కరోనా కోసం సెలబ్రెటీల సాయం
కరోనా వైరస్ దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సినీ రంగానికి చెందిన పలువురు సినీ ప్రముఖులు తమ ఉదారతను చాటుకున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, నరేష్ , రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, నితిన్, తదితరులతో పాటు సినీ దర్శకులు, నిర్మాతలు సైతం కరోనా వ్యాధి నివారణ కోసం కృషి చేస్తున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలకు తమ వంతు సహకారాన్ని విరాళాల రూపేణా అందజేస్తున్నట్లు ప్రకటించారు. వీరందిరలో ఎక్కువగా సాయం ప్రకటించింది మాత్రం ప్రభాస్ ఒక్కడే. ఆయన ఏకంగా 4 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఇందులో మూడు కోట్ల రూపాయలను ప్రధానమంత్రి ఎమర్జెన్సీ ఫండ్ కు ఇవ్వగా ఏపీ, తెలంగాణలకు చెరో 50 లక్షలు ఇస్తున్నట్లు వెల్లడించారు. చిరంజీవి కోటి, రామ్ చరణ్ 75 లక్షలు, మహేష్ బాబు కోటి, జూనియర్ ఎన్టీఆర్ 75 లక్షలు, నరేష్ 10 లక్షలు, నితిన్ 10 లక్షలు, సాయి ధరమ్ తేజ్ 10 లక్షలు ప్రకటించారు.
దర్శకులు త్రివిక్రం శ్రీనివాస్ రెండు రాష్ట్రాలకు 10 లక్షల చొప్పున ప్రకటించగా దిల్ రాజు, సతీష్ వేగ్నెషలు 10 లక్షల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. అందరికంటే ముందే కరోనా వ్యాధి బాధితుల కోసం సాయంగా తమిళ తలైవా రజనీకాంత్ 50 లక్షలు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇంకో వైపు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, దర్శకుడు అనిల్ రావిపూడిలు సైతం సాయం ప్రకటించారు. తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్ సినీ కార్మికులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ 5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా షట్ డౌన్ ప్రకటించడంతో అన్ని రంగాలు కునారిల్లి పోయాయి. దీంతో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వీరిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్దీపన చర్యలు చేపట్టారు.
ఇందు కోసం ఏకంగా కరోనా ప్యాకేజీ ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఏయే రంగాలకు ఏయే వెసలుబాట్లు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా కరోనా వ్యాధి బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. నష్ట నివారణ చర్యలు చేపట్టడం ఎలా అంటూ ప్రపంచ వ్యాప్తంగా దేశాధినేతలు తలలు బాదుకుంటున్నారు. ఇప్పటి వరకు డ్రాగన్ చైనా కంట్రోల్ లో ఉంచగా పూర్తిగా అదుపులో ఉన్న దేశాలు మాత్రం రెండే రెండు ఉన్నాయి. క్యూబా, రష్యా లు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో సక్సెస్ అయ్యాయి. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ పూర్తిగా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉంచేందుకు కఠిన చర్యలు తీసుకున్నారు. ఏ ఒక్కరు బయటకు వచ్చినా 5 ఏళ్ల పాటు జైలు పాలు కావాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఏది ఏమైనా ఇప్పట్లో కరోనా వైరస్ కంట్రోల్ లోకి వచ్చే ఛాన్సెస్ కనిపించడం లేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి