నిత్యానందం..కైలాసం

మనుషుల బలహీనతలు ఆసరాగా చేసుకుని, దైవం పేరుతో అడ్డమైన పనులన్నీ చేసి, కోట్లాది రూపాయలు పోగు చేసి..దేశం నుంచి చెక్కేసిన వివాదాస్పద స్వామిజీ నిత్యానంద ఇప్పుడు ఎంచక్కా ఏకంగా ఓ కంట్రీనే స్థాపించాడు. ఇది వినడానికి విస్తు పోయేలా ఉన్నా, ఇది ముమ్మాటికీ నిజం. వాస్తవం కూడా. ఇప్పటి దాకా బాబాలు, స్వాములు, యోగులు ఆశ్రమాలు పెట్టడం, భక్తులకు జ్ఞాన, ఆధ్యాత్మిక బోధ చేయడం చూశాం. కానీ మనోడు వీరికంటే భిన్నంగా ఉండాలని అనుకున్నాడో ఏమో కానీ ఎవ్వరికీ అసాధ్యం కానీ రీతిలో కొత్త దేశాన్ని స్థాపించాడు. దాని పేరు కైలాసం. ఈ పేరు వింటేనే మనకు హిమాలయాల్లో ఉన్న కైలాస శిఖరం గుర్తుకు వస్తుంది.

అది కాదు. దక్షిణ అమెరికా తీరానికి సమీపంలో ఉన్న కంట్రీ ఈక్వెడార్ నుంచి ఓ దీవిని కొనుగోలు చేసి.. అక్కడ ఏర్పాటు చేశాడు ఈ ప్రబుద్దుడు.  గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో రేప్ కేసులో నిత్యానందపై కేసు నమోదు అయ్యింది. ఇందులో భాగంగా ఈ వివాదాస్పద స్వామిజి కోసం గత కొంత కాలంగా ఆయనను పట్టుకునేందుకు భారత పోలీసులు అదే పనిగా వెతుకుతున్నారు. అయినా దొరకడం లేదు. ఎంతైనా స్వామిజీ కదా. బీజేపీ ప్రభుత్వంలో స్వాములదే కాలం. సన్నాసులదే రాజ్యం. దేశం విడిచి ఎలా పారి పోయాడని మీడియా అడిగితే సమాధానం లేదు. ఉండదు కూడా.  కొద్దిరోజుల క్రితం దేశం వదిలి పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. నేపాల్ మీదుగా ఈక్వెడార్‌కు వెళ్లి పోయినట్లు తెలుస్తోంది.

ఈ న్యూ కంట్రీకి మరింత పాపులారిటీ రావాలిగా. అందుకే కైలాసం పేరుతో వెబ్‌సైట్ పెట్టి.. సొంత దేశాల్లో హిందూ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించు కోలేక పోతున్న వాళ్లందరికీ స్వాగతం అని అందులో పెట్టారు. అయితే ప్రస్తుతానికి అధికారికంగా ఆ దేశం ఎక్కడుందో ప్రకటించలేదు. కానీ పౌరసత్వం తీసుకోవచ్చంటూ వెబ్‌సైట్‌లో లింక్ కూడా పెట్టేశారు. దేశం పేరు కైలాస..ది గ్రేటెస్ట్ హిందూ నేషన్ అనేది ట్యాగ్ లైన్. కాగా అహ్మదాబాద్‌లోని నిత్యానంద ఆశ్రమం నుంచి కొందరు కీలక వ్యక్తులు ఈ కొత్త కైలాసానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. వాళ్లే ఆ దేశానికి ప్రధాన పదవుల్లో ఉంటారని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా నిత్యానందకు ఉన్న అపర కుబేరులైన భక్తులు, ఈక్వెడార్‌లోని పవర్‌ఫుల్ వ్యక్తులతో కలిసి ఈ దీవిని కొనుగోలు చేశారని సమాచారం.

ఆ దేశానికి నిత్యానందనే రాజు. అక్కడ హిజ్ డివైన్ హోలీనెస్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం పేరుతో చలామణి అవుతాడట. వివిధ శాఖల వారీగా ఆఫీసుల వివరాలను కూడా వెబ్ సైట్‌లో ఉంచారు. ఆ దేశం పౌరసత్వం పొందాలంటే అక్కడి ప్రధానమంత్రి, కేబినెట్ ఆమోదం పొందాలట. నిత్యానందకు డొనేషన్లు, భక్తిగా పూజిస్తారని నమ్మితేనే సిటిజన్‌షిప్ అప్లికేషన్‌కు వాళ్లు ఆమోద ముద్ర వేస్తారు. అక్కడ ప్రధానిగా ఓ కోలీవుడ్ నటిని నిత్యానంద నియమించాడని, కేబినెట్ కూడా ఏర్పాటు చేస్తున్నాడని సమాచారం. మొత్తం మీద మనోడు ఇండియన్ పొలిటికల్ లీడర్ల కంటే తెలివి మీరు పోయాడన్నమాట. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!