ఆరు వందలకే అన్నీ - రిలయన్స్ మరో సంచలనం
ప్రపంచ టెలికాం రంగంలోనే అతి పెద్ద టెలికాం రంగ సంస్థగా ఇప్పటికే రికార్డు నమోదు చేసింది ఇండియాకు చెందిన రిలయన్స్ టెలికాం సంస్థ. అనిల్ అంబానీ కొడుకు, కూతురు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ అనూహ్యమైన విజయాలు నమోదు చేసుకుంటోంది. ప్రత్యర్థుల అంచనాలకు అందని రీతిలో తన మార్కెట్‌ను విస్తరించుకుంటూ వెళుతోంది. మొదటిసారిగా ప్రతి ఒక్కరికి అతి తక్కువ ధరకే డేటా, వీడియో కాల్స్ కూడా అందజేస్తామంటూ చేసిన ప్రకటనను మిగతా టెలికాం కంపెనీలు ఎయిర్ టెల్, ఐడియా, ఒడాఫోన్, బీఎస్ఎన్ఎల్ , యునినార్ లు పెదవి విరిచాయి. కోట్లాది భారతీయులకు చేరువ కావడం అన్నది కల తప్ప నిజం కాదంటూ కామెంట్స్ చేశాయి. తమ దరికి రిలయన్స్ రాలేదంటూ ఎయిర్ టెల్ బీరాలు పలికింది. ఆయా టెలికాం ఆపరేటర్లకు దిమ్మ తిరిగేలా..జీవిత కాలం గుర్తుంచుకునేలా కోలుకోలేని షాక్ ఇచ్చింది రిలయన్స్ కంపెనీ.
జియో పేరుతో అతి చౌకగా డేటా సౌకర్యంతో పాటు అన్నీ ఉచితంగానే వీడియో, ఆడియో కాల్స్ సదుపాయాలు కల్పిస్తూ రంగంలోకి ఎంటర్ అయింది. ఆకర్షణీయమైన ప్లాన్లతో కోట్లాది మంది భారతీయులు జియోలో చేరి పోయారు. అంతేకాకుండా ఇతర టెలికాం ఆపరేర్లలో సభ్యులైన వారంతా జియోకు జారి పోయారు. దీంతో లక్షల్లో ఉన్న సబ్ స్క్రైబర్స్ కోట్లల్లోకి చేరుకుంది. ఇది ఓ రికార్డుగా నమోదైంది. దేశ వ్యాప్తంగా ప్రతి మండలంలో రిలయన్స్ జియో తన స్టోర్‌లను ఏర్పాటు చేసింది. కొద్ది పాటి డబ్బులు చెల్లిస్తే చాలు ఆక్సెసరీస్‌తో పాటు స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తోంది. అపరిమితమైన ఇంటర్నెట్ ను వినియోగించుకునేలా ఛాన్స్ కల్పించడంతో జనం క్యూ కట్టారు. ఇబ్బడి ముబ్బడిగా జియో కనెక్షన్స్ తీసుకున్నారు. ఎక్కడ చూసినా..ఎవరి చేతిలోనైనా అంతా రిలయన్స్ జియోనే. టెలికాం రంగంలో ఇదో సంచలనం సృష్టించింది.
అత్యంత చౌకగా ఉచిత వాయిస్ కాల్స్, 4జీ డేటాను అందించి తక్కువ కాలంలోనే ఆదరణ చూరగొంది. కోట్లాది ఇండియన్స్ ఇపుడు జియో జపం చేస్తున్నారు. తాజాగా రిలయన్స్ గిగా ఫైబర్‌ను వివిధ పట్టాణాలకు విస్తరించేలా చేసింది. ఇందులో భాగంగా బ్రాడ్ బ్యాండ్, ల్యాండ్ లైన్, టీవీ కాంబోలను తీసుకు రానున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఈ మూడింటి కాబో ధర కేవలం 600 రూపాయలు మాత్రమే నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ ఒక్క విషయంపై ఇంకా సంస్థ నుంచి క్లారిటీ రాలేదు. గత ఏడాది ఆగష్టు నెలలో జియో గిగా ఫైబర్ సర్వీసును ప్రారంభించారు. దశల వారీగా ప్రముఖ పట్టణాల్లో దీనిని విస్తరించేలా చేస్తోంది.
జియో ఫైబర్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారు వన్ టైం సెక్యూరిటీ డిపాజిట్ కింద 4 వేల 500 రిఫండబుల్ కింద చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలల పాటు నెలకు 100 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. కస్టమర్స్ నుండి భారీగా డిమాండ్ రావడంతో జియో ఫైబర్‌ను విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం జియో అందిస్తున్న రూటర్ ద్వారా మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్, స్మార్ట్ టీవీ తో సహా దాదాపు 40 నుండి 45 డివైజ్ లను కనెక్ట్ చేసుకునే వీలు కలుగుతోంది. ఇందుకు నెలకు 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సీసీ టీవీ, ఇతర క్లౌడ్ నెట్ వర్క్ కోసమూ వినియోగించు కోవచ్చని చెబుతోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి