కరోనా..క్యా కర్‌నా
కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. నిన్నటి దాకా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్న పెద్దన్న ఇపుడు వైరస్ వ్యాప్తి చెందడం, బాధితులు అంతకంతకూ ఎక్కువ కావడం, నివారణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన సౌకర్యాలు లేక పోవడంతో ప్రెసిడెంట్ పునరాలోచనలో పడ్డారు. త్వరలో ఎన్నికలు జరగనుండడంతో ఈ వ్యాధిని కంట్రోల్ చేయడంలో సరైన శ్రద్ధ చూపించలేదు. దీంతో బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిన్నటి దాకా చైనా వరల్డ్ వైడ్ గా చూస్తే టాప్ వన్ లో ఉండగా ఇపుడు దానిని ఇటలీ దాటేసింది. వేలాది మంది పిట్టల్లా రాలుతున్నా ఏమీ చేయలని స్థితిలోకి చేరుకుంది ఈ కంట్రీ. ఇదిలా ఉండగా ఆర్థికంగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న అమెరికా ను కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బాధితుల సంఖ్య ఇటలీని దాటేసింది. ఒక వేళ ఈ వైరస్ మరింత విజృంభిస్తే యుఎస్ దగ్గర కంట్రోల్ చేసేందుకు కావాల్సిన సదుపాయాలు, సిబ్బంది, నిపుణులు, వైద్యులు లేక పోవడం బాధాకరం. అమెరికన్లు ఈ వ్యాధిని తల్చుకుని కుమిలి పోతున్నారు.
ట్రంప్ ఎందుకు చర్యలు చేపట్టడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. 24 గంటల వ్యవధిలోనే పది వేల కొత్త కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 49,594కు చేరుకుంది. ఒకే రోజు 130 మంది మరణించారు. దీంతో అమెరికాలో మృతుల సంఖ్య 723 కు పెరిగింది. కోవిడ్ కల్లోలానికి ప్రపంచ వ్యాప్తం 23 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 4 లక్షల మందికిపైగా వ్యాధి బారిన పడ్డారు. ప్రపంచం మొత్తమ్మీద సుమారు 185 దేశాలు, ప్రాంతాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. ఆలస్యంగా మేల్కొన్న ట్రంప్ నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగారు. మాస్కులు, శానిటైజర్లు ఇతర మందులను నిల్వ చేసినా లేదా అధిక ధరలకు అమ్మినా శిక్ష తప్పదన్నారు. న్యూయార్క్ ప్రస్తుతం కోవిడ్‌కు కేంద్ర బిందువుగా మారింది.
అమెరికాలో కోవిడ్ బారిన పడ్డ ప్రతి ఇద్దరిలో ఒక్కరు న్యూయార్క్‌కు చెందిన వారే. 5085 కొత్త కేసులు నమోదు కావడంతో ఈ మహానగరంలో ఇప్పటివరకూ ఉన్న కేసుల సంఖ్య 20,875కు ఎగబాకింది. న్యూయార్క్‌లో ఇప్పటికే 43 మంది మరణించారు. న్యూయార్క్ నగరం, మెట్రో ఏరియా, న్యూజెర్సీ, లాండ్ ఐలాండ్ ప్రాంతాల్లో ప్రతి వెయ్యిమందిలో ఒకరు వ్యాధి బారిన పడ్డారని వైట్‌హౌస్‌లో కరోనా టాస్క్‌ఫోర్స్ అధికారి డెబ్రా ఎల్ బ్రిక్స్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు కూడా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న న్యూయార్క్, వాషింగ్టన్ స్టేట్, కాలిఫోర్నియాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, తగినన్ని మందులు, ఇతర పరికరాలను అక్కడకు పంపిస్తున్నామని తెలిపారు. ఫెడరల్ ఎమర్జెన్సీ ఏజెన్సీ సుమారు 80 లక్షల ఎన్–95 మాస్కులను పంపిణీ చేస్తోందని, కోటీ 33 లక్షల సర్జికల్ మాస్కులూ అందిస్తున్నామని తెలిపారు.
ఇరాన్‌లో మరో 122 మంది మరణించడంతో కోవిడ్ –19 కారణంగా ఆ దేశంలో ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1934కు చేరుకుంది. స్పెయిన్‌లో కోవిడ్ –19 విలయం కొనసాగుతోంది. ఒక్క రోజులో ఏకంగా 514 మరణాలు సంభవించగా ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2696కు చేరిందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దేశంలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 40 వేలుగా ఉంది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం రేపుతోంది. అమెరికాను వణికిస్తోంది. చైనా మాత్రం కూల్ గా ఉంటోంది. రష్యా, క్యూబా మౌనంగా ఉన్నాయి. కరోనాపై ఏమీ మాట్లాడటం లేదు. ఇక ఈ మొత్తం మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందడానికి చైనా ఒక్కటే కారణమంటూ యుఎస్ ఆరోపిస్తోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి