మాతృత్వమా వర్ధిల్లు..దాతృత్వమా పరిఢవిల్లు..!
ప్రతి మహిళకు దేవుడిచ్చిన వరం మాతృత్వం. ఈ అరుదైన ప్రపంచానికి కొత్త ప్రాణాన్ని, జీవిని పరిచయం చేసే ఒకే ఒక్క వ్యక్తి. రక్తమాంసాలు కలిగిన స్త్రీ. ఆమెకు మాత్రమే ఇలాంటి అవకాశం ఉన్నది. కొందరు పిల్లల్ని కొన్ని కారణాల రీత్యా కనక పోవచ్చు. అందుకే చాలా మంది మహిళలు, పురుషులు, భార్యాభర్తలు తమకు ఇష్టమైన పిల్లలను దత్తత తీసుకుంటారు. వారితో తమ కలలను నిజం చేసుకుంటారు. పిల్లలకు జన్మ ఇవ్వడం ఒక ఎత్తైతే వారిని పెంచడం మరో సమస్య. పెరిగి పెద్దగా అయ్యేంత దాకా ఎన్నో కష్టాలు. మరెన్నో ఇబ్బందులు. అయినా తాము ఉపవాసం ఉంటూ పిల్లలకు ప్రాణం పోస్తారు. తమకంటే ఎక్కువగా చూసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ స్టార్ గా పేరు పొందిన సన్నీ లీయోన్ తాను కూడా ఒకరు కాదు ఏకంగా ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది. తన భర్త డేనియల్ వెబర్ ను కూడా ఒప్పించింది. గత ఏడాది నిషా అనే చిన్నారిని దత్తత తీసుకుంది.
పాపతో పాటు ఇద్దరు కుమారులు నావోహ్ , ఏషర్ లు ఉన్నారు వీరికి. సన్నీ లియోన్ అనే సరికల్లా బూతు సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆమెను అందరూ అదే ధోరణితో చూస్తారు. కానీ సన్నీ మాత్రం వృత్తి రీత్యా , బతుకు దెరువు కోసం నటిస్తున్నా, కానీ తాను కూడా ఓ తల్లినేనంటూ చెప్పకనే చెప్పింది. ముందు నుంచి ఈ పోర్న్ స్టార్ కు పిల్లలంటే చచ్చేంత ఇష్టం. వారికి అన్నీ తానే అయి దగ్గరుండి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఆలనా పాలనా అంతా సన్నీనే. ఏ మాత్రం కొంచం వీలు కుదిరినా సరే ముగ్గురు పిల్లలతో బయటకు వస్తారు. వారితో కలిసి షాపింగ్ చేస్తారు. ఈ పిల్లలు ఇప్పుడు ఎక్కడలేని సంతోషాన్ని సన్నీ దగ్గర పొందుతున్నారు. సర్గోషి అంటే అద్దె గర్భం ద్వారా ఇద్దరు పిల్లలలకు సన్నీ జన్మ నివ్వగా, నిషా అనే పాపను అడాప్ట్ చేసుకుంది. మామధ్యన ఎలాంటి పొరపొచ్చాలు లేవు. లైఫ్ హాయిగా సాగిపోతోంది. మేమిద్దరం..మాకు ముగ్గురు. వీరితోనే సరిపోతోంది కాలమంతా.
ప్రతి దానిని మేం ఆస్వాదిస్తున్నాం. పిల్లలకు ఎలాంటి లోటు రానివ్వడం లేదు. అది మా భాద్యత. పిల్లలు కూడా పూర్తిగా కలిసి పోయారు. వారిని చూసినప్పుడల్లా నాకు ముచ్చటేస్తుంది. జీవితం ఇలా కలిపింది మమ్మల్ని. నేను నటిని అయి ఉండవచ్చు కానీ నాకు అందరి ఆడవాళ్ళ లాగా ఫీలింగ్స్ ఉంటాయి కదా అందుకని..ఈ మూమెంట్స్ ను నేను పదిలంగా దాచుకుంటున్నాను అంటోంది సన్నీ లియోన్. చూసే వారి దృష్టిని బట్టి ఉంటుంది. ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాం దీనిని మార్చాలని ..కానీ ఏదీ మారదు మనం మారిపోతుంటాం అంతే.. వుయ్ ఆల్ ఆర్ ట్రావెల్లర్స్ . అందుకే మొత్తం టైమంతా నా హుబ్బీ , పిల్లలతో సరిపోతోంది అంటోంది సన్నీ. ఎంతో పాజిటివ్ లుక్ తో సాగిపోతున్న ఆమె ఆనందంగా ఉండాలని కోరుకుందాం. ప్రస్తుతం హిందీ, తమిళ్ సినిమాలల్లో నటిస్తోంది. ఎంతైనా అపురూపమైనదమ్మా ఆడజన్మ అంటూ రాసిన కవి పాట గుర్తొస్తోంది లీలగా. మెల్లగా..!

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి