అన‌కొండ‌లా అక్ర‌మాస్తులు - న‌ల్ల‌ధ‌నంలో భార‌తీయులు - లోక్‌స‌భ ముందు స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్ప‌ణ‌..!

పొద్ద‌స్తామ‌నం క‌ష్ట‌ప‌డి, రేయింబ‌వ‌ళ్లు వ‌ళ్లు వంచి ..వ‌చ్చిన డ‌బ్బుల‌తో ..రేప‌టికి వ‌స్తాయ‌ని న‌మ్మ‌కంతో బ్యాంకుల్లో దాచుకున్న డ‌బ్బుల్ని అక్ర‌మంగా రుణాల పేరుతో టోక‌రా ఇచ్చిన వాళ్లు ద‌ర్జాగా ఎంజాయ్ చేస్తున్నారు. అవినీతి అన‌కొండ‌లా పెరిగి పోయింది. దాచుకున్న డ‌బ్బుల్ని ఇత‌ర దేశాల‌కు త‌ర‌లించారు. అక్క‌డే దాచుకున్నారు. ల‌క్ష‌లాది కోట్లు మ‌న తీరాల‌ను దాటి వెళ్లాయి. ఇండియ‌న్స్ 1980 నుంచి 2010 మ‌ధ్య వివిధ స‌మ‌యాల్లో విదేశాల్లో దాచిన అక్ర‌మ సంప‌ద దాదాపు 216.48 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి 490 బిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కు దాచుకున్నారు. వీటి విలువ ప్ర‌స్తుత విలువ ప్ర‌కారం ..15 ల‌క్ష‌ల కోట్ల నుంచి 34 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు చేరుకుంద‌ని అంచ‌నా. ప్ర‌పంచంలోనే స‌ర్వే చేయ‌డంలో అగ్ర‌శ్రేణి సంస్థ‌గా పేరొందిన నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ పాల‌సీ అండ్ ఫైనాన్స్ ( ఎన్ఐఎఫ్ఎం) , నేష‌న‌ల్ అప్లైడ్ ఎక‌నామిక్ రీసెర్చ్ (ఎన్‌సిఏఈఆర్), నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ (ఎన్ఐఎఫ్ఎం) సంస్థ‌లు వేర్వేరుగా స‌ర్వే చేప‌ట్టాయి. దీంతో ఆస‌క్తిక‌ర‌మైన‌..దిగ్భ్రాంతిక‌ర‌మైన వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి.

ఆర్థిక వ్య‌వ‌హారాల స్థాయి సంఘం ఈ వివ‌రాల‌తో స‌మ‌గ్ర నివేదిక‌ను లోక్‌స‌భ ముందు వుంచింది. ప్ర‌ధానంగా రియ‌ల్ ఎస్టేట్ , గ‌నులు, ఔష‌ధాలు, పాన్ మ‌సాలా, గుట్కా, పొగాకు, బంగారం, క‌మోడీస్‌, సినిమాలు, విద్యా రంగాల‌లో లెక్క‌ల్లోకి రాని ఆదాయం ఉన్న‌ట్లు వెల్ల‌డించాయి. న‌ల్ల‌ధ‌నం ఎక్క‌డి నుంచి వ‌స్తోంది, ఎలా పోగ‌వుతోంది, ఎక్క‌డికి వెళుతోంద‌న్న దానిపై స్ప‌ష్ట‌మైన ఆధారాలు ల‌భించ‌లేద‌ని తెలిపాయి. వీట‌న్నింటిని వెలికి తీయాలంటే భారీ క‌స‌ర‌త్తు చేయాల్సి వుంటుంది. దేశం లోప‌ల‌, వెలుప‌ల లెక్క‌ల్లోకి రాని ఆదాయం, ఆస్తుల ప‌రిస్థితి..ఓ శాస్త్రీయ‌, స‌మ‌గ్ర విశ్లేష‌ణ పేరుతో ఈ సంస్థ‌లు స‌ర్వే చేప‌ట్టాయి. అంచనాల‌న్నీ ప‌లు స‌ర్దుబాట్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నామ‌ని, ఈ విష‌యంలో మ‌రింత ప‌రిశోధ‌న జ‌ర‌గాల్సి ఉందంటూ పేర్కొన్నాయి. ఇందు కోసం ఉప‌యోగించాల్సిన అత్యుత్త‌మ ప‌ద్ధ‌తి లేదా విధానంపై ఏక‌రూప‌త‌, ఒపీనియ‌న్ రాలేద‌ని స్ప‌ష్టం చేశాయి.

అంద‌జేసిన వివ‌రాల‌ను చూసి ఎన్నికైన స‌భ్యులు ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. 15,00,000 ల కోట్ల నుంచి 34,00,000 కోట్లకు చేర‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. ఇది మ‌న దేశ వార్షిక బ‌డ్జెట్ కంటే ఎక్కువ‌. 27 ల‌క్ష‌ల 84 వేల 200 కోట్లు.విదేశాల్లో ఉన్న ఈ మొత్తంతో కాళేశ్వ‌రం వంటి భారీ ప్రాజెక్టులు క‌నీసం `19, పోల‌వ‌రం లాంటి ప్రాజెక్టులైతే 30 దాకా క‌ట్టొచ్చు. ఎన్‌సీఏఈఆర్ అంచ‌నా ప్ర‌కారం 1980-2010 మ‌ధ్య విదేశాల్లో మూలుగుతున్న ఇండియ‌న్స్ అక్ర‌మ సంప‌ద 26.65 ల‌క్ష‌ల కోట్ల నుంచి 34 లక్ష‌ల దాకా వ‌ర‌కు ఉండొచ్చ‌ని అంచ‌నా. ఎన్ఐఎఫ్ఎం అంచ‌నా ప్ర‌కారం 1990-2008 మ‌ధ్య దేశం వెలుప‌ల‌కు త‌ర‌లిన న‌ల్ల‌ధ‌నం 15 ల‌క్ష‌ల కోట్లు. లెక్క‌ల్లోకి రాని ఆదాయం 10 శాతానికి పైగా ఉండొచ్చ‌ని పేర్కొంది. ఎన్ఐపీఎఫ్‌పీ అంచ‌నా ప్ర‌కారం 1997 నుంచి 2009 మ‌ధ్య కాలంలో అక్ర‌మంగా దేశం వెలుప‌ల‌కు వెళ్లిన సొమ్ము జీడీపీలో 0.2 శాతం నుంచి 7.4 శాతంకు పెరిగింది. అక్ర‌మార్కుల భ‌ర‌తం ప‌డ‌తాన‌ని బీరాలు ప‌లికిన పీఎం మోదీ ఇక‌నైనా వాటిని తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేయాలి. 

కామెంట్‌లు