ప్రిన్స్.. సరిలేరు నీకెవ్వరు
మిల్క్ బాయ్ గా ఇప్పటికే పేరున్న మినిమమ్ గ్యారెంటీ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. ఈ సినిమా డైరెక్టర్ ముందే చెప్పినట్టు బొమ్మ అదుర్ది అన్న డైలాగ్ నిజం చేసింది ఈ సినిమా. తాజాగా చిత్ర యూనిట్ తో పాటు సినీ నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజు లు సైతం విస్తు పోతున్నారు ఈ సినిమా వసూళ్లను చూసి. దీంతో చిత్ర బృందం మొత్తం న్యూ వేవ్ ను క్రియేట్ చేస్తూ హల్ చేస్తోంది. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేలా తెర కెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకు పోతోంది. ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉండటంతో తర్వలోనే ‘సరిలేరు నీకెవ్వరు’ వందకోట్ల మార్క్‌ను దాటేసే అవకాశముందని సినీ వర్గాలు అంటున్నాయి.
తొలిరోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 46.77 కోట్ల షేర్ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 32.77 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. ఇక, రెండో రోజు సుమారు 20 కోట్ల వరకు ఈ సినిమా రాబట్టిందని అంటున్నారు. మొత్తానికి తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్లకు చేరువగా వచ్చిందని సమాచారం. అధికారిక లెక్కలు వస్తే..ఈ సినిమా వంద కోట్ల మార్క్‌ను దాటిందా, లేదా అన్నది తెలిసే అవకాశముంది. మరో వైపు ఈ సినిమాకు భారీ వసూళ్లు దక్కుతుండటంతో రోజుకొక ప్రొమో, ప్రమోషన్ వీడియలతో ఈ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. తాజాగా బ్లాక్‌బస్టర్‌కా బాప్ ప్రొమో వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్ నటిస్తున్న సినిమా కావడం..పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పెద్దగా కథ లేక పోయినా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే అంశాలపై దర్శకుడు అనిల్ బాగా ఫోకస్ చేశాడని రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పండుగ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద ‘సరిలేరు నీకెవ్వరు’ భారీగానే వసూళ్లు రాబట్టినట్టు ట్రెడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి