అంద‌రి చూపు క‌రీంన‌గ‌ర్ వైపు - క‌రీంన‌గ‌ర్ మేయ‌ర్‌కు స‌లాం..!

మ‌న రాష్ట్ర‌మే కాదు ..జాతి యావ‌త్తు క‌రీంన‌గ‌ర్ వైపు చూస్తోంది. ఆ ప‌ట్ట‌ణ మేయ‌ర్ అధికార పార్టీకి చెందిన వ్య‌క్తి ర‌వీంద‌ర్ సింగ్. ఆయ‌న అంద‌రి లాగా హంగు, ఆర్భాటాల‌కు, అధికార ద‌ర్పానికి చోటివ్వ‌రు. ప్ర‌జల‌కు ఏం కావాలో , వారికున్న స‌మ‌స్య‌లు ఏమిటో ..వాటిని ఎలా ప‌రిష్క‌రించాలోన‌ని నిత్యం ఆలోచిస్తుంటారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే వుంటారు. వారికి క‌నీస వ‌స‌తుల‌ను క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ర‌వీంద‌ర్ సింగ్ పేరు దేశ వ్యాప్తంగా వైర‌ల్ గా మారింది. ఎందుకంటే ఆయ‌న తీసుకున్న సాహోసోపేత‌మైన నిర్ణ‌యం ల‌క్ష‌లాది మంది జ‌నాన్ని ఆలోచింప చేసేలా చేసింది. ఏ ప్ర‌భుత్వం , ఏ ప్ర‌జాప్ర‌తినిధి, ఎమ్మెల్యే, ఎంపీలు , ఐఏఎస్‌లు చేయ‌ని ప‌నిని ఈ మేయ‌ర్ చేశారు. అదేమిటంటే కేవ‌లం ఒకే ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు ..కార్పొరేష‌నే ద‌గ్గ‌రుండి ఎవ‌రైనా చ‌నిపోతే..ఏ కులానికి చెందిన వారైనా, ఏ మ‌తానికి చెందిన వారైనా సరే అంతిమ యాత్ర నిర్వ‌హించ‌డంతో పాటు అంత్య‌క్రియ‌లు చేస్తుంది.

ర‌వీంద‌ర్ సింగ్ తీసుకున్న ఈ నిర్ణ‌యానికి వేలాది మంది జేజేలు ప‌లికారు. ఆయ‌న‌ను ఆద‌ర్శంగా తీసుకుని మ‌రికొన్ని మున్సిపాలిటీల‌లో దీనిని అమ‌లు చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. మార్కెట్‌లో ఒక్క రూపాయికి విలువే లేదు. కానీ ర‌వీంద‌ర్ సింగ్ మాత్రం ఆ ఒక్క రూపాయికి మాన‌వ‌తా విలువ‌ల‌ను జోడించారు. దీంతో రూపాయి బ్రాండ్ అమాంతం పెరిగేలా చేశారు. ఆ ఒక్క రూపాయి మీ ద‌గ్గ‌ర వుంటే చాలు ..రోగ నిర్ణార‌ణ ప‌రీక్ష‌లు ఫ్రీ. ఇవాళ ఏ ఆస్ప‌త్రికి వెళ్లినా బిల్లులు త‌డిసి మోపెడంత అవుతున్నాయి. ర‌క్త‌, యూరిన్, త‌దిత‌ర టెస్టులు చేయించు కోవాలంటే క‌నీసం మ‌న వ‌ద్ద 5 వేల రూపాయ‌లైనా వుండాల్సిందే. పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఇప్ప‌టికే వానలు ప‌డ‌క పోవ‌డంతో తిండి తిప్ప‌ల‌కు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఉపాధి దొర‌క‌క నానా తంటాలు ప‌డుతున్నారు. ఈ స‌మ‌యంలో అనారోగ్యానికి గురైతే ఇక అప్పులు చేయాల్సిందే.

దీనిని గ‌మ‌నించిన క‌రీంన‌గ‌ర్ మేయ‌ర్ సాబ్..సింగ్..మ‌రో వినూత్న ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. పేద ప్ర‌జ‌ల‌కు భారం కాకుండా న‌గ‌ర పాల‌క సంస్థ ఆధ్వ‌ర్యంలో రూపాయికే రోగ నిర్ణార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. స్మార్ట్ సిటీ ప‌థ‌కంలో భాగంగా ప‌లు న‌గ‌రాలు కొత్త విష‌యాల‌తో ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నాయ‌ని సింగ్ తెలిపారు. న‌గ‌ర వాసుల కోసం కొత్త ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. ఇప్ప‌టికే రూపాయికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్నామని, ఇపుడు హెల్త్ టెస్టింగ్‌లు కూడా ఉచితంగా అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. రూపాయికే ర‌క్త‌, మూత్ర‌, బీపీ, షుగ‌ర్ ప‌రీక్ష‌లు చేసి ఇస్తామ‌న్నారు. ఇందు కోసం ప్ర‌యోగ‌శాల‌లు, ప‌రిక‌రాల కొనుగోలుకు 25 ల‌క్ష‌లు మంజూరు చేసినట్లు వెల్ల‌డించారు. మొత్తం మీద జ‌నం కోసం ప‌నిచేస్తున్న ఈ మేయ‌ర్ నిజ‌మైన ప్ర‌జానాయ‌కుడిగా జేజేలు అందుకుంటున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!