వినియోగం మందగమనం ..ఆదాయం అంతంత మాత్రం..!

ఏదైనా ఆదాయం పొందాలంటే వినియోగం అన్నది తప్పనిసరి. వ్యవస్థలో నగదు లభించక పోవడం కూడా మరో కారణం. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సంక్షోభం నెలకొనడం తో షేర్లలో భారీ నష్టాలు చవిచూశాయి . కొంత కాలం పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఏ దేశమైన అభివృద్ధి సాధించాలంటే ..ఆర్థికంగా మరింత బలంగా ఉండాలి. దీనికి చోదక శక్తి వినియోగ రంగం. మన దేశ ఆర్ధిక రంగం మరింత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వినియోగ రంగం ఈ ఏడాది గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది . దేశీయ వినియోగం, ఉత్ పాదకతపైనే ఎక్కువగా ఆధారపడిన మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వృద్ధి క్షీణతను చవిచూస్తోంది. భారీ మెజారిటీతో రెండోసారి కొలువు దీరిన ఎన్డీయే సర్కారు కుంగిన ఆర్థిక వ్యవస్థను పరుగెత్తించే చర్యలు చేపడుతుందన్న ఆకాంక్షలు బలంగా ఉండగా, బడ్జెట్ తర్వాత నిరాశ చెందాల్సి వచ్చింది. ముఖ్యంగా వ్యవస్థలో నిధుల లభ్యత పడిపోవడం, ఎన్‌బీఎఫ్‌సీ రంగం సంక్షోభం వినియోగాన్ని దెబ్బ తీశాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి నశించింది. నోట్ల రద్దు భారతీయ ఆర్ధిక రంగాన్ని కోలుకోలేకుండా చేసింది. దీంతో నిరుద్యోగం పెరిగింది . ఉద్యోగిత తగ్గింది. అన్ని రంగాలు కుదేలయ్య...