ఔరా.. సైరా..!

డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. భారీ వసూళ్లను రాబడుతోంది. అయిదు భాషల్లో ఈ మూవీని విడుదల చేశారు. అమితాబ్ ప్రధాన పాత్రలో నటించగా మెగాస్టార్ చిరంజీవి నభూతో న భవిష్యత్ అన్న రీతిలో నటించారు. నయనతార, తమన్నా పోటీ పడగా తమిళ నటుడు విజయ సేతుపతి తన మార్క్ తో సినిమాకు ప్రాణం పోశారు. బుర్రా సాయి మాధవ్ మరోసారి తన మాటల తూటాలు పేల్చారు. మొత్తం మీద సురేందర్ రెడ్డి ఎక్కువ టైమ్ తీసుకున్నప్పటికీ అంతిమంగా మంచి రిజల్ట్ వచ్చింది. ఎక్కడ చూసినా సక్సెస్ అన్న టాక్ వినపడుతోంది. మొత్తం మీద సినిమాపై పెట్టిన ఖర్చు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాల అంచనా. ఇక ఓవర్సీస్ పరంగా చూస్తే అమెరికాలో సాహో రికార్డులను సైరా కొల్లగొట్టింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను సురేందర్ రెడ్డి రూపొందించారు. మెగాస్టార్ చిరంజీవి, నయనతార, తమన్నా లు బాగా నటించారని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుని మంచి వసూళ్లన...