రాణించిన నవదీప్ ..విండీస్ ఓటమి ..ఇండియా గెలుపు
విండీస్ జట్టుతో జరిగిన టీ 20 మ్యాచ్ లో భారత జట్టు అతి కష్టం మీద గెలుపొందింది . టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది . కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు ఇండియన్ బౌలర్లు . కొత్తగా వచ్చిన కుర్రాడు నవదీప్ సైని దుమ్ము రేపాడు . అతడి బౌలింగ్ దెబ్బకు విండీస్ ఆటగాళ్లు విలవిలలాడారు . పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డారు . టార్గెట్ స్వల్పమే అయినా ఇండియా ఆటగాళ్లు కూడా విండీస్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక పోయారు .
అంతకు ముందు విండీస్ మొదట బ్యాటింగ్ కు దిగగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్‌కో వికెట్ చొప్పున కోల్పోతూ పూర్తి కష్టాల్లో కూరుకు పోయింది. 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో నికోలస్ పూరన్ , కీరన్ పోలార్డ్ లు ఆ మాత్రం స్కోర్ చేయడంతో ఈ మాత్రం పరుగులు చేయగలిగింది . విండీస్ జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఒక్క పరుగు కూడా చేయలేదు. నలుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కూడా దాటలేదు. దీంతో 95 పరుగులకే కుప్పకూలింది.
టీమిండియా బౌలర్లలో నవ్‌దీప్ సైనీ మూడు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజాలు చెరో వికెట్ తీసుకున్నారు. విండీస్ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ కూడా తడబడిపడినప్పటికీ... 17.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసి వెస్టిండీస్‌పై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 24 పరుగులు చేయగా, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ చెరో 19 పరుగులు చేశారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి