కరోనా..క్యా కర్‌నా

కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. నిన్నటి దాకా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్న పెద్దన్న ఇపుడు వైరస్ వ్యాప్తి చెందడం, బాధితులు అంతకంతకూ ఎక్కువ కావడం, నివారణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన సౌకర్యాలు లేక పోవడంతో ప్రెసిడెంట్ పునరాలోచనలో పడ్డారు. త్వరలో ఎన్నికలు జరగనుండడంతో ఈ వ్యాధిని కంట్రోల్ చేయడంలో సరైన శ్రద్ధ చూపించలేదు. దీంతో బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిన్నటి దాకా చైనా వరల్డ్ వైడ్ గా చూస్తే టాప్ వన్ లో ఉండగా ఇపుడు దానిని ఇటలీ దాటేసింది. వేలాది మంది పిట్టల్లా రాలుతున్నా ఏమీ చేయలని స్థితిలోకి చేరుకుంది ఈ కంట్రీ. ఇదిలా ఉండగా ఆర్థికంగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న అమెరికా ను కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బాధితుల సంఖ్య ఇటలీని దాటేసింది. ఒక వేళ ఈ వైరస్ మరింత విజృంభిస్తే యుఎస్ దగ్గర కంట్రోల్ చేసేందుకు కావాల్సిన సదుపాయాలు, సిబ్బంది, నిపుణులు, వైద్యులు లేక పోవడం బాధాకరం. అమెరికన్లు ఈ వ్యాధిని తల్చుకుని కుమిలి పోతున్నారు. ట్రంప్ ఎందుకు చర్యలు చేపట్టడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. 24 గంటల వ్యవధిలోనే పది వేల కొత్త ...