- నేను చనిపోయాక నా ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలి - తండ్రి బాటలో తనయుడు

అవినీతి అంతం నా పంతం - విద్యాభివృద్ధే నా లక్ష్యం తప్పులు అందరూ చేస్తారు..కానీ కొందరే వాటిని గుర్తించి మళ్లీ తప్పులంటూ చేయకుండా వుండేందుకు ప్రయత్నిస్తారు. గొప్ప వారుగా రాణించేందుకు కృషి చేస్తారు. అవినీతి, ఆరోపణలు ఎదుర్కొని..కేసుల దాకా వెళ్లి..జైలుపాలై ..చివరికి బయటకు వచ్చి..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజా నాయకుడిగా తనను తాను మల్చుకుంటున్నారు. ప్రజల పక్షపాతిగా ..జనహృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత సీఎం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తున్నారు జగన్. ఓ వైపు ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడ్డారు. ఏటికి ఎదురీదారు. ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారు. జనం బాధలను విన్నారు. వారి కష్టాలను దగ్గరుండి చూశారు. అందుకే ఆయనకు ఏపీ జనం బ్రహ్మరథం పట్టారు. అనూహ్యమైన విజయాన్ని కట్టబెట్టారు. ఈ గెలుపు ఇచ్చిన కిక్‌తో జగన్ సంతృప్తి చెందలేదు. తన ముందున్న సవాళ్లను గుర్తించారు. తన కర్తవ్యం ఏమిటో ప్ర...