ముంబ‌యిలో అధికారిక యాపిల్ స్టోర్

ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ న‌మ్మ‌క‌మైన కంపెనీ ఏదంటే ..ఎవ‌రైనా ఠ‌క్కున స‌మాధానం చెప్పేది యాపిల్ కంపెనీనే. కోట్లాది జ‌నం గుండెల్ని మీటిన ఈ సంస్థ నుంచి ఏ ప్రొడ‌క్ట్ వ‌చ్చినా..ఏ యాక్స‌స‌రీస్ వ‌చ్చినా స‌రే లైన్‌లో నిల్చుని తీసుకుంటారు. యాపిల్ బ్రాండ్ నేమ్ ఉన్న‌ది ఏదైనా చేతిలో ఉంటే దాని లుక్, గెట‌ప్‌, దాని స్టేట‌స్ వేరంటారు ఫ్యాన్స్. ధ‌ర ఎంతున్నా కొనేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఐటీ సెక్టార్‌లో వేగంగా దూసుకు వ‌చ్చింది ఈ కంపెనీ. ఆయా దేశాధినేత‌ల నుంచి సామాన్యుల దాకా ఫ‌స్ట్ ప్ర‌యారిటీ ఏదంటే యాపిల్‌నే. త‌ర్వాతి స్థానం శాంసంగ్‌ది. గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు కూడా మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు మార్కెట్‌లోకి తీసుకు వ‌చ్చినా యాపిల్ కంపెనీతో పోటీ ప‌డ‌లేక పోయాయి.

గ‌త కొన్నేళ్ల నుంచి యాపిల్ ప్రాడ‌క్ట్స్ టాప్ వ‌న్ పొజిష‌న్‌లో ఉంటున్నాయి. యాపిల్ ఫోన్ త‌యారు గురించి స్టీవ్ జాబ్స్ ఒకానొక స‌మ‌యంలో మీడియా అడిగిన ..అస‌లు యాపిల్ స‌క్సెస్ సీక్రెట్ ఏమిటి అని..ఇలా జ‌వాబిచ్చారు. మ‌నం త‌యారు చేసే ఏ వ‌స్తువు కానివ్వండి ..అమ్ముడు పోతుందా లేదా అన్న‌ది కాదు ముఖ్యం..ప‌ది కాలాల పాటు నాణ్య‌వంతంగా , స‌మ‌ర్థ‌వంతంగా ఉందా లేదా అన్న‌ది ముఖ్యం అంటారు. ప్ర‌తి క‌స్ట‌మ‌ర్ మాకు ముఖ్య‌మే. ప్ర‌పంచంలో ఎక్క‌డికైనా వెళ్లినా ..ఏ మూల‌లో ఉన్నా స‌రే యాపిల్ కంపెనీకి చెందిన మొబైల్ ఒక‌టి ఉండాల్సిందే. అదో స్టేట‌స్ సింబ‌ల్. అదో ప్ర‌పంచాన్ని శాసించే ప‌రిక‌రం మాత్ర‌మే కాదు ఓ వాహ‌కం అని అర్ధ‌వంతంగా ..అద్భుతంగా చెప్పారు. అందుకే యాపిల్ నుంచి ఏ ప్రాడ‌క్ట్ వ‌చ్చినా చిన్న పిల్ల‌ల నుండి పెద్ద వాళ్ల దాకా అంతా త‌మ మొద‌టి ప్రాధాన్య‌త యాపిల్ అనే చెబుతారు.

దీనిని ఢీకొట్టేందుకు మిగ‌తా కంపెనీలు నానా తంటాలు ప‌డుతున్నాయి. గూగుల్ కంపెనీ ఏకంగా గూగుల్ ఎక్సా పేరుతో స్మార్ట్ ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. అలాగే శాంసంగ్ కూడా . కానీ యాపిల్ స్థానం యాపిల్‌దే. వేరే కంపెనీ ద‌రిదాపుల్లోకి రాలేక పోతోంది. కోట్లాది ప్ర‌జ‌ల‌ను క‌నెక్టివిటీ క‌లిగి వుండేలా చేస్తున్న యాపిల్ ఫోన్ ను త‌యారు చేయ‌డంలో ఎన్నో ఏళ్లు శ్ర‌మించారు. ఈ య‌జ్ఞంలో ఎంద‌రో పాలు పంచుకున్నారు. వారిలో స్టీవ్ జాబ్స్, క్రిస్ బ్లంబ‌ర్గ్, వెస్ట‌ర్ మ్యాన్, హెన్రీ లామార్క్స్, పాల్ డి మార్క‌స్, మార్సెల్ వాన్ ఓస్, గంటారియా, రిచ‌ర్డ్ విలియ‌మ్స‌న్, స్టీఫెన్ లేమే, ఎంజె బౌల్, స్కాట్ కింగ్, జెఫ్రీ బుష్ ఉన్నారు.

వీరితో పాటు జెర్మీ, బాస్ ఆర్డింగ్, ప్యాట్రిక్ లీ కాఫీమెన్, మైకేల్ మ‌టాస్, గ్రెగోరీ నోవిక్, ఇమ్రాన్ లు కీల‌క భూమిక పోషించారు. ఒక్క ఫోన్ త‌యారీ వెనుక ఇంత మంది శ్ర‌మ దాగి ఉన్న‌ది. తాజాగా యాపిల్ దిగ్గ‌జ కంపెనీ తాను త‌యారు చేసిన ప్ర‌తి వ‌స్తువును అమ్మేందుకు అధికారికంగా యాపిల్ స్టోర్‌ను ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకు గాను ఇండియాలోని ముంబ‌యిలో త్వ‌ర‌లో ఫ‌స్ట్ అఫీసియ‌ల్ స్టోర్‌ను స్టార్ట్ చేయ‌నున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. దీంతో యాపిల్ ఫ్యాన్స్‌కు పండ‌గే పండుగ అన్న‌మాట‌. యాపిల్ కంపెనీకి సంబంధించి ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు స్టోర్‌లు ఉన్నాయి. న్యూయార్క్‌, లండ‌న్, పారిస్ ఎలీసిస్‌లో నాలుగు ఉండ‌గా ఇపుడు ఐదో స్టోర్ ప్రారంభించేందుకు ముంబ‌యి ఎంపికైంది. మొత్తం మీద మ‌రోసారి ఇండియా ఈ ర‌కంగా మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కింద‌న్న‌మాట‌.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!