అబ్బా..ఛార్జీల దెబ్బ
భారత టెలికం నియంత్రణ సంస్థ దెబ్బకు టెలికం కంపెనీలు లాభాలు గడిస్తున్నా నష్టాలు వస్తున్నాయనే సాకుతో చార్జీల బాదుడు షురూ చేశాయి. మొదటగా వోడాఫోన్ ఏకంగా 40 శాతం చార్జీలు పెంచింది. దీంతో అదనంగా టారిఫ్ లపై మోయలేని రీతిలో భారం మోపింది. దీని బాటలోనే జియో, ఎయిర్ టెల్, ఐడియా టెలికాం కంపెనీలు చార్జీలు తట్టుకోలేని రీతిలో పెంచడంతో మొబైల్ వినియోగదారులు లబోదిబో మంటున్నారు. అన్నీ ఉచితమే అంటూ జనాన్ని బురిడీ కొట్టించి అలవాటు చేసిన సదరు కంపెనీలు ఇప్పుడు వాడకుండా ఉండలేని స్థితికి తీసుకు వచ్చాయి. అదేపనిగా స్మార్ట్ ఫోన్స్ వాడే వాళ్ళు భారీ చార్జీలను భరించలేక పోతున్నారు. డేటా వినియోగం, ఇంటర్నెట్ కనెక్టివిటీ అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అత్యవసరంగా మారింది.
దీంతో కనెక్షన్ అన్నది తప్పనిసరి. దీనిని ఆసరాగా చేసుకున్న టెలికాం కంపెనీలు చార్జీల బాదుడు స్టార్ట్ చేశాయి. తాజాగా ఇండియన్ టెలికం సెక్టార్ లో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న రిలయన్స్ జియో కూడా బాదుడు షురూ చేసింది. ఇదిలా ఉండగా నిన్నటి దాకా ఇచ్చిన జియో ఫ్రీ ఫైబర్‌కు గడువు తీరి పోయింది. యూజర్లు ఇన్ని రోజులు పొందిన ఉచిత హోమ్ బ్రాడ్ బ్యాండ్ సేవలకు బైబై చెప్పిన కంపెనీ, చార్జీల బాదుడు మొదలు పెట్టింది. ట్రిపుల్ ప్లేకు సంబంధించి హోమ్ బ్రాడ్ బ్యాండ్ పాత, కొత్త కస్టమర్లకు చార్జీలు విధిస్తున్నట్టు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వెల్లడించింది. రెవెన్యూలను, లాభాలను పెంచు కోవడానికి జియో ఈ నిర్ణయం తీసుకుంది. మెట్రో మార్కెట్లలో 2,500 రీఫండబుల్ డిపాజిట్ కట్టిన జియో ఫైబర్ కస్టమర్లందరూ..ఇక నుంచి చార్జీలు భరించాల్సి ఉంటుంది.
సెప్టెంబర్‌లో కమర్షియల్ లాంచ్ కావడాని కంటే ముందే ఐదు లక్షల మంది యూజర్లు జియోఫైబర్ ట్రయల్స్‌కు సైనప్ అయ్యారని ముకేశ్ అంబానీకి చెందిన టెల్కో అధికారి ఒకరన్నారు. ఈ ప్రక్రియ దశల వారీగా ఈ నెలలో ముగియనుంది. ట్రయల్స్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు పొందుతున్న ప్రస్తుత కస్టమర్లకు ఉచిత హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ముగుస్తున్నాయి. వీరు జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను కొనసాగించాలను కుంటే, జియో ఫైబర్ ప్లాన్స్‌లోకి మారాల్సి ఉంటుంది. జియో ఫైబర్ టారిఫ్ ప్లాన్స్ నెలకు 699 నుంచి 8,499 మధ్యలో ఉన్నాయి. 100 ఎంబీపీఎస్ నుంచి 1జీబీపీఎస్ మధ్యలో స్పీడ్‌ను అందిస్తోంది.
గేమింగ్, హోమ్ నెట్‌వర్క్ షేరింగ్, టీవీ వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్, డివైజ్ సెక్యురిటీ వంటి సర్వీసులను ఈ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నాయి. కంపెనీ కున్న మార్కెట్ ఎగ్జిక్యూషన్, డిస్ట్రిబ్యూషన్, రిటైల్ ఫుట్‌ప్రింట్‌తో జియో బ్రాడ్‌బ్యాండ్ యూజర్ బేస్ రెండేళ్లలో కోటికి చేరుకోనుందని గ్లోబల్ రేటింగ్ సంస్థ ఫిచ్ డైరెక్టర్నితిన్ సోని చెప్పారు. ప్రస్తుతం జియోకు 7 లక్షల మంది యూజర్లుంటారని అంచనా. మొత్తం మీద చార్జీల మోతతో కస్టమర్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి