ష‌కీబ్ కా క‌మాల్ ..బంగ్లా దెబ్బ‌కు ఆఫ్గాన్ డ‌మాల్

నిన్న‌టి దాకా క్రికెట్‌లో తామే పులుల‌మంటూ విర్ర‌వీగిన క్రికెట్ జ‌ట్ల‌కు అండ‌ర్ డాగ్స్ గా ప‌రిగ‌ణించిన బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టు కోలుకోలేని షాక్‌లు ఇస్తూ తాము సింహాల‌మంటూ నిరూపిస్తున్నారు. ప్ర‌పంచ క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్‌లో ప్రారంభ‌మైన మ్యాచ్‌ల‌న్నీ చ‌ప్ప‌గా సాగ‌గా..తాజాగా మిగిలిన జ‌ట్ల‌న్నీ నువ్వా నేనా అన్న రీతిలో త‌ల‌ప‌డుతున్నాయి. దీంతో నిరాశ చెందిన క్రికెట్ అభిమానులు ఇపుడు పండ‌గ చేసుకుంటున్నారు. ప్లేస్ ఏమీ మార‌లేదు. అదే ఆఫ్గ‌నిస్తాన్ ..అదే సౌథాంప్ట‌న్  మైదానం ..జ‌ట్టు మారిందంతే నిన్న ఇండియా..ఇవాళ బంగ్లా. మొన్న‌టి లాగానే పిచ్ మార‌లేదు. సేమ్ సీన్ రిపీట్ . కానీ ఇరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా జ‌రిగింది. క్రికెట్ ఆట‌కున్న ప‌వ‌ర్ ఏమిటో లోకానికి చాటి చెప్పింది. ఆప్ఘ‌నిస్తాన్ జ‌ట్టును బంగ్లా ఓడించి ..సెమీఫైన‌ల్ రేసుపై క‌న్నేసింది.

ఆప్ఘ‌నిస్తాన్ స్పిన్న‌ర్లు మ‌రోసారి స‌త్తా చాటారు. ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా అద్భుత‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించి..బంగ్లాదేశ్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. బ్యాట్స్ మెన్స్ ప‌ట్టుద‌ల‌తో ఆడారు. మెరుగైన స్కోర్‌ను అందించారు. ఆ త‌ర్వాత బంగ్లా బౌల‌ర్లు ఆఫ్గాన్ క్రికెట‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. ముష్పిక‌ర్ ర‌హీమ్ 87 బంతుల్లో 4 ఫోర్లు ఒక సిక్స‌ర్‌తో 83 ప‌రుగులు చేసి..ప్ర‌తికూల వాతావ‌ర‌ణంలో గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఆఫ్ సెంచ‌రీతో ష‌కీబ్ అత‌డికి తోడుగా నిలిచాడు. బౌలింగ్‌లోను కూడా రాణించి ..ఏకంగా 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. అయితే గెలిచిన మూడు మ్యాచ్‌ల్లోను ష‌కీబ్ ..మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును స్వంతం చేసుకుని రికార్డు సృష్టించాడు.

బంగ్లాదేశ్ జ‌ట్టుతో ఓడిపోవ‌డంతో ఆఫ్గ‌నిస్తాన్ జ‌ట్టుకు ఈ టోర్న‌మెంట్‌లో వ‌రుస‌గా ఏడు ప‌రాజ‌యాల‌ను మూట‌గ‌ట్టుకుంది. ఈ విజ‌యంతో సెమీస్ రేస్‌ను మ‌రింత ఆస‌క్తిక‌రంగా మలిచింది బంగ్లా. గెలుపు ఓట‌ముల‌ను ప‌క్క‌న పెడితే బంగ్లా జ‌ట్టు అన్ని జ‌ట్ల ఫ్యాన్స్ అభిమానాన్ని చూర‌గొంటోంది. 62 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు తీవ్ర వ‌త్తిడికి గురి చేసినా గ‌ట్టిగా ఎదుర్కొంది. ష‌కీబ్ 69 బంతుల్లో 51 ప‌రుగులు చేశాడు. 29 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 5 మందిని అవుట్ చేశాడు. ముస్తాఫిజుర్ 32 ప‌రుగులిచ్చి రెండు కీల‌క‌మైన వికెట్లు ప‌డ‌గొట్టాడు. 47 ఓవ‌ర్ల‌లో 200 ప‌రుగులే చేసి ఆలౌట్ అయ్యారు. గుల్బాదిన్ నైబ్ 47 ప‌రుగులు చేయ‌గా, షెన్వారీ 49 ప‌రుగులు చేయ‌డంతో ఆఫ్గాన్ ఆ మాత్రం స్కోర్ చేసింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!