ముంబ‌యి..మోస్ట్ కాస్ట్‌లీ సిటీ

ప్ర‌పంచంలోనే అత్యంత కాస్ట్‌లీ న‌గ‌రాల‌లో ఇండియాలోని ముంబ‌యి న‌గ‌రం చోటు ద‌క్కించుకుంది. ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చి ఇండియాలో నివ‌సించాలంటే అత్యంత సేఫెస్ట్, ఖ‌రీదైన ప్రాంతంగా ముంబ‌యి చేరింది. మెర్స‌ర్ అధ్య‌య‌న నివేదికలో ఈ విష‌యం వెల్ల‌డించింది. ఆసియా ఖండంలో 20 అత్యంత ఖ‌రీదైన న‌గ‌రాల‌లో ఒక‌ట‌ని తెలిపింది. గ్లోబ‌ల్ క‌న్స‌ల్టింగ్ సంస్థ మెర్స‌ర్ ప్ర‌తి ఏటా స‌ర్వే చేస్తుంది. జాబితాను ప్ర‌క‌టిస్తుంది. ఈసారి ప్ర‌పంచ వ్యాప్తంగా 209 దేశాల్లో జీవ‌న వ్య‌యంపై విస్తృతంగా అధ్య‌య‌నం చేసింది. ఈ కంపెనీ 25వ వార్షిక జాబితాలో ముంబై మ‌హా న‌గ‌రం 67వ స్థానంలో నిలిచింది. గ‌త ఏడాదితో పోలిస్తే 12 స్థానానికి దిగ జారింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మ‌రింత ఖ‌రీదైన‌దిగా మారిందిని పేర్కొంది. క‌నీసం బ‌య‌ట భోజ‌నం చేసేందుకు అయ్యే ఖ‌ర్చులు , ఇత‌ర సేవ‌ల వ్య‌యాలు త‌గ్గు ముఖం ప‌ట్టిన‌ప్ప‌టికీ ప్ర‌పంచంలో గృహాలు అత్య‌ధిక రేటు ప‌లుకుతున్న న‌గ‌రాల్లో ఇది ఒక‌టిగా మెర్స‌ర్ తెలిపింది. 

ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన న‌గ‌రాల్లో ఒక‌టిగా నిలిచిందని స‌మ‌గ్ర రిపోర్టులో నివేదించింది. వ‌ర‌ల్డ్ వైడ్ లిస్ట్‌లో ఢిల్లీ న‌గ‌రం 118వ స్థానంలో నిల‌వ‌గా, చెన్నై సిటీ 154 వ ప్లేస్‌లో ఉంటే, బెంగ‌ళూరు ప‌ట్ట‌ణం 179వ స్థానంలో, కోల్‌క‌తా 189వ ప్లేస్‌లో నిలిచాయి. గ‌త ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నాలుగు న‌గ‌రాల ర్యాంకింగ్ త‌గ్గింది. ఇత‌ర దేశాలు, న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌తో పోలిస్తే భార‌త న‌గ‌రాల్లో ధ‌ర‌ల పెరుగుద‌ల మంద‌గించ‌డంతో పాటు డాల‌ర్ తో రూపాయి మార‌కం రేటు బ‌ల‌హీన ప‌డ‌టం కూడా మ‌రో కార‌ణమ‌ని మెర్స‌ర్స్ తెలిపింది. అయితే ప్ర‌పంచంలోని ప‌ది అత్యంత ఖ‌రీదైన న‌గ‌రాల‌ను ప్ర‌క‌టిస్తే అందులో ఇండియాకు చెందిన‌వి 8 న‌గ‌రాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేసింది. వ‌రుస‌గా రెండో ఏడాది హాంకాంగ్ మోస్ట్ కాస్ట్‌లీ సిటీగా నిలిచింది. త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకుంది. అత్యంత చౌక న‌గ‌రాల్లో ట్యూనిస్ 209వ స్థానం పొంద‌గా, తాష్కెంట్ 208, పాకిస్తాన్‌లోని క‌రాచీ 207వ స్థానంలో నిలిచాయి. 

మొద‌టి నుంచి ముంబ‌యి వ్యాపార‌, ప‌రిశ్ర‌మ‌ల‌కు పెట్టింది పేరు. భారీ, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు ముంబ‌యి న‌గ‌రం చుట్టూ కొలువుతీరి ఉన్నాయి. వేలాది మందికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి క‌ల్పిస్తున్నాయి. గుజ‌రాత్, ముంబ‌యి వ్యాపార రంగంలో ప్ర‌ధాన భూమిక‌ను పోషిస్తున్నాయి. కోట్లాది రూపాయ‌ల ఆదాయాన్ని గ‌డిస్తున్నాయి. అటు సౌత్ ఇండియాలో ఇటు నార్త్ ఇండియా అంత‌టా విస్త‌రించాయి. లాజిస్టిక్ రంగంలో ప్ర‌ధాన కంపెనీల‌న్నీ ఈ న‌గ‌రానికే ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తున్నాయి. న‌గ‌ర జ‌నాభా పెరుగుతూ ఉండ‌డంతో పొల్యూష‌న్ చుట్టూరా క‌మ్ముకుంది. ఇండియ‌న్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు ప‌లుమార్లు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తూనే ఉన్న‌ది. సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు బ‌తికే ప‌రిస్థితులు ముంబ‌యిలో ప్ర‌స్తుతం లేవు. ముంబ‌యి ముఖ చిత్రం గురించి ..ధార‌వి సినిమా కూడా వ‌చ్చింది. అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు, మాఫియాకు పెట్టింది పేరు ఈ న‌గ‌రం. ఎంద‌రు పాల‌కులు మారినా ముంబ‌యి లైప్ మార‌లేదు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!