గేమింగ్ యాప్స్‌తో చిన్నారుల పరేషాన్
ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా గేమ్స్ యాప్స్ దర్శనమిస్తున్నాయి. కోట్లాది మంది చిన్నారులు ప్రపంచ వ్యాప్తంగా వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు. తమ బంగారు బాల్యాన్ని కోల్పోతున్నారు. వారు మానసికంగా, శారీరకంగా రోజు రోజుకు చిక్కి పోతున్నారు. పేరెంట్స్ సైతం వీరి ప్రవర్తనను చూసి తట్టుకోలేక ..ఆస్పత్రులను, కౌన్సెలింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల వీరి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పటికే గేమింగ్ యాప్స్ లక్షల్లో నిక్షిప్తమై పోయాయి. ఇంకా వివిధ దేశాలలో ఇంజనీరింగ్ ఎక్స్ పర్ట్స్ పిల్లలను దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. అయితే చదువు కోవాల్సిన పిల్లలు ఇపుడు గేమ్స్ ధ్యాసలో మునిగి తేలుతున్నారు. విలువైన కాలాన్ని చదువు కోసం కాకుండా వీటిని ఆటాడు కోవడంలోనే గడుపుతున్నారు. ఏమైనా తినాలన్నా గేమ్స్ చూసే అన్నీ చేస్తున్నారు.
లేకపోతే ఏదో కోల్పోయినట్లు ఫీలవుతున్నారు. వీరిని చూసి పేరెంట్స్ మానసికంగా చితికి పోతున్నారు. గేమింగ్ పరిశ్రమ డాలర్లను కురిపిస్తోంది. దీంతో ఇటీవల తెలంగాణ సర్కార్ టీ హబ్ ద్వారా గేమింగ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం ఐటీ గేమింగ్ కంపెనీలను ఏర్పాటు చేసే వారికి ఆర్థిక సాయంతో పాటు అన్ని వసతులు కల్పిస్తోంది. కొన్ని గేమింగ్ యాప్స్ ..అత్యంత ప్రమాదకరంగా తయారయ్యాయి. పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వీటి ద్వారా మంచి కంటే చెడే ఎక్కువగా చోటు చేసుకుంటోంది. అత్యంత ప్రమాదకరంగా తయారు కావడంతో చాలా దేశాలలో పిల్లలకు ఇబ్బందికరంగా ఉందంటూ పేరెంట్స్ గగ్గోలు పెడుతున్నారు. ఇక ఇండియా వరకు వస్తే ..చాలా గేమ్స్ యాప్స్ ను కోట్లాది మంది తమ మొబైల్స్ లో డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా వాటిని చూస్తూనే ఉన్నారు. వాటిలోనే గడుపుతున్నారు. గేమింగ్ యాప్స్ డేంజర్‌గా మారడంతో దీనిపై కేంద్ర సర్కార్ నజర్ పెట్టింది.
పేరెంట్స్ బాధను అర్థం చేసుకున్న ఉన్నతస్థాయి అధికారులు తక్షణమే ..చైనాకు చెందిన కొన్ని గేమింగ్ యాప్‌లను నిలిపి వేయాలని ఆదేశించింది. ఇదే దేశానికి చెందిన ప్రముఖ వీడియో యాప్ టిక్ - టాక్‌ను నిషేధించింది. అయితే ఈ నిర్ణయంపై మరోసారి పునరాలోచించాలని ఆ సంస్థ కోరింది. నిషేధించడం వల్ల రోజుకు 5 లక్షల డాలర్లు నష్టపోతున్నామని, 250 మంది ఉద్యోగులు రోడ్డున పడతారని తెలిపింది. వీడియోలకు హంగులు జోడించి ..ఫ్రెండ్స్‌తో పంచుకునే టిక్ టాక్ యాప్ ఎంతో పాపులర్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్ ను ఒక బిలియన్ కు పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా పోర్నోగ్రఫి వ్యాపిస్తోందని ..సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఇండియాలో 300 మిలియన్ల మంది దీనిని వాడుతున్నారు. దీంతో సమస్య తీవ్రతను గమనించిన ధర్మాసనం వెంటనే నిషేధం విధించాలని ఆదేశించింది. ఐటీ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. యాపిల్, గూగుల్‌లు తమ యాప్ స్టోర్స్ నుండి టిక్ టాక్ ను తొలగించింది. ఇలాంటి గేమింగ్ యాప్స్ చాలా స్టోర్స్‌లలో ఉన్నాయి. వీటి పట్ల పేరెంట్స్ అప్రమత్తం కాక పోతే ..తమ పిల్లల భవిష్యత్‌ను తామే నాశనం చేసిన వారవుతారు జాగ్రత్త.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి