అయ్యో హ్యారిస్ అవుట్

అమెరికన్ పాలిటిక్స్ లో అరుదైన, అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. యుఎస్ ప్రెసిడెంట్ పదవికి 2020లో జరుగనున్న ఎన్నికల పోటీ నుంచి డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలు, భారత సంతతికి చెందిన 54 ఏళ్ళ కమలా హ్యారిస్ నిష్క్రమించారు. ఆర్థిక కారణాల వల్ల అగ్రరాజ్య అధ్యక్ష రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఈ కాలిఫోర్నియా సెనెటర్ వెల్లడించారు. నేను బిలియనీర్‌ను కాదు. నా ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్లలేను. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు నా వద్ద సరిపడా ఆదాయ వనరులు లేవు. ఇందు కోసం అన్ని మార్గాలు నేను అన్వేషించాను. అయితే కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల నా జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరిలో కమలా హ్యారిస్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. మనమంతా కలిసే ఇది పూర్తి చేద్దాం. నాతో కలిసి రండి అని ఆమె తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో గల బాల్టిమోర్ నుంచి కమలా హ్యారిస్ ఫర్ ద పీపుల్ అనే నినాదంతో తన ఎన్నికల క్యాంప...