పోస్ట్‌లు

జనవరి 13, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రిన్స్.. సరిలేరు నీకెవ్వరు

చిత్రం
మిల్క్ బాయ్ గా ఇప్పటికే పేరున్న మినిమమ్ గ్యారెంటీ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. ఈ సినిమా డైరెక్టర్ ముందే చెప్పినట్టు బొమ్మ అదుర్ది అన్న డైలాగ్ నిజం చేసింది ఈ సినిమా. తాజాగా చిత్ర యూనిట్ తో పాటు సినీ నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజు లు సైతం విస్తు పోతున్నారు ఈ సినిమా వసూళ్లను చూసి. దీంతో చిత్ర బృందం మొత్తం న్యూ వేవ్ ను క్రియేట్ చేస్తూ హల్ చేస్తోంది. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేలా తెర కెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకు పోతోంది. ఓపెనింగ్స్‌ భారీ స్థాయిలో ఉండటంతో తర్వలోనే ‘సరిలేరు నీకెవ్వరు’ వందకోట్ల మార్క్‌ను దాటేసే అవకాశముందని సినీ వర్గాలు అంటున్నాయి. తొలిరోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా  46.77 కోట్ల షేర్‌ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 32.77 కోట్ల షేర్‌ రాబట్టినట్లు సమాచారం. ఇక, రెండో రోజు సుమారు 20 కోట్ల వరకు ఈ సినిమా రాబట్టిందని అంటున్నారు. మొత్తానికి తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్లకు చేరువగా వచ్చిందని సమాచారం. అధికారిక లెక్కలు వస్తే..ఈ సిన...

కేకేఆర్ పై గంభీర్ గరం గరం

చిత్రం
సోషల్ మీడియాలో నిత్యం చురుకుగా వుండే భారతీయ క్రికెట్ ఆటగాళ్లలో మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఒకడు. మరొకరు తన మాటలతో, డిఫరెంట్ మేనరిజం తో దేశాన్ని ఊపేసే మరో మాజీ ఆటగాడు, పాకిస్తాన్ దేశాధినేత ఇమ్రాన్ స్నేహితుడు సిద్దు ఒకరు. వీరు ఏదో రకంగా తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచు కోవడం అలవాటు. తాజాగా గౌతమ్ గంభీర్ కేకేఆర్ పై ఘాటు కామెంట్స్ చేశాడు. పేస్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ను అత్యధిక ధరకు సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని గంభీర్‌ తప్పు బట్టాడు. ఓ బౌలర్‌ కోసం భారీ మొత్తం చెల్లించడం సరికాదని అభిప్రాయ పడ్డాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 కోసం జరిగిన వేలంలో ఆసీస్‌ పేస్‌ బౌలర్‌ కమిన్స్‌ను ఏకంగా 15 కోట్ల 50 లక్షలకు కేకేఆర్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే ఒక విదేశీ ఆటగాడికి వేలంలో దక్కిన అత్యధిక మొత్తం అందుకున్న ఆటగాడిగా కమిన్స్‌ రికార్డు కెక్కాడు. కాగా కేకేఆర్‌ జట్టును రెండు సార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిపిన గంభీర్‌ ఈ విషయంపై స్పందించాడు. బౌలర్‌కు అత్యధిక ధర చెల్లించి బ్యాకప్‌ బ్యాట్స్‌మెన్‌ లేకుండా చేసుకు...

వన్నె తగ్గని కొలువులు

చిత్రం
ప్రపంచం కొత్త దానం కోరుకుంటోంది. అదే సమయంలో భిన్నమైన సాంకేతికతను వాడుతోంది. దీంతో ఇప్పటిదాకా రాజ్యమేలిన ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, తదితర కోర్సులు నిన్నటి దాకా ప్రభావితం చేసాయి. అంతే కాకుండా మిగతా సామాజిక అంశాలను బోధించే కోర్సులు ఉన్నట్టుండి పడిపోయాయి. అయితే ఇదే స్థానంలో కొత్త కోర్సులకు భలే గిరాకీ పెరిగింది. వీటిలో అట్రిఫీషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్న్ ఇంగ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్ ప్రస్తుతం వరల్డ్ వైడ్ మార్కెట్ ను ఊపేస్తున్నాయి. అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు వీటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా దేశ వ్యాప్తంగా సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ కోర్సులకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని ఇండీడ్‌ పేర్కొంది. గత మూడేళ్లుగా ఈ కోర్సులకు విపరీతమైన ఆదరణ పెరిగిందని, ఎక్కువ ఉద్యోగ నియామకాలు ఈ కోర్సులు అభ్యసించిన వారికే దక్కాయని తెలిపింది. స్టెమ్‌ కోర్సులు చేసిన వారికి 2016 నవంబరు నుంచి 2019 నవంబరు వర​కు 44 శాతం ఉద్యోగ నియామకాలు పెరిగాయని పేర్కొంది. ఇండియాలో  స్టెమ్‌ కోర్సులకు భారీగా డిమాండ్‌ ఉందని, నియామకాల వృద్ధి స్థిరంగా క...