పోస్ట్‌లు

మార్చి 5, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

జ‌గ‌న్ నిర్ణయానికి జ‌నామోదం

చిత్రం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న అసాధార‌ణ‌మైన నిర్ణ‌యాన్ని జ‌నం స్వాగ‌తిస్తున్నారు. మొద‌టిసారిగా ఓ మ‌హిళ‌కు ఉన్న‌త‌మైన ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది రాష్ట్రంలో. విజయనగరం జిల్లా  సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనంద గజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం. త‌న‌కు ఈ ప‌ద‌విని అప్ప‌గించ‌డంతో ఆమె ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేసింది. కాగా గ‌త కొన్నేళ్లుగా ఒకే క‌టుంబం చెలాయిస్తున్న ఆధిపత్యానికి చెక్ పెట్టారు. 1958లో దివంగత పి.వి.జి.రాజు నెలకొల్పిన మాన్సాస్‌ సంస్థ విద్యా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు విద్యా సంస్థలను నడుపుతోంది. 1958లో పీవీజీ రాజు వ్యవస్థాపక చైర్మన్‌ కాగా ఆనంద గజపతిరాజు, అశోక్‌ గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994లో పి.వి.జి.రాజు మరణం తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్‌ అయ్యారు. 2016లో ఆయన మరణం తర్వాత అశోక్‌ గజపతిరాజు చైర్మన్‌ బాధ్యతల...

వ‌ర‌ల్డ్ విమెన్స్ క్రికెట్ క‌ప్ ఫైన‌ల్లో టీమిండియా

చిత్రం
భార‌తీయ మ‌హిళా క్రికెట్ జ‌ట్టు అస‌మాన ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్ర‌పంచ మ‌హిళ‌ల క్రికెట్ కప్ ఫైన‌ల్‌లోకి దూసుకు వెళ్లింది. ఇంగ్లండ్‌తో జ‌రిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా వ‌ర్షం అడ్డంకిగా మార‌డంతో ఆట‌ను పూర్తిగా ర‌ద్దు చేశారు. దీంతో మెరుగైన ర‌న్ రేట్ తో పాటు గ్రూపులో ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న ఇండియా జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కు చేరుకుంది. నిబంధ‌న‌లు మార్చాల‌ని, మ‌రోసారి మ్యాచ్ నిర్వ‌హించేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని మ‌హిళా ప్ర‌పంచ క‌ప్ నిర్వాహ‌కులు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ కు విన్న‌పించారు. వీరి అభ్య‌ర్థ‌న‌ను ఐసీసీ నిర్ద‌ద్వందంగా తోసి పుచ్చింది. దీంతో ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ క్లోజ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్ నుంచి ఇంగ్లండ్ నిష్క్ర‌మించింది. ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు పూర్తిగా నిరాశ‌కు లోన‌య్యారు. అడ్డ‌దిడ్డ‌మైన నిబంధ‌న‌లు విధించ‌డం వ‌ల్ల తాము గొప్ప ఛాన్స్ మిస్స‌య్యామ‌ని ఆవేద‌న చెందారు. ఇంకో వైపు ఈ టోర్న‌మెంట్‌లో ఎలాంటి ఓట‌మి చెంద‌కుండానే భార‌త విమెన్స్ క్రికెట్ జ‌ట్టు ఫైన‌ల్‌కు దూసుకు వెళ్లింది. ఇండియ‌న్ క్రికెట‌ర్స్ క‌లిసి క‌ట్టుగా ఆడారు. అద్భుత నైపుణ్యాన్ని ప్ర‌ద‌...