ప్రపంచం ఆయుర్వేద జపం

భారత దేశంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరగానే మరోసారి ఆయుర్వేదంకు ప్రయారిటీ పెరిగింది. పతంజలి అధినేత రామ్ దేవ్ బాబా తన హవాను కొనసాగిస్తున్నారు. ఇండియన్ మార్కెట్లో విదేశీ కంపెనీల జైత్ర యాత్రకు ఊహించని రీతిలో చెక్ పెట్టింది పతంజలి. తక్కువ ఖర్చుకే, అందరికీ అందుబాటులో ఉండేలా అన్ని ప్రోడక్ట్స్ ను అందుబాటు లోకి తీసుకు వచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రతి మూలకు విస్తరించింది. అన్ని వర్గాలకు సంబంధించిన వన్నీ పతంజలి స్టోర్స్ లో ఉండేలా చేసింది. భారతీయ వ్యాపారం అంతా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఎక్కువగా ప్రతి రోజు సామాన్యులు, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అంతే కాకుండా ఉన్నత వర్గాలకు చెందిన వారు సైతం పతంజలి జపం చేస్తున్నారు.

ఇంటిల్లి పాదికి అవసరమైన నిత్యావసర వస్తువులు సైతం పతంజలి తయారు చేస్తోంది. దేశ సంస్కృతి, సాంప్రదాయం పేరుతో వస్తువులు తయారు చేసేలా పతంజలి దృష్టి పెట్టింది. ఇటీవల ఎక్కువ మంది జనం రోగాలకు లోనవుతున్నారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర దామోదర దాస్ మోదీ ఆయుర్వేదం, యోగాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయుర్వేద వస్తువులకు మంచి గిరాకీ లభిస్తోంది. తాజాగా ఈ కామర్స్ రంగంలో టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది అమెజాన్ కంపెనీ. ఆన్ లైన్ లోనే ఎక్కువగా బిజినెస్ చేస్తోంది. ప్రతి రోజూ కోట్లాది మంది లక్షలాది వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో లెక్కలేనంత ఆదాయం దీనికి సమకూరుతోంది. ఈ కంపెనీ సైతం పతంజలి ప్రాడెక్ట్స్ ను అమ్ముతోంది.

ఇదిలా ఉండగా ఆయుర్వేదాన్ని, ఆయుర్వేద వస్తువులను ప్రపంచ వ్యాప్తం చేయడానికి అమెజాన్ ఒక ప్రత్యేక వెబ్ సైట్ ని ఓపెన్ చేస్తోంది. భారతీయ ఆయుర్వేద తయారీదారుల కోసం ఇది ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. కేరళలోని కొచ్చిలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిన్న నిర్వహించిన గ్లోబల్ ఆయుర్వేద మీట్ 2019 లో ఒక సెషన్‌కు హాజరైన అమెజాన్ ఇండియా, గ్లోబల్ సెల్లింగ్ హెడ్ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే హెర్బల్, బ్యూటీ ప్రొడక్ట్స్ అనేవి ఆమెజాన్ లో అతి ముఖ్యమైనవని పేర్కొన్నారు. భారతదేశం నుండి అమెజాన్లోనే ఆయుర్వేదానికి సంబంధించి 50,000కి పైగా గ్లోబల్ సెల్లర్స్ ఉన్నారని వారందిరికీ ఇది ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ఆన్ లైన్ లో రిజిస్టర్ కావాలిసిన వారు అవి విక్రయించ బడే దేశాలలో నిబంధనలకు లోబడి ఉండాలని వెల్లడించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!