షావోమి సెన్సేషన్..అమ్మకాల్లో రికార్డ్

చైనాకు చెందిన షావోమి మొబైల్స్, యాక్సెసరీస్, ఎల్సీడీ టీవీలను కొత్తగా లాంచ్ చేసింది. షావోమీ దెబ్బకు దిగ్గజ కంపెనీలు డీలా పడ్డాయి. ఇండియాలో, వరల్డ్ వైడ్ మార్కెట్ లను షేక్ చేసేంది. రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా అమ్మకాల్లో టాప్ మూడో పొజిషన్ చేజిక్కించుకుంది. బంపర్ ఆఫర్లు, బహుమతులతో మొబైల్, టీవీ ప్రేమికులకు గాలం వేసింది. దీంతో అన్నీ రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. తాజాగా షావోమి తన అద్భుతమైన కెమెరాను అధికారికంగా లాంచ్‌ చేసింది.108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో సహా ఐదు వెనుక కెమెరాలుతో ప్రతిష్టాత్మక స్మార్ట్‌ ఫోన్‌ను బీజింగ్‌లో ఆవిష్కరించింది.

ఎంఐ సిరీస్‌లో భాగంగా ఎంఐ సీసీ9 ప్రొ పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది. బేసిక్‌ వేరియంట్‌ 6జీబీ ర్యామ్‌,128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ తో ధర సుమారు 28,000 గా నిర్ణయించింది. హై-ఎండ్ 8 జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర సిఎన్‌వై  సుమారు 31,000 రూపాయలకు అమ్ముతోంది. ఇక ప్రీమియం ఎడిషన్‌ ధర 8  జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ సిఎన్‌వై ధర 35,000 గా డిసైడ్ చేసింది. ఇతర మార్కెట్లలో దీని లభ్యతపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. హువావే మేట్ 30 ప్రో, గెలాక్సీ నోట్ 10+, గూగుల్ పిక్సెల్ 4 ఫోన్లకు ఇది గట్టిపోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు.

ఫోన్ ను లాంచ్ చేసిన షావోమి తాజాగా స్మార్ట్‌ టీవీలను తీసుకొచ్చింది. ఎంఐ సిరీస్‌లో భాగంగా ఎంఐ టీవీ 5,  ఎంఐ టీవీ  5 ప్రో పేరుతో బీజింగ్‌లో కంపెనీ ప్రొడక్ట్ ప్రెజెంటేషన్‌లో భాగంగా లాంచ్‌ చేసింది. 55  అంగుళాలు, 65,  75  అంగుళాల స్క్రీన్ పరిమాణాలలో ఈ స్మార్ట్‌ టీవీలను తీసుకొచ్చింది. 55 అంగుళాల ఎంఐ టీవీ 5ప్రో మోడల్‌ ధర 37,200  రూపాయలు ఉండగా, 65 అంగుళాల ఎంఐ టీవీ 5ప్రో  సిఎన్‌వై 50,300 , 75 అంగుళాల మోడల్ ధర 1,00,500 రూపాయలుగా నిర్ణయించింది. ఇతర మార్కెట్లలో ఎపుడు అందు బాటులోకి తెచ్చేది వెల్లడించ లేదు షావోమి కంపెనీ. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!