏ రోజు ఏ ప‌థ‌కం ప్ర‌క‌టిస్తారో, ఏ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడ‌తారో తెలియ‌క హ‌య్య‌ర్ అఫీసియ‌ల్స్ ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. కొన్నేళ్ల‌పాటు ప్ర‌జా సంక‌ల్ప యాత్రను చేప‌ట్టిన ఈ యువ నాయ‌కుడు వారి బాధ‌ల‌ను, స‌మ‌స్య‌ల‌ను విన్నారు..చూశారు.

అవినీతి, అక్రమాల‌కు తావు ఉండ‌రాద‌ని, ఎవ‌రైనా అడిగినా లేదా డిమాండ్ చేసినా త‌క్ష‌ణ‌మే త‌నకు నేరుగా ఫోన్ చేయాల‌ని జ‌గ‌న్ సూచించారు. ఆ మేర‌కు వెంట‌నే త‌న నెంబ‌ర్ ఇవ్వాల‌ని ఆదేశించారు. మ‌రో వైపు కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. జూలై 1 నుంచి ప్ర‌జా ద‌ర్బార్‌ను ప్రారంభిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌తి రోజూ ఒక గంట పాటు సామాన్య ప్ర‌జ‌ల కోసం కేటాయించ‌నున్న‌ట్లు తెలిపారు. దీని ద్వారా ప్ర‌జ‌లు త‌న పాల‌న గురించి ఏమ‌నుకుంటున్నారో తెలుసుకునే వీలు క‌లుగుతుంద‌ని, అంతేకాకుండా తాను ఇంకేం చేయాలో కూడా తెలుస్తుంద‌ని, అందుకే ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాన‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం త‌న క్యాంపు కార్యాల‌యంలో ఉంటుంద‌న్నారు. గ‌తంలో త‌న తండ్రి ఉమ్మ‌డి ఏపీకి సీఎంగా ఉన్న త‌న తండ్రి డాక్ట‌ర్ వై.ఎస్. రాజశేఖ‌ర్ రెడ్డి సైతం ఉద‌యం వేళ‌ల్లో ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునే వారు.

అప్ప‌టిక‌ప్పుడే సంత‌కాలు చేసేవారు. సంబంధిత శాఖాధికారుల‌కు ఆదేశాలు వెళ్లేవి. సేమ్ టు సేమ్..త‌న తండ్రి అడుగు జాడ‌ల్లో కొడుకు న‌డుస్తున్నాడ‌ని అనుకోవాలి. ఏపీ ప్ర‌జ‌లు ఓ ర‌కంగా సంతోషానికి లోన‌వుతున్నారు ఈ యువ నేత పాల‌న‌ను చూసి. ఇందు కోసం ఉన్న‌తాధికారులు ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన పాల‌న అందించాల‌న్నా, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు కావాల‌న్నా కేవ‌లం క‌లెక్ట‌ర్లు, ఆర్డీఓలు, ఇత‌ర ఉన్న‌తాధికారుల వ‌ల్ల కాద‌ని జ‌గ‌న్ తెలుసుకున్నారు. అందుకే ప్ర‌తి గ్రామానికి వాలంటీర్ ను నియ‌మిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇంట‌ర్ అర్హ‌త ఉండాల‌ని, వారికి ప్ర‌తి నెలా 5 వేల రూపాయ‌ల గౌర‌వ వేత‌నం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న క్యాంపు కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో ఓ వైపు ఆయ‌న కోసం వ‌చ్చే సంద‌ర్శ‌కులు వేచి ఉండేందుకు ఓ షెడ్యును ఏర్పాటు చేస్తున్నారు. వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నారు. ప్ర‌జాద‌ర్బార్ లో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విన‌తులు, నివేద‌ల‌ను సీఎం స్వీక‌రిస్తారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!