క్రికెట్ కోచ్ పై సెటైర్స్
ఎందుకనో ముంబై ఆటగాడు, మాజీ జట్టు సారధి ప్రస్తుత టీమిండియా కోచ్ రవి శాస్త్రిపై క్రికెట్ ఫ్యాన్స్ సెటైర్స్ విసురుతున్నారు. టీమిండియా సారథి విరాట్ కోహ్లికి బర్త్‌డే విషెస్ చెప్పిన రవిశాస్త్రిని నెటిజన్లు సోషల్ మీడియాలో ఓ ఆటాడుకుంటున్నారు. తాజాగా బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్న కోహ్లికి యావత్ క్రీడా ప్రపంచం విషెస్ తెలిపింది. పనిలో పనిగా టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా కోహ్లికి విషెస్ తెలిపాడు. అయితే అదే రవిశాస్త్రి కొంప ముంచింది. ఎప్పట్నుంచో రవిశాస్త్రి అంటే పడని కొందరు అతడిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
బర్త్‌డే విషెస్ తెలిపావు కానీ.. సరైన హ్యాస్ ట్యాగ్ ఇవ్వడం మర్చి పోయావ్, గంగూలీ గారూ టీమిండియాకు ఫిట్ నెస్ కోచ్ కావాలి, రవి మామా ఈ రోజు ఫుల్‌గా తాగుడేనా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, సకల భోగాలు అనుభవిస్తున్నావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక టీమిండియా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన అనంతరం ప్రధానంగా కోచ్ రవిశాస్త్రిని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. మిడిలార్డర్ బ్యాటింగ్ సమస్యను పరిష్కరించడంలో కోచ్ విఫలమయ్యాడంటూ విమర్శించారు.
అంతే కాకుండా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో ధోని బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై కూడా ధ్వజ మెత్తుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో రవిశాస్త్రి నిద్ర పోయాడంటూ కొన్ని ఫోటోలు నెట్టింట్లో తెగ హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం మీద దాదా వచ్చాక రవికి కష్టాలు మొదలయ్యాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి