రూపీ వాల్యూ వెనక్కి ..రేటింగ్ లో ఇండియా కిందకు

ప్రపంచ జీడీపీ రేటింగ్ లో ఇండియా మరో స్థానానికి దిగజారింది . రూపాయి విలువ క్షీణించడం ప్రధాన కారణం. ఇప్పుడు ప్రకటించిన స్థానాలలో భారత్ ఏడో స్థానానికి పది పోయింది . యునైటెడ్ కింగ్ డమ్ , ఫ్రాన్స్ దేశాలకు కొద్ది తేడాతో ఇండియా 2 ,73 ట్రిలియన్ డాలర్లతో నిలిచింది . అంతకు ముందు డేటా ప్రకారం 2017 లో భారత్ ఫ్రాన్స్ దేశాన్ని దాటి ఆరో స్థానాన్ని సాధించింది . అప్పుడు 2 .65 ట్రిలియన్ డాలర్ల తో అతిపెద్ద ఎకానమీగా అవతరించింది . ఆ తర్వాత యుకె ను కూడా వెనక్కు నెట్టేసి ఇండియా ఐదో స్థానం పొందింది . కానీ తాజాగా ప్రకటించిన జాబితాలో ఇండియాను ఫ్రాన్స్ , యుకె దేశాలు ముందు వరుసలో చేరాయి . 

ఇక 2018 లో కూడా అమెరికానే మొదటి స్థానాన్ని సాధించడం విశేషం . ఈ దేశం ఎప్పటి లాగానే టాప్ ఎకానమీగా నిలిచింది . దీని జీడీపీ 20 .5 ట్రిలియన్లుగా నమోదైంది . యూస్ తర్వాత చైనా 13 .6 ట్రిలియన్ డాలర్లతో రెండో స్థానంతో సరి పెట్టుకుంది . జపాన్ 5 ట్రిలియన్ డాలర్లతో , జర్మనీ 4 ట్రిలియన్ డాలర్లతో మూవుడు నాలుగో స్థానాలతో నిలిచాయి . డాలర్ మారకంలో భారతీయ రూపాయి విలువలో క్షీణత వల్ల రేటింగ్ లో వెనక్కి వెళ్ళింది . 2017 లో రూపీ వాల్యూ 3 శాతం బలపడగా ..2018 లో 5 శాతం బలహీన పడింది . ఇది ప్రధాన కారణం . 

రేటింగ్ లో తగ్గినప్పటికీ ఇండియా ఇప్పుడు ప్రపంచంలో ఆర్థికంగా ఎదుగుతున్న ..అభివృద్ధి చెందుతున్న దేశాలలో మొదటి స్థానంలో ఉన్నది . ఇది మంచి పరిణామమే . కాకపోతే ఇది ఒకింత ఆందోళన కలిగించే విషయం కూడా . ఆర్థికంగా గణనీయమైన ప్రగతి పథంలో పయనిస్తున్న భారత దేశం ఎందుకు ఆర్ధిక వృద్ధి రేటును అందుకోలేక పోతుందన్నది అందరిని ...మార్కెట్ వర్గాలను విస్మయ పరుస్తోంది . రోజు రోజుకు ఇండియా మరింత బలపడుతోంది . అయితే చైనా అమెరికాకు ఎకానమీ పరంగా పోటీ పడుతున్న సమయంలో ...యుఎస్ తో ఆర్ధిక యుద్ధం ప్రకటించడం ..దాని ఆర్ధిక మందగమనం ఏర్పడేందుకు కారణమైంది . అయితే శుభ సూచకం ఏమిటంటే రాబోయే ఏడాది ఆర్ధిక సంవత్సరం అంతానికి ..ఇండియా మోస్ట్ ఎకానమీ ప్రాఫిట్ రేట్ ను అందుకోబోతుందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. మొత్తం మీద భారత్ కు మంచి ఫ్యూచర్ ఉందన్న మాట . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!