పెళ్లి చేసుకున్న గ్రేమ్ స్మిత్


సినిమా, క్రీడా రంగాలకు చెందిన వారికి ఎవ్వరికీ లేనంత పాపులారిటీ ఉంటుంది. కోట్లాది అభిమానుల మనసు దోచుకునే వీరికి ఆదాయం కూడా ఎక్కువే. అందుకే వీరు ఏది చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. తన చిరకాల  ప్రేయసి రోమీ లాం ఫ్రాంచీని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా స్మిత్‌ అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. గత ఏడాదిలోనే ఆమెకు ఎంగేజ్‌ మెంట్‌ రింగ్‌ తొడిగిన స్మిత్‌ తాజాగా ఆమెను పెళ్లి చేసుకున్నారు. తన జీవితంలో ఈ క్షణాలను మరిచి లేనన్నారు.

తమ అభిమాన  క్రికెటర్‌ పోస్టుకు స్పందించిన, ఆయన ఫ్యాన్స్‌, నెటిజన్లు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారు. అటు రోమీ కూడా ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్‌ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దక్షిణాఫ్రికా రగ్బీ జట్టు ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ గెలిచిన రోజున స్మిత్ పెళ్లి జరగడం విశేషం. ఈ ఎడమచేతి బ్యాట్స్‌మెన్‌ 2011లో, ఐరిష్ పాప్ గాయకురాలు మోర్గాన్ డీన్‌ను వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్లు గడిచాక ఆమె నుంచి విడి పోయాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

22 సంవత్సరాల అతి చిన్న వయస్సులో దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఎంపికైన గ్రేమ్ స్మిత్‌ తన ప్రతిభతో ఉత్తమ కెప్టెన్‌గా సేవలందించాడు. టెస్టుల్లో 53 విజయాలు, వన్డేల్లో 92 విజయాలు, టీ 20 లో 27 మ్యాచ్‌ల్లో 18 విజయాలు సాధించాడు. తన కెరీర్ మొత్తంలో, స్మిత్  అన్ని ఫార్మాట్లలో 17000 పరుగులు చేశాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన స్మిత్‌ ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా వ్యవహరిస్తున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!