మోస్ట్ పవర్ ఫుల్ మెన్ - ఇమ్రాన్ నోట మోడీ మాట

నిన్నటి దాకా చిలుక పలుకులు పలికిన పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఉన్నట్టుండి మాట మార్చాడు. ఇండియాతో ప్రతి క్షణం యుద్దానికి కాలు దువ్వుతోంది పాక్. ఎప్పుడైతే జమ్మూ, కాశ్మీర్లో 370 ఆర్టికల్ ను కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం రద్దు చేయడంతో ఇమ్రాన్ ఖాన్ మరింత రెచ్చి పోయాడు. భారత్ పై లేనిపోని ఆరోపణలు చేస్తూనే బురద జల్లడం ప్రారంభించారు. మరో వైపు ఉగ్రవాదులకు తమ ప్రాంతం అడ్డాగా ఉందని ఒప్పుకుంటూనే ఇండియాను ఇమ్రాన్ ఖాన్ టార్గెట్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అంతర్జాతీయ వేదికపై జరిగిన సమావేశంలో ఇండియాపై పాకిస్థాన్ ప్రతినిధి నిప్పులు చెరిగారు. జమ్మూ, కాశ్మీర్ తమదేనంటూ చెప్పుకొచ్చారు. అక్కడ పాల్గొన్న దేశాలలో ఒక్క చైనా దేశం తప్పా పాకిస్థాన్ కు ఏ ఒక్క దేశమూ మద్దతు పలకలేదు.

సరి కదా పాకిస్తాన్ ను ఉగ్రస్తాన్ అంటూ పేర్కొన్నాయి. ఇదే సమయంలో అమెరికాలో ఇమ్రాన్ ఖాన్ పర్యటించారు. ఆ దేశ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తో మీట్ అయ్యాడు. పాకిస్తాన్, ఇండియా దేశాలు చర్చలు జరిపి ఆసియాలో ఉద్రిక్త వాతావరణం లేకుండా చేయాలని, ఇందు కోసం తాను మధ్యవర్తిత్వం వహించేందుకు రెడీగా ఉన్నానంటూ ట్రంప్ స్పష్టం చేశారు. దీనిని భారత ప్రతినిధి తీవ్ర అభ్యంతరం తెలిపారు. వెంటనే ఇండియన్ ప్రధానమంత్రి స్పందించారు. జమ్మూ, కాశ్మీర్ అన్నది ఇండియాలో అంతర్భాగం. ఈ నేల, ఈ గాలి ప్రతిదీ భారత దేశానికి చెందినది అన్నారు. దాయాది పాకిస్థాన్ ఎన్ని కుట్రలు పన్నినా , లేక అవాకులు చెవాకులు చేసినా అదిరేది లేదు బెదిరేది లేదు. అవసరమైతే యుద్ధనికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంతే కాకుండా అణుయుద్ధానికైనా రెడీగా ఉన్నామంటూ అమెరికా అధ్యక్షుడికి స్పష్టం చేశారు.

అంతే కాకుండా తమ దేశంలో జోక్యం చేసుకునే హక్కు అమెరికాతో పాటు ప్రపంచంలో ఏ దేశానికి లేదంటూ స్పష్టం చేశారు. జైషే మహమ్మద్ కు చెందిన శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఇండియాపై కసితో రగిలి పోతున్నారని, త్వరలో ఇండియాను అస్థిర పరిచే వ్యూహంలో భాగంగా ఎప్పుడైనా దాడులకు పాల్పడే  ప్రమాదం ఉందంటూ భారత హోమ్ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు భారత ప్రధాని మోదీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో పాటు ఆంతరంగిక భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరో వైపు దోవల్ దెబ్బకు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం వేరే చోటుకు వెళ్లి పోయినట్లు గుర్తించారు. ఇక తాజాగా హౌడీ మోదీ కార్యక్రమం సక్సెస్ అయ్యింది. ఇదే సమయంలో మోదీ ట్రంప్ ల మధ్య సమావేశం జరిగింది. పాకిస్తాన్ తీవ్రవాదులకు అడ్డాగా మారిందని, దానిపై ఏ సమయంలోనైనా దాడులు చేస్తామంటూ చెప్పారు. ఇంకో వైపు పాక్ ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా మారింది. ఎంతైనా మోదీ చాలా పవర్ ఫుల్ మెన్ అంటూ ఇమ్రాన్ ఒప్పుకోక తప్పలేదు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!