వ‌ర‌ల్డ్ విమెన్స్ క్రికెట్ క‌ప్ ఫైన‌ల్లో టీమిండియా

భార‌తీయ మ‌హిళా క్రికెట్ జ‌ట్టు అస‌మాన ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్ర‌పంచ మ‌హిళ‌ల క్రికెట్ కప్ ఫైన‌ల్‌లోకి దూసుకు వెళ్లింది. ఇంగ్లండ్‌తో జ‌రిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా వ‌ర్షం అడ్డంకిగా మార‌డంతో ఆట‌ను పూర్తిగా ర‌ద్దు చేశారు. దీంతో మెరుగైన ర‌న్ రేట్ తో పాటు గ్రూపులో ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న ఇండియా జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కు చేరుకుంది. నిబంధ‌న‌లు మార్చాల‌ని, మ‌రోసారి మ్యాచ్ నిర్వ‌హించేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని మ‌హిళా ప్ర‌పంచ క‌ప్ నిర్వాహ‌కులు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ కు విన్న‌పించారు. వీరి అభ్య‌ర్థ‌న‌ను ఐసీసీ నిర్ద‌ద్వందంగా తోసి పుచ్చింది. దీంతో ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ క్లోజ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్ నుంచి ఇంగ్లండ్ నిష్క్ర‌మించింది. ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు పూర్తిగా నిరాశ‌కు లోన‌య్యారు. అడ్డ‌దిడ్డ‌మైన నిబంధ‌న‌లు విధించ‌డం వ‌ల్ల తాము గొప్ప ఛాన్స్ మిస్స‌య్యామ‌ని ఆవేద‌న చెందారు. ఇంకో వైపు ఈ టోర్న‌మెంట్‌లో ఎలాంటి ఓట‌మి చెంద‌కుండానే భార‌త విమెన్స్ క్రికెట్ జ‌ట్టు ఫైన‌ల్‌కు దూసుకు వెళ్లింది. ఇండియ‌న్ క్రికెట‌ర్స్ క‌లిసి క‌ట్టుగా ఆడారు.
అద్భుత నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. త‌మ‌ను తాము ప్రూప్ చేసుకున్నారు. ఇంగ్లండ్‌తో జరగాల్సిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో వాన కారణంగా ఒక్క బంతి పడక పోయినా లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన హర్మన్‌ సేన తుది పోరుకు అర్హత సాధించింది. ఇక లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించడమే టీమిండియా టార్గెట్‌గా పెట్టుకుంది. గ్రూప్‌ ‘ఎ’లో ఆడిన నాలుగు మ్యాచ్‌లు కూడా గెలిచి అజేయంగా నిలిచిన హర్మన్‌ సేన మొత్తం 8 పాయింట్లు సాధించింది. గ్రూప్‌ ‘బి’లో మూడు మ్యాచ్‌లు మాత్రమే నెగ్గిన ఇంగ్లండ్‌ మరో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. భారత జట్టు టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. గతంలో జరిగిన ఆరు టోర్నీల్లో మూడుసార్లు మన జట్టు సెమీఫైనల్‌కే పరిమితమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్ లో  జరిగే ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడుతుంది. లీగ్‌ దశలో ఎలాంటి ఉదాసీనతకు తావు లేకుండా ప్రతీ మ్యాచ్‌లో విజయంపై దృష్టి పెట్టడం భారత్‌కు కలిసొచ్చింది. ఈ క్రమంలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు పటిష్టమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను కూడా ఓడించి మన జట్టు తమ సత్తాను ప్రదర్శించింది.
వేరే జట్ల సంగతి తెలీదుకానీ మాకైతే వర్షం నిబంధనలపై అవగాహన ఉంది. ఏదైనా కారణంగా సెమీస్‌ జరగకపోతే లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌ వెళుతుందని తెలుసు. అందుకే ఆరంభం నుంచి కూడా ప్రతీ మ్యాచ్‌లో గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగాం. మేం ఫైనల్‌ చేరడంలో జట్టు సభ్యులందరి పాత్ర ఉంది. సెమీస్‌ మ్యాచ్‌ జరగకపోవడం దురదృష్టకరం. అయితే నిబంధనలు అలాగే ఉన్నాయి. మేమేమీ చేయలేం. మున్ముందు రిజర్వ్‌ డే ఉంచాలనే ఆలోచన మంచిదే. ‘తొలిసారి ఫైనల్‌’ అనే అనుభూతి గొప్పగా ఉంది. మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం. సెమీస్‌ చూసేందుకు అమ్మా, నాన్న రావడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. వారు నేను అంతర్జాతీయ క్రికెట్‌ ఆడగా ఎప్పుడూ చూడలేదు. వారు ఇప్పుడు ఫైనల్‌ మ్యాచ్‌కు హాజరవుతారు. నా తల్లిదండ్రులే కాదు భారత్‌లో ఎంతో మంది మా విజయాన్ని కోరుకుంటున్నారు.  మేం గెలిస్తే అది నిజంగా గొప్ప ఘనత అవుతుంది అంటూ భార‌త జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్  కౌర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

కామెంట్‌లు