ఇందూరు రైతన్నలకు తమిళ తంబీల బాసట

తమ గోడు వినాలని..తాము పండించిన పంటకు కనీస మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో తమిళనాడుకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఏళ్ల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కనీసం తమను మనుషులుగా కూడా గుర్తించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు రావడం లేదని, మినిమం మార్కెట్ ప్రైజ్ కూడా ఇవ్వడం లేదంటూ ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని కోరుతూ నిరనస వ్యక్తం చేశారు. అంతకు ముందు ముంబయి నుండి భారీ ఎత్తున రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేపట్టారు. ఇందులో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. వారు పార్లమెంట్‌ను ముట్టడించకుండా పోలీసులు అడ్డుకున్నారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ విషయంపై ప్రధాన పార్టీలన్నీ అభ్యంతరం వ్యక్తం చేశాయి. వీరిని స్పూర్తిగా తీసుకున్న తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతులు పోరుబాట పట్టారు. దేశంలోనే అత్యధికంగా పసుపు, చెరుకు, కందులను సాగు చేస్తారు ఈ జిల్లాలో. ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా కోరుతూ వస్తున్నారు. పాలకులు ...