డాబర్ అదుర్స్..ఆదాయంలో చీర్స్
ఓ వైపు దేశంలో ఆర్ధిక మంద గమనం కొనసాగుతుండగా మరో వైపు దేశీయ కంపెనీలు మాత్రం ఆదాయంలో దూసు కెళుతున్నాయి. ఇప్పటికే ఎఫ్‌ఎమ్‌సీజీ దేశీయ దిగ్గజం డాబర్ టాప్ రేంజ్ లో కొనసాగుతోంది. రెండో త్రైమాసిక కాలంలో 404 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ2లో ఆర్జించిన నికర లాభం, 378 కోట్లుతో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించినట్లు డాబర్ ఇండియా కంపెనీ వెల్లడించింది. పెట్టుబడుల విలువకు సంబంధించి 40 కోట్ల వన్ టైమ్ కారణంగా నికర లాభం ఒకింత తగ్గిందని పేర్కొంది. కార్యకలాపాల ఆదాయం 2,125 కోట్ల నుంచి రూ.2,212 కోట్లకు పెరిగిందని తెలిపింది.
దేశీయ మార్కెట్ రంగంలో డాబర్ కు మంచి పేరుంది. ఆయుర్వేద ప్రోడక్ట్స్ తో పాటు ఇతర బ్యూటీకి చెందిన వస్తువులను విక్రయిస్తోంది. ఇటు ఆఫ్ లైన్ లోను..అటు ఆన్ లైన్ లోను వీటిని అమ్ముతోంది. డాబర్ అనే సరికల్లా హానీ గుర్తుకు వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు తేనె కు ఎనలేని డిమాండు ఉంటోంది. ఆరోగ్య పరంగా, శారీరకమైన ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు హానీ ఉపయోగ పడుతుంది.
దీంతో ప్రకృతి పరంగా లభించే వాటిని శుద్ధి చేసేందుకు భారీ ఎత్తున పరిశ్రమలను నెలకొల్పింది డాబర్. దేశంలోని ప్రతి కిరాణా షాప్స్ తో పాటు అన్ని మందుల అంగళ్లలో కూడా విరివిగా లభిస్తోంది తేనె. దీనిని ప్రతి నిత్యం వాడుతున్నారు జనం. ఈ ఒక్క ప్రోడక్ట్ తో డాబర్ కంపెనీకి భారీ ఆదాయం సమకూరుతోంది. ఇతర ప్రోడక్ట్స్ కు కూడా భలే గిరాకీ ఉంటోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి