మనోడు అపర కుబేరుడు..!
ధీరుభాయి అంబానీ పుత్ర రత్నం ముఖేష్ అంబానీ ఇండియాలో అపర కుబేరుడిగా మరోసారి వినుతికెక్కారు. రిలయన్స్ గ్రూప్ కంపెనీస్ కు చైర్మన్ గా వున్న ముఖేష్ మరోసారి వైరల్ గా మారారు. నిన్నటి దాకా జియో తో సెన్సేషనల్ సృష్టించిన ఈ వ్యాపార దిగ్గజం దెబ్బకు ఇతర కంపెనీలు లబోదిబోమంటున్నాయి. ఒకే ఒక్క ప్రకటనతో భారతీయ టెలికాం రంగాన్ని షేక్ చేశారు ధీరుభాయి సుపుత్రులు. తండ్రి స్థాపించిన రిలయన్స్ ను ఇవ్వాళ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీగా తీర్చిదిద్దారు. వేలాది మంది దీనిని నమ్ముకుని ఉన్నారు. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. ఒకే ఒక్క ప్రకటనతో ఇండియాలో షేర్స్ అమాంతం పైకి ఎగ బాకాయి. ప్రత్యర్థి కంపెనీల షేర్స్ డీలా పడ్డాయి. జియో లో నమోదైన కస్టమర్లు ఏకంగా 34 కోట్లకు చేరుకున్నారు. ఇది కూడా ఓ రికార్డ్. తాజాగా అపర కుబేరులు ఎవరో జాబితా విడుదలైంది. మొత్తం కుబేరుల్లో 3,80,700 కోట్ల తో అపర కుబేరుడుగా ముఖేష్ అంబానీ మొదటి ప్లేస్ లో నిలిచి చరిత్ర సృష్టించారు.
రెండవ స్థానంలో హిందూజా, మూడో ప్లేస్ లో అజీమ్ ప్రేమ్ జి ఉన్నారు. మొత్తం 25 మంది కుబేరుల లిస్టును ప్రకటించారు. మొత్తం భారతీయ జీడీపీ లో వీరి మొత్తం సంపద పది శాతంతో సమానం. మొత్తం వంద మందిలో మన తెలుగు వారికి చోటు దక్కడం విశేషం. ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురన్ ఇండియా రిచ్ జాబితా చూస్తే విస్తు పోయేలా ఉన్నది. ఉన్నఫలంగా శ్రీమంతులు 953 కు పెరిగారు. అయితే ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ మొత్తం విలువ..3,74,518 కోట్లు. కానీ.. అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద విలువ మొత్తం ఈ రెండింటికంటే ఎక్కువ. ఫార్మా, కన్‌స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్, సిమెంట్, మెరైన్ పోర్ట్, సర్వీసులు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ బేవరేజెస్, క్యాపిటల్ గూడ్స్, సాఫ్ట్‌వేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, కెమికల్స్, పెట్రోకెమికల్స్ కంపెనీలున్నాయి. ఇక భారత్‌లో వరుసగా ఎనిమిదో సారి ముఖేష్ అంబానీ నెంబర్ వన్ సంపన్నుడిగా స్థానం దక్కించు కోవడం విశేషం. 1,000 కోట్లకు పైగా నెట్‌వర్త్ కలిగిన ఇండియన్స్ తో ఐఐఎ్‌ఫఎల్ ఈ జాబితాను రూపొందించింది.
స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీలను నిర్వహిస్తున్న వారితో పాటు వ్యక్తిగంతంగా వ్యాపార కార్యకలాపాలను సాగిస్తున్న వారితో ఈ జాబితాను తయారు చేసింది. లండన్‌కు చెందిన ఎస్‌పీ హిందూజా అండ్ ఫ్యామిలీ 1,86,500 కోట్ల సంపదతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో 1,17,100 కోట్ల తో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ నిలిచారు. నాలుగో ప్లేస్ లో ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్, సీఈఓ ఎల్‌ఎన్ మిట్టల్ , ఐదో స్థానంలో గౌతమ్ అదానీ, ఆరో స్థానంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ సారథి ఉదయ్ కోటక్ , ఏడో స్థానంలో సైరస్ మిస్ర్తీ నిలిచారు. ఎనిమిదో స్థానంలో సైరస్ పల్లోంజీ మిస్ర్తీఉండగా తొమ్మిదో స్థానంలో షాపూర్జీ పల్లోంజీ , పదో స్థానంలో సన్ ఫార్మా సూటికల్స్ వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ ఉన్నారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు 74 మంది చోటు దక్కించుకున్నారు. వీరి మొత్తం సంపద నుంచి కనీసం 10 శాతం సామాజిక భాద్యతగా భావించి ఖర్చు చేస్తే బావుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి