పోస్ట్‌లు

సెప్టెంబర్ 20, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మాతృత్వమా వర్ధిల్లు..దాతృత్వమా పరిఢవిల్లు..!

చిత్రం
ప్రతి మహిళకు దేవుడిచ్చిన వరం మాతృత్వం. ఈ అరుదైన ప్రపంచానికి కొత్త ప్రాణాన్ని, జీవిని పరిచయం చేసే ఒకే ఒక్క వ్యక్తి. రక్తమాంసాలు కలిగిన స్త్రీ. ఆమెకు మాత్రమే ఇలాంటి అవకాశం ఉన్నది. కొందరు పిల్లల్ని కొన్ని కారణాల రీత్యా కనక పోవచ్చు. అందుకే చాలా మంది మహిళలు, పురుషులు, భార్యాభర్తలు తమకు ఇష్టమైన పిల్లలను దత్తత తీసుకుంటారు. వారితో తమ కలలను నిజం చేసుకుంటారు. పిల్లలకు జన్మ ఇవ్వడం ఒక ఎత్తైతే వారిని పెంచడం మరో సమస్య. పెరిగి పెద్దగా అయ్యేంత దాకా ఎన్నో కష్టాలు. మరెన్నో ఇబ్బందులు. అయినా తాము ఉపవాసం ఉంటూ పిల్లలకు ప్రాణం పోస్తారు. తమకంటే ఎక్కువగా చూసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ స్టార్ గా పేరు పొందిన సన్నీ లీయోన్ తాను కూడా ఒకరు కాదు ఏకంగా ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది. తన భర్త డేనియల్ వెబర్ ను కూడా ఒప్పించింది. గత ఏడాది నిషా అనే చిన్నారిని దత్తత తీసుకుంది. పాపతో పాటు ఇద్దరు కుమారులు నావోహ్ , ఏషర్ లు ఉన్నారు వీరికి. సన్నీ లియోన్ అనే సరికల్లా బూతు సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆమెను అందరూ అదే ధోరణితో చూస్తారు. కానీ సన్నీ మాత్రం వృత్తి రీత్యా , బతుకు దెరువు కోసం నటిస్తున్నా, కానీ తాను కూడా ఓ తల్లి...

కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ జపం - మార్కెట్ కు ఊతం

చిత్రం
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం మరోసారి కునారిల్లి పోయిన భారత ఆర్ధిక వ్యవస్థకు పూర్తి చికిత్స అందించే పనిలో పడింది. ఇప్పటికే అరుణ్ జైట్లీ నుంచి ఆర్ధిక శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ అదుపు తప్పిన విత్త రంగాన్ని గాడిలో పెట్టేందుకు నానా తంటాలు పడుతోంది. ఆర్ధిక వృద్ధి ధర గణనీయంగా పడిపోయింది. మోడీ నోట్ల రద్దు ఎప్పుడైతే ప్రకటించారో ఇక అప్పటి నుంచి నేటి దాకా ఒక కొలిక్కి రావడం లేదు. ఎంత సేపు సంపన్న వర్గాలకు మేలు చేకూర్చే విధంగా ప్రస్తుత కాషాయ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నదే కానీ సామాన్య ప్రజానీకం పడుతున్న ఇబ్బందులను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో దేశాన్ని ప్రభావితం చేసే ప్రతి రంగం కునారిల్లి పోయింది. పేదరికం, నిరుద్యోగం, ఆర్ధిక అసమానతలు పెరిగి పోయాయి. ఎన్నడూ లేని రీతిలో నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి.  ఆటోమొబైల్ రంగం పూర్తిగా కనిష్ట స్థాయికి పడిపోయింది. మరో వైపు ఉద్దీపన చర్యలు చేపట్టినా ఈ రోజు వరకు కొలిక్కి రాలేని పరిస్థితి నెలకొంది. రిజర్వ్ బ్యాంక్ గత్యంతరం లేని పరిస్థితుల్లో తన వద్ద వున్న నిల్వలను ప్రభుత్వానికి అందజేసింది. ఓ రకం...

దేవుడు కరుణిస్తాడని..సోనాలి ఆరోగ్యాంగానే ఉందని..!

చిత్రం
చెరగని చిరునవ్వు. జీవితం పట్ల అచంచలమైన నమ్మకం. ఇంకొకరైతే ఇప్పటికే భయపడి పోయే వారు. కానీ వేలాది మంది అభిమానుల మనసు దోచుకున్న సినీ నటీమణి, సోగకళ్ల సుందరీమణి సోనాలి బెంద్రే మాత్రం చెక్కు చెదరలేదు. అదర లేదు..బెదర లేదు. ఉన్నట్టుండి ఈ అందమైన, అద్భుతమైన నటిని క్యాన్సర్ అనే భూతం కమ్మేసింది. ఆ విషయం లేటుగా తెలిసింది. ఒక్కసారిగా ఆ వార్త వైరల్ గా మారింది. ఔనా ఇది నిజమేనా అంటూ దేశమంతటా చర్చ. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ సోనాలి..జనం ముందుకు వచ్చారు. నిజమేనని ఒప్పుకున్నారు. మీ ఆదరాభిమానాల ముందు నాకు వచ్చిన వ్యాధి చిన్నదేనని నేను అనుకుంటున్నాను. నేను మళ్ళీ తిరిగి వస్తాను నా మాతృభూమికి. నాకు ప్రాణం పోసింది ఈ నేల. ఇక్కడ ఉన్నంత అభిమానం. స్వేచ్ఛ ఇంకెక్కడా దొరకదు. కష్ట కాలంలో నా కుటుంబం నా వెంటే ఉన్నది. ఇందుకు నేను నా అభిమానులకు, తోటి నటీనటులకు, దర్శకులకు, ఫ్యామిలీకి నేను రుణపడి వుంటాను. నాకు నా మీద పూర్తిగా నమ్మకం ఉన్నది. అదేమిటంటే నేను సంపూర్నంగా, ఎప్పటి లాగే నవ్వుతూ నేను మీ ముందుకు వస్తానని మాటిస్తున్నాను అని సోనాలి ఎంతో భావోద్వేగంతో చెప్పింది. ఆమె మాటలు ఎందరికో స్ఫూర్తి కలిగించాయి. అంతకు ముంద...

సర్వత్రా నిరసన .. ఆగని ఆందోళన..టీటీడీపై రేగిన రాద్ధాంతం..?

చిత్రం
కోట్లాది మంది భక్తుల కోర్కెలు తీర్చే ఆ కొండపై వెలసిన శ్రీనివాసుడికి ఎనలేని కష్టం వచ్చి పడింది. అదేదో భక్తుల నుండి అనుకుంటే పొరపాటు పడినట్లే. ఏ ప్రభుత్వమైతే రక్షణగా ఉండాలో, అదే సర్కారు ఆ దేవదేవుడి పట్ల కనికరం చూపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, అధికారులు, పోస్టులు మారి పోతుంటాయి. ఇది గత కొన్నేళ్లుగా వస్తూ వున్న సాంప్రదాయం. గతంలో తిరుమలపై ఇలాగే పెత్తనం చెలాయించాలని ప్రయత్నం చేసిన వారంతా నామ రూపాలు లేకుండా పోయారు. ఆ వేంకటేశ్వరుడి మహిమ అలాంటిది.  ప్రపంచంలోనే వాటికన్ తర్వాత అత్యంత ధనవంతమైన, ఆదాయం కలిగిన పుణ్య క్షేత్రంగా తిరుమల కు పేరున్నది. కోట్లాది రూపాయలు, లెక్కలేనంతటి బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు, ఆస్తులు, అంతస్తులు, భవనాలు, బ్యాంకుల్లో కోట్లాది ఫిక్సెడ్ డిపాజిట్స్ ఉన్నాయి. వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. ప్రత్యేకమైన వ్యవస్థ ఉన్నది. అంతే కాకుండా ప్రతి రోజు లక్షకు పైగా భక్తులు తిరుమలను దర్శించుకుంటారు. రవాణా పరంగా అటు ఆర్టీసీకి, రైల్వే శాఖ, విమానయాన శాఖలకు ఎనలేని ఆదాయం సమకూరుతోంది. అంతే కాకుండా పర్యాటక పరంగా కోట్లాది రూపాయలు సమకూరుతున్నాయి. ...

మనసు పొరల్లో..మెడ వంపుల్లో..!

చిత్రం
ప్రేమ అన్నది లేక పోతే జీవితాన్ని కొనసాగించడం కష్టం. ప్రపంచంలో మనకంటూ తోడు అన్నది లేకపోతే అంతా శూన్యం అనిపిస్తుంది. ఒకరిపై మరొకరికి ఉన్నది ప్రేమ ఒక్కటే. కష్టాల్లో తోడుంటుంది. సంతోషంలో భాగమవుతుంది. ఒకరికొకరు ప్రేమించు కోవడం అన్నది సహజం. ఇది ఒక్కటి లేకపోతే పరమ బోర్. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ .ఒక్కో పంథా. ఎవరి దారుల్లో వాళ్ళు ఉన్నా. ఎవరి లోకంలో వాళ్ళు లీనమై పోయినా. ఒకళ్ళ కోసం ఇంకొకరు వేచి చూడటం. నిరీక్షించి ఉండటం మామూలే. ఇలాంటి క్షణాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. పైకి లేదని చెప్పినా లేదా బుకాయించినా ప్రేమ అన్నది అంతర్లీనమై ఉంటుంది. దానిని ఎవరూ చెరపలేరు. మరిచి పోకుండా ఉండలేరు. తలుచుకోకుండా, గుర్తుకు తెచ్చుకోకుండా బతకలేరు. స్త్రీ పురుషుల మధ్య ఈ ఆకర్షణ అన్నది లేక పోతే కాలం సాగదు. కొందరు అనుకోకుండా తారస పడతారు. ఇంకొందరు మనతో పాటే వుండి పోతారు. ఇదంతా ప్రేమ మహత్యం. కాదనలేం. మనసుల్లో ఏదో మూలాల అభిమానం దాగి ఉంటూ ప్రేమగా మారి పోతుంది. ఎప్పుడూ స్తబ్దుగా ఉండే మనం, కావాల్సిన వాళ్ళు తారస పడినప్పుడో లేదా అనుకోకుండా కలుసుకున్నప్పుడో.. ఆ క్షణాన గుండె గోదారై ఉప్పొంగుతుంది. ప్రేమ అన్నది అంతులేని ప్రయాణం...