నిబద్ధతకు దక్కిన గౌరవం .. ప్రజా గొంతుకు ప్రతిరూపం
మనీ .. మీడియా ..మాఫియా ..ఈ మూడు ప్రమాదకరమైనవి . వీటిని విడిగా చూడలేం . అలా అని పక్కన పెట్టలేం. కొన్నేళ్లుగా ప్రచురణ ..ప్రసార మాధ్యమాలు ప్రజల పక్షాన మాట్లాడేందుకు ప్రయత్నం చేశాయి . లేకపోతే రాజకీయ నాయకులు మరింతగా ఈ దేశాన్ని ..ఈ వ్యవస్థను .. ఈ సమాజాన్ని మరింత భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు . ఎందరో నిబద్దత కలిగిన పాత్రికేయులు , బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టులు , పౌర పాత్రికేయులు తమ విధుల్ని ...బాధ్యతతో వ్యవహరించడం వల్లనే ఎన్నో సమస్యలు వెలుగులోకి వచ్చాయి . మరెన్నో దేశాన్ని ...ప్రజలను చైతన్యవంతం చేస్తూనే వున్నాయి . వందలాది మంది ప్రజల పక్షాన నిలిచారు . వారి వాయిస్ ను వినిపించేందుకు ప్రయత్నం చేసారు . ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు , మరెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు .
ఇవ్వాళ మీడియా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది . కాదనలేం . కానీ కార్పొరేట్ రంగపు వాసనలు ప్రసార , ప్రచురణ , సామాజిక మాధ్యమాల వైపు మళ్ళాయి . ఇది అత్యంత ప్రమాదకరం కూడా. పాలిటిక్స్..బిజినెస్ ..ప్రభుత్వాలు ఒక్కటై పోయాయి . ఇప్పుడు ఎవరి గొంతును వారే వినిపిస్తున్నారు. ఎవరికి వారే తమ వార్తలు ప్రధాన శీర్షికలుగా , భారీ హెడ్డింగులతో రాయించుకుంటున్నారు . వాటికి పెయిడ్ ఆర్టికల్స్ గా ఇప్పటికే పేరు పొందాయి . ఓ వైపు ఇండియాలో వేలాది మంది జర్నలిస్టులు ..చాలీ చాలని జీతాలకు పని చేస్తున్నారు . అర్ధాంతరంగా రాలిపోతున్నారు . అయినా ఆయా పాత్రికేయ , ప్రసార y
మేనేజ్ మెంట్లు పట్టించు కోవడం లేదు . ప్రజల గురించి ..సమస్యలను ఎట్టి చూపించే వారికే న్యాయం జరగడం లేదు . ఇది ఇప్పటి సమస్య కాదు ..కొన్ని తరాలుగా ..దశాబ్దాలుగా కొనసాగుతూనే వస్తున్నది . జర్నలిస్టులకు సంఘాలు ఉన్నా అవి ప్రభుత్వాలకు వంత పాడుతున్నవి . దీంతో నిజమైన జర్నలిస్టులు వెలుగులోకి రావడం లేదు .
ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూనే మరో వైపు ప్రజల కోసం రాస్తున్నారు . తమ కలాలకు పదును పెడుతున్నారు . అలాంటి వారిలో గౌరీ లంకేశ్ ఒకరు . ఆమె హత్యకు గురి కాబడ్డారు . పాలగుమ్మి సాయినాథ్ గొప్ప జర్నలిస్టుగా పేరొందారు . ఇంకా చాలా మంది తమ జీవితాలను జనం కోసం అంకితం చేసారు . తెలుగు రాష్ట్రాలలో కూడా కొంత మంది నిబద్దతతో సామాజిక భాద్యతగా వార్తలు .. ప్రత్యేక కథనాలు రాస్తున్నారు . ఈ సమయంలో మాలాంటి పాత్రికేయులకు ఎందరో ప్రభావితం చేస్తూనే ఉన్నారు . అలాంటి వారిలో రవీష్ కుమార్ ఒకరు . ఎన్డీటీవీ ప్రయోక్తగా ఉన్న రవీష్ కుమార్ అదే పని చేశారు . వెలుగులోకి రానివి , ప్రజల సమస్యలను ఆయన సమాజం ముందు ఉంచే ప్రయత్నం చేసారు .అందులో సక్సెస్ అయ్యారు . అట్టడుగున ఉన్న ప్రజల సమస్యలే ప్రధానంగా ప్రస్తావించారు . అత్యంత ప్రభావిత భారతీయుల్లో రవీష్ కుమార్ ను ఒకరిగా పేర్కొంది ఓ మీడియా సంస్థ. ఆయన గత 20 ఏళ్లుగా ఎన్డీటీవీ లో పని చేస్తున్నారు . ఇప్పుడు మేనేజింగ్ ఎడిటర్ గా ఉన్నారు . డెమొక్రటిక్ రిపోర్టింగ్ అంటేనే మొదటగా ఇండియాలో గుర్తుకు వచ్చేది ..రవీష్ కుమార్ పాండేనే . మాలాంటి వాళ్లకు ఆయనో స్ఫూర్తి కలిగిస్తూనే ఉంటారు .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి