మనోడే నెంబర్ వన్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు బ్రేక్ చేశాడు. ఇప్పటికే వన్డే, టెస్ట్, టీ 20 ఫార్మాట్ లలో టన్నుల కొద్దీ పరుగులు చేస్తూ ఎవ్వరికీ అందనంత దూరంలో చేరాడు ఈ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్. ఇటీవలి కాలంలో ఈ ఇండియన్ ఆటగాడిని తట్టు కోవడం ఏ బౌలర్ కు సాధ్యం కావడం లేదు. ఒక్కసారి క్రీడా మైదానం లోకి ఎంటర్ అయ్యాడంటే చాలు ఆఫ్ సెంచరీ చేయాల్సిందే. ఒక్కసారి క్రీజు లో కుదురుకున్నాడంటే ఇక వెనుదిరిగి చూడాల్సిన పనిలేదు. అంతలా తనను తాను ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ వస్తున్నాడు. కోహ్లీకి ఉన్నంత డిమాండ్ ఏ ఆటగాడికి ఇండియాలో లేదంటే నమ్మలేం. అంతలా పాపులర్ అయ్యాడు. ప్రపంచంలో అత్యంత ఆదాయం కలిగిన క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ టాప్ వన్ ప్లేస్ దక్కించుకున్నాడు.

ఇప్పటి దాకా క్రీడా విశ్లేషకుల అంచనా ప్రకారం కోహ్లీ సంపద ఏడాదికి కోట్లల్లో ఉంటుంది. ఇది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. కోహ్లీ మైదానంలో పులిలా ఉంటాడు. ఏ మాత్రం ఓటమిని ఒప్పుకోడు. గెలుపు సాధించేంత దాకా నిద్ర పోడు. మోస్ట్ వాంటెడ్ ప్లేయర్ గా కోహ్లీని ఇంటర్ నేషనల్ మీడియా వెల్లడించింది. తాజగా కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. టెస్టు ర్యాంకింగ్ లో మళ్లీ నంబర్ వన్ కు ఎగబాకాడు. ఐసీసీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లీ 928 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు అగ్రస్థా నంలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్  స్మిత్ ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ దక్కించు కున్నాడు.

923 పాయింట్లతో స్మిత్ రెండో స్థానంలో ఉండగా, 877పాయింట్లతో కేన్ విలియమ్స్ సన్ మూడో స్థానంలో.. 791 పాయింట్లతో నాలుగో స్థానంలో చటేశ్వర పుజారా ఉండగా, ట్రిపుల్ సెంచరీతో దుమ్ము రేపిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ 764 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. ఇక 759 పాయింట్లతో ఆరో స్థానంలో అజింక్య రహానే  ఉన్నారు. టెస్టు బౌలర్లలో పాట్ కుమినస్ 900 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా 794 పాయింట్లతో జస్పిత్ బుమ్రా ఐదో స్థానంలో..772 పాయింట్లతో అశ్విన్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్ లిస్టులో 473 పాయింట్లతో జాసన్ హోల్డర్ అగ్రస్థానంలో ఉండగా 406 పాయింట్లతో రెండో స్థానంలో జడేజా ఉన్నాడు.

కామెంట్‌లు