మనోడు అపర కుబేరుడు..!

ధీరుభాయి అంబానీ పుత్ర రత్నం ముఖేష్ అంబానీ ఇండియాలో అపర కుబేరుడిగా మరోసారి వినుతికెక్కారు. రిలయన్స్ గ్రూప్ కంపెనీస్ కు చైర్మన్ గా వున్న ముఖేష్ మరోసారి వైరల్ గా మారారు. నిన్నటి దాకా జియో తో సెన్సేషనల్ సృష్టించిన ఈ వ్యాపార దిగ్గజం దెబ్బకు ఇతర కంపెనీలు లబోదిబోమంటున్నాయి. ఒకే ఒక్క ప్రకటనతో భారతీయ టెలికాం రంగాన్ని షేక్ చేశారు ధీరుభాయి సుపుత్రులు. తండ్రి స్థాపించిన రిలయన్స్ ను ఇవ్వాళ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీగా తీర్చిదిద్దారు. వేలాది మంది దీనిని నమ్ముకుని ఉన్నారు. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. ఒకే ఒక్క ప్రకటనతో ఇండియాలో షేర్స్ అమాంతం పైకి ఎగ బాకాయి. ప్రత్యర్థి కంపెనీల షేర్స్ డీలా పడ్డాయి. జియో లో నమోదైన కస్టమర్లు ఏకంగా 34 కోట్లకు చేరుకున్నారు. ఇది కూడా ఓ రికార్డ్. తాజాగా అపర కుబేరులు ఎవరో జాబితా విడుదలైంది. మొత్తం కుబేరుల్లో 3,80,700 కోట్ల తో అపర కుబేరుడుగా ముఖేష్ అంబానీ మొదటి ప్లేస్ లో నిలిచి చరిత్ర సృష్టించారు. రెండవ స్థానంలో హిందూజా, మూడో ప్లేస్ లో అజీమ్ ప్రేమ్ జి ఉన్నారు. మొత్తం 25 మంది కుబేరుల లిస్టును ప్రక...