బిగ్‌బాస్‌ సక్సెస్ .. రేటింగ్ లో టాప్ ..!

స్టార్ టీవీ అంటే చాలు ఎవరైనా గుర్తు పడతారు. అంతలా అది దేశమంతటా విస్తరించింది . ఎంతలా అంటే ఇంటిల్లి పాదిని అలరించేలా ..ఆకట్టుకునేలా. ఎప్పుడైతే స్టార్ టీవీ గ్రూప్ నకు ఉదయ్ సింగ్ సీయీవోగా వచ్చి చేరాడో ..అప్పటి నుంచి దాని స్వరూపమే మారి పోయింది. ఊహించని రీతిలో దానిని టాప్ రేంజ్ లోకి తీసుకు వెళ్ళాడు . జీ గ్రూప్ లో టాప్ పొజిషన్ లో ఉన్నఈ మోస్ట్ సక్సెస్ ఫుల్ పర్సన్ గా రికార్డ్ బ్రేక్ చేసాడు . ఇంకేం క్రికెట్ టెలికాస్ట్ చేసేందుకు భారీ ఎత్తున వేలం పాటలో దక్కించుకున్నాడు . ఒక్క ప్రపంచ కప్ తో స్టార్ కు ఊహించని రీతిలో ఆదాయం లభించింది . ఎంత అనేది ఇప్పటి దాకా ఉదయ్ సింగ్ వెల్లడించలేదు.

ఇక సౌత్ ఇండియాలో ఎంటర్ అయ్యేందుకు తెలంగాణను చూస్ చేసుకున్నాడు . ఇంకేం మాటీవీ ని కొనుగోలు చేసాడు . ఆ డీల్ ఎంత అనేది ఇప్పటి దాకా ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడైతే మాను కొన్నాడో ..ఇక తెలుగు టీవీ రంగంలో పోటీ ఎక్కువయింది . ఇప్పటికే జీ తెలుగు టాప్ రేంజ్ లో ఉండగా ..ఈటీవి తన స్తానం కోసం పోటీ పడుతోంది. వచ్చీ రాగానే నార్త్ లో సక్సెస్ రేంజ్ లో ఉన్న ప్రోగ్రామ్స్ , సీరియల్స్ ను   తెలుగులోకి డబ్ చేసి వదిలారు . కొంచెం కొంచెం తెలుగు కుటుంబాలు దానితో కనెక్ట్ అయ్యాయి . మరో వైపు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ..టాప్ రేటింగ్ తీసుకు వచ్చింది . దీనిని నాగార్జున హోస్ట్ చేశారు .

అది సక్సెస్ కావడంతో ..బిగ్ బాస్ కు శ్రీకారం చుట్టారు . అది కూడా అనుకున్నంత రేంజ్ దాటి రేటింగ్ వచ్చింది . ఈ కార్యక్రమం పై భారీ అంచనాలు వచ్చాయి . మొదట టాప్ హీరో జూనియర్ ఎన్ఠీఆర్ హోస్ట్ కాగా , నాని రెండో ఎపిసోడ్ చూసాడు . ఆ తర్వాత మాటీవీ మోస్ట్ ఫెవరబుల్ హీరో గా పేరున్న అక్కినేని నాగార్జునను తీసుకు వచ్చింది మాటీవీ . మొదట్లో భారీగా పాపులారిటీ రావడం ..దీనిపై అంచనాలు పెరగడం తో పాటు ఎన్నో వివాదాలు , అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఒకానొక దశలో ఈ ప్రోగ్రాం ఆగిపోతుందన్న అనుమానాలు కలిగాయి . తనపై వేధింపులకు పాల్పడ్డారని జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసింది . కోర్ట్ దాకా ఈ ఇస్స్యూ వెళ్ళింది . ఎలాంటి జుగుస్స , బూతు లేకుండా ప్రోగ్రాం టెలికాస్ట్ చేయొచ్చని ఆదేశించింది. ఇక బిగ్ బాస్ ప్రసారం కావడంతో ..మిగతా టీవీలను దాటుకుని ...ఈ ప్రోగ్రాం ఏకంగా టాప్ రేంజ్ లోకి దూసుకు వెళ్ళింది . దీంతో పెట్టిన ఖర్చు ఇప్పటికే మాటీవికి వచ్చేసింది . దీంతో మేనేజ్ మెంట్ ఆనందం లో మునిగి తేలుతోంది .

టీఆర్పీ రేటింగ్‌ విషయంలో, మొదటి రోజు 17.9తో టాప్‌లో దూసుకుపోగా.. హైదరాబాద్‌లో  19.7తో రికార్డు సృష్టించింది. మొత్తంగా 4.5కోట్ల మంది వీక్షించినట్లు మా నిర్వాహకులు ప్రకటించారు. మొదటి వారాన్ని దాదాపు ౬౦ శాతం మంది, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ షోను 44 శాతం వీక్షించినట్లు తెలిపారు. సోషల్‌ మీడియాలో మొదటి రోజు వరల్డ్‌ వైడ్‌ ట్రెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వన్‌ మిలియన్‌ ట్వీట్స్‌, లైక్స్‌, హ్యాష్‌ట్యాగ్‌లు ఇలా అన్నింటిని కలుపుకుని ట్విటర్‌ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉన్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు 16.18 రేటింగ్‌ రాగా, నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌కు ఫస్ట్‌ ఎపిసోడ్‌కు 15.05 రేటింగ్ వచ్చింది. వీళ్లిద్దరినీ వెనక్కి నెట్టిన నాగార్జున  తొలి ఎపిసోడ్‌కు 17.9 రేటింగ్‌ సాధించి టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. మొత్తం మీద ఈ బిగ్ బాస్ నుండి ఎవరు ఉంటారు ..ఎవరు ఎలిమినేట్ అవుతారనేది జనాన్ని ఉత్కంఠకు తెర లేపింది . 

కామెంట్‌లు