నచ్చితే సిప్లిగంజ్ కు పెళ్లి
బుల్లి తెరపై స్టార్ మా టీవీ టెలికాస్ట్ చేసిన రియాల్టీ షో బిగ్ బాస్ ముగిసినా ఇంకా తెలుగు నాట చర్చ జరుగుతూనే ఉన్నది. ఎవరూ ఊహించని రీతిలో ఫైనలిస్ట్ గా గల్లీ బాయ్, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గెలిచాడు. అయితే రాహుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. సిప్లిగంజ్, సినీ నటి పునర్నవి భూపాళం ల మధ్య బిగ్ బాస్ హౌజ్ లో జరిగిన సంభాషణలు, వారిద్దరి మధ్య జరిగిన టాస్క్స్ , తిట్టిన తిట్లు, పునర్నవి ముద్దు పెట్టడం సెన్సేషన్ గా మారాయి. ఒక దశలో వీరిద్దరి మధ్య కొంత కెమిస్ట్రీ నడుస్తోందన్న కామెంట్స్ కూడా వచ్చాయి. తమ కొడుకుకు నచ్చితే పెళ్లి చేసేందుకు రెడీగా ఉన్నామని రాహుల్ పేరెంట్స్ స్పష్టం చేశారు.
దీంతో ఈ సింగర్ ఎవరిని ఎంపిక చేసుకుంటాడోనన్న ఉత్కంఠ నెలకొంబిగ్ బాస్ షో లో రాహుల్, పునర్నవిల రిలేషన్‌షిప్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వీకెండ్‌లో వచ్చే నాగార్జున వారి మధ్య అలకలను, ప్రేమను గుర్తు చేస్తూ సెటైర్లు విసిరారు. ఇక పునర్నవి రాహుల్‌కు గోరు ముద్దలు తినిపించడం, అదే సమయంలో తప్పు చేస్తే అతన్ని చెడామడా తిట్టడం.. ఇంట్లో ఏం జరిగినా ఇద్దరు కలిసే ఉండటం ప్రేక్షకులను మెప్పించింది. ఓరోజు ఎలాగోలా ధైర్యం చేసిన రాహుల్.. డేటింగ్‌కు వస్తావా అని పునర్నవిని సరదాగా అడగడం అప్పట్లో హైలైట్‌గా నిలిచింది. టాస్క్‌లు ఆడటం చేత కాదని పేరు తెచ్చుకున్న రాహుల్.. పునర్నవి కోసం 20 గ్లాసుల కాకర జ్యూస్‌ను గటగటా తాగి ఆమెను నామినేషన్ నుంచి తప్పించాడు.
దీంతో ఆనందం పట్టలేని పునర్నవి.. రాహుల్‌ను హత్తుకుని ముద్దులు పెట్టింది. ఇక పునర్నవి ఎలిమినేట్ అయినపుడు రాహుల్ వెక్కి వెక్కి ఏడ్వటంతో ఆమెపై ఉన్న ప్రేమ మరోసారి బయట పడింది. గ్రాండ్ ఫినాలే స్టేజిపై రాహుల్‌ను విజేతగా ప్రకటించిన తర్వాత ఆమెను పొగడ్తల్లో ముంచెత్తాడు. మేం ఇద్దరం స్నేహితులమంటూ ఎప్పటికప్పుడు మాట దాట వేస్తూనే ఉన్నారు. అయితే రాహుల్ తల్లిదండ్రుల మాటలు ప్రేక్షకులను చిక్కుల్లో పడేశాయి. వారిది స్నేహమా లేక ప్రేమా అన్న అనుమానం వీక్షకుల్లో తలెత్తుతోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి