వారెవ్వా వాట్సన్ ..సన్ రైజర్స్‌కు చెన్నై షాక్
ఐపీఎల్ టోర్నీలో చెన్నై జట్టు పటిష్టవంతమైన స్థితిలో ఉంది. ప్రత్యర్థులు ఎవరైనా సరే ..ఏ జట్టు అయినా సరే చూడడం లేదు. బౌలింగ్ లోను..బ్యాటింగ్‌లోను దుమ్ము రేపుతోంది. ఎంఎస్ ధోనీ కెప్టన్‌గా కొనసాగుతున్న ఈ జట్టులో ప్రతి ఆటగాడు కీలకమైన సమయంలో రాణిస్తున్నారు. సమిష్టిగా విరుచుకు పడుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన హోరా హారీ మ్యాచ్‌లో చెన్నై ..చుక్కలు చూపించింది. మరో వైపు సన్ రైజర్స్ ..తామేమీ తీసిపోమంటూ చెన్సై ఆటగాళ్లను ఆడుకున్నారు. అయినా వాట్సన్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై అద్భత విజయం సాధించింది. డేవిడ్ వార్నర్ ఎప్పటి లాగానే రాణించగా..మనీష్ పాండే తోడవ్వడంతో భారీ స్కోరు సాధించింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఫోర్లు, సిక్సర్లు అలవోకగా బాదాడు.
స్వంత గడ్డపై ఎదురేలేని చెన్నై..ఎనిమిదో విజయాన్ని స్వంతం చేసుకుంది. ప్లేఆఫ్ చేరుకున్న మొదటి జట్టుగా చెన్నై రికార్డు సృష్టించింది. సన్ రైజర్స్ జట్టులో మనీష్ పాండే 49 బంతులు ఎదర్కొని ఏడు ఫోర్లు , మూడు సిక్సర్లతో 83 పరుగులు చేయగా..డేవిడ్ వార్నర్ 45 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 57 పరుగులు చేయడంతో మూడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. రంగంలోకి దిగిన షేన్ వాట్సన్ ఎక్కడా తొట్రు పడలేదు. వచ్చీ రాగానే పరుగులు చేయడం స్టార్ట్ చేశారు. ఏ ఒక్క బౌలర్‌ను విడిచి పెట్టలేదు. 53 బంతులు ఎదుర్కొన్న ఈ క్రికెటర్ 9 ఫోర్లు, ఆరు కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. 96 పరుగులు చేశాడు.
దీంతో చెన్నై జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. వాట్సన్ అవుట్ అయ్యాక చెన్నై జట్టు కొంత ఇబ్బంది పడినా ఆ తర్వాత అలవోకగా గెలుపొందింది. లక్ష్య ఛేదనలో రంగంలోకి దిగిన ఆ జట్టు ఆరంభంలో ఏమంత పర్ ఫార్మెన్స్ కనబర్చలేదు. మూడు ఓవర్లలో రెండు పరుగులు మాత్రమే చేసింది. అదే ఓవర్్ లో డుప్లెసిస్ వికెట్‌ను కోల్పోయింది. హుడా మెరుపు త్రో దెబ్బకు వెనుదిరిగాడు. మైదానంలో అప్పటికే ఉన్న వాట్సన్ ఖలీల్ అహ్మద్ కు చుక్కలు చూపించాడు. ఐదో ఓవర్ లో సిక్స్, ఫోర్ కొట్టాడు. ఫాంలో లేని సందీప్ శర్మ ఆరో ఓవర్లో చెలరేగాడు. నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేశాడు.
తర్వాత ఇద్దరూ పోటీ పడి షాట్లు ఆడుతూ 8 ఓవర్లకు 68 పరుగులు చేశారు. పదో ఓవర్ లో రైనాను రషీద్ అవుట్ చేశాడు. పరుగులు తీసేందుకు కొంత ఇబ్బంది పడ్డారు. 9 ఓవర్లలో చెన్నై 91 పరుగులు చేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో వాట్సన్ రెచ్చి పోయాడు. సందీప్ వేసిన 12వ ఓవర్ లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. 14 ఓవర్లో రషీద్‌కు ఇదే గతి పట్టింది. 18 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి వచ్చింది. సెంచరీకి కేవలం నాలుగు పరుగుల దూరంలో వాట్సన్ వెనుదిరిగాడు. ఆ తర్వాత చెన్నై కష్టంగా విజయం సాధించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి