మిస్టర్ కూల్ సరి కొత్త అవతారం

మాజీ టీమిండియా సారధి, ప్రస్తుత జట్టు ప్లేయర్ గా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోనీకి సరి కొత్త పోస్టు ఇవ్వాలని అనుకుంటోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. టీమిండియా తొలి డే అండ్ నైట్ టెస్టుకు సిద్ధమైన తరుణంలో అందుకు ప్రత్యేక గుర్తింపు తీసుకు రావాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగనున్న టెస్టుకు భారత మాజీ టెస్టు కెప్టెన్లను ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భారత క్రికెట్ జట్టు టెస్టు చరిత్రలో డే అండ్ నైట్ టెస్టు ఆడటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత జట్టుకు సేవలందించిన టెస్టు కెప్టెన్లను అందరినీ ఆహ్వానించి వారి అనుభవాలను పంచుకోనుంది. ఇందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యాలు సంయుక్తంగా భారత మాజీ కెప్టెన్ల ను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు 2001లో ఆసీస్‌పై కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌లతో పాటు ఆ గెలుపులో భాగస్వామ్యం అయిన వారికి కూడా ప్రత్యేకంగా ఇన్విటేషన్స్ పంపనున్నారు. ఇక ధోని కామెంటేట...