లేచి పడిన పృథ్వీరాజ్

నటుడిగా తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న పృథ్వీరాజ్ ఇపుడు పునరాలోచనలో పడ్డారు. బాగున్నప్పుడు అంతా పోగైన జనం ఇపుడు పలు ఆరోపణలు ఎదుర్కొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ పదవి నుంచి అనూహ్యంగా తప్పుకోవడంతో ఎవరూ ఆయన దరిదాపుల్లోకి వెళ్లడం లేదు. ఈ విషయాన్ని, ఘోరమైన అవమానకరంగా భావిస్తున్నట్లు స్వయంగా ఈ నటుడే ఇటీవల వాపోవడం జరిగింది. పలు విజయవంతమైన సినిమాల్లో నటించి మెప్పించిన ఘనత పృథ్విది. అంతే కాకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం కలిగి ఉండడం కూడా ఆయన కెరీర్‌కు పెద్ద అడ్డంకిగా మారింది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చారు. పృథ్వీరాజ్ కు వైఎస్ ఆర్ అంటే పిచ్చి. అదే వైఎస్ జగన్‌కు హార్డ్ కోర్ ఫ్యాన్‌గా ఉంటూ వచ్చారు. అంతేకాకుండా జగన్ స్థాపించిన కొత్త పార్టీలో ఆయన వెంట కార్యకర్తగా పనిచేశారు. నమ్మకమైన నాయకుడిగా ఎదిగారు. ఏకంగా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. పార్టీ ప్రచారానికి రథసారథిగా ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఓ వైపు వృత్తి పరంగా కళాకారుడైన పృథ్వీరాజ...