కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ జపం - మార్కెట్ కు ఊతం
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం మరోసారి కునారిల్లి పోయిన భారత ఆర్ధిక వ్యవస్థకు పూర్తి చికిత్స అందించే పనిలో పడింది. ఇప్పటికే అరుణ్ జైట్లీ నుంచి ఆర్ధిక శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ అదుపు తప్పిన విత్త రంగాన్ని గాడిలో పెట్టేందుకు నానా తంటాలు పడుతోంది. ఆర్ధిక వృద్ధి ధర గణనీయంగా పడిపోయింది. మోడీ నోట్ల రద్దు ఎప్పుడైతే ప్రకటించారో ఇక అప్పటి నుంచి నేటి దాకా ఒక కొలిక్కి రావడం లేదు. ఎంత సేపు సంపన్న వర్గాలకు మేలు చేకూర్చే విధంగా ప్రస్తుత కాషాయ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నదే కానీ సామాన్య ప్రజానీకం పడుతున్న ఇబ్బందులను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో దేశాన్ని ప్రభావితం చేసే ప్రతి రంగం కునారిల్లి పోయింది. పేదరికం, నిరుద్యోగం, ఆర్ధిక అసమానతలు పెరిగి పోయాయి.
ఎన్నడూ లేని రీతిలో నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఆటోమొబైల్ రంగం పూర్తిగా కనిష్ట స్థాయికి పడిపోయింది. మరో వైపు ఉద్దీపన చర్యలు చేపట్టినా ఈ రోజు వరకు కొలిక్కి రాలేని పరిస్థితి నెలకొంది. రిజర్వ్ బ్యాంక్ గత్యంతరం లేని పరిస్థితుల్లో తన వద్ద వున్న నిల్వలను ప్రభుత్వానికి అందజేసింది. ఓ రకంగా ప్రభుత్వ బ్యాంకులన్నీ దివాళా తీసేందుకు రెడీగా ఉన్నాయి. నోట్ల రద్దు ప్రభావం ఇంకా వెంటాడుతూనే ఉన్నది. ఇదిలా ఉండగా స్టాక్ మార్కెట్ పూర్తిగా ఒడిదుడుకులకు లోనైన తరుణంలో కొంత మేరకైనా భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో కార్పొరేట్, బడా కంపెనీలకు మేలు చేకూర్చేలా విత్త మంత్రి నిర్ణయం తీసుకున్నది. దీంతో ఒక్కసారిగా మార్కెట్ సూచీలు రివ్వుమంటూ పెరిగాయి. గత 28 ఏళ్ళ చరిత్రలో మొదటి సారిగా భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది కేంద్ర సర్కార్.
కార్పొరేట్ పన్ను శాతం 10 కి తగ్గుస్తున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఆర్థిక వృద్ధి రేటు పెంచేందుకు వరాలు ప్రకటించింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు దాదాపు కోటి 45 లక్షల కోట్లకు గండి పడింది.1991లో భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణల ఘట్టం ప్రారంభమైన తర్వాత కార్పొరేట్ పన్నుల్లో ప్రకటించిన అతి పెద్ద రాయితీ ఇదే. ఆర్థిక మంత్రి ప్రకటనతో స్టాక్ మార్కెట్ కుదుపునకు లోఅంది. ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే 6.8 లక్షల కోట్ల మేర పెరిగింది. ఈసారి కార్పొరేట్ పన్ను 25.17 శాతానికి తగ్గించడంతో పాటు అన్ని వర్గాలకు భారీ ఎత్తున పన్ను వరాలు ప్రకటించారు. జూలైలో ఆర్థికమంత్రిగా తొలి బడ్జెట్ ప్రతిపాదించిన నిర్మలా సీతారామన్ రెండున్నర నెలల తర్వాత ఉద్దీపన 4.0 ప్రకటించి అందరినీ విస్తు పోయేలా చేశారు. ఈ ప్యాకేజీని మినీ బడ్జెట్‌గా అభివర్ణిస్తున్నారు. దేశంలో కార్పొరేట్ పన్ను ఒక్క విడతలో 10 శాతం తగ్గించడం 28 ఏళ్ల చరిత్రలో ఇదే ప్రథమం. 1997లో దేశంలో వాస్తవంగా వర్తించే కార్పొరేట్‌పన్ను రేటు గరిష్ఠ స్థాయిలో 38.05 శాతం ఉండేది. ఈ భారీ తగ్గింపులతో మన కార్పొరేట్ పన్ను చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలతో సమాన స్థాయికి దిగి వచ్చింది.
కార్పొరేట్ పన్ను భారీగా తగ్గించడంతో పాటు సీతారామన్ ప్రకటించిన ఇతర వరాల కారణంగా ప్రభుత్వ ఖజానా కోట్ల ఆదాయాన్ని నష్టపోతుందని అంచనా. ప్రధాని నరేంద్ర మోదీ ఈ చర్యను చారిత్రకమైనదిగా ప్రశంసించారు. మేక్ ఇన్ ఇండియాకు ఇది పెద్ద వరమని, భారత ప్రైవేటు రంగం పోటీ సామర్థ్యం పెరగడంతో పాటు ప్రపంచ దేశాల పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ గమ్యంగా మారుతుందని, ఇది మొత్తం 130 కోట్ల మంది భారతీయులకు ప్రయోజనం కలిగించే చర్య అని ట్వీట్ చేశారు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కూడా దీన్ని ఒక సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలతో పాటు కొత్తగా ఉత్పాదక కార్యకలాపాలు ప్రారంభించే కంపెనీలకు కూడా కార్పొరేట్ పన్ను భారీగా తగ్గించారు. ఈ నిర్ణయంపై విపక్షాలు భగ్గుమన్నాయి. దీని వల్ల భారత ఆర్థిక వ్యవస్థ గాడితప్పిందన్న వాస్తవం స్పష్టమైందన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి