లాభాల బాట పట్టిన బ్యాంకులు
ఇండియాలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో పాటు ఆంధ్రా బ్యాంక్ లాభాల బాట పట్టాయి . ఈ ఏడాది జూన్ నెలతో ముగిసిన తొలి క్వార్ట్రర్ లో 2 వేల 312 కోట్ల లాభం వచ్చింది . అయితే ఆశించినంత టార్గెట్ ను చేరుకోలేక పోయింది . నోట్ల రద్దు , మొండి బకాయిలు పేరుకు పోవడం , కేంద్రంలో ప్రభుత్వ నిర్ణయాలు భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలను నిర్వీర్యం చేశాయి . ఈ సమయంలో ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రయివేట్ బ్యాంకులు మరింత ఆదాయాన్ని గడించాయి . గతంలో ఏఫ్డీలు ఎంతగా వచ్చాయో ఇప్పుడు జీఎస్టీ , ఐటి అధికారుల దాడుల నేపథ్యంలో కస్టమర్లు ..ఖాతాదారులు ..డబ్బులు కలిగిన వాళ్ళు ఎవరూ బ్యాంకుల వైపు చూడటం లేదు . దీంతో నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల లావాదేవీలు కొంత మంద గమనం కలిగింది .
అయితే ఎస్బీఐ రెండు వేల కోట్ల రూపాయలు లాభం గడించడం ఒకింత ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఇదే సమయంలో గత సంవత్సరం 4 వేల 785 కోట్ల నష్టాలను చవి చూసింది. దీంతో కాస్ట్ కట్టింగ్ , సిబ్బంది పై అదనపు భారం పడటం కూడా ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడింది . కాగా నికర వడ్డీ ఆదాయం 5 శాతం పెరిగి 22 , 939 కోట్లకు చేరుకుంది . ఈసారి మరింత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు చేసిన అంచనాలు గురి తప్పాయి . ఇంకా బ్యాంకుకు చెందిన మొండి బకాయిలు ఇంకా పెద్ద మొత్తంలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నాయి . ఈసారి 7 . 7 శాతం మాత్రమే నమోదు కావడం కూడా కొంత ఇబ్బంది కరమే.
లావాదేవీల పరంగా సౌలభ్యకరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఈ మాత్రం ఎస్బీఐ గట్టెక్కగలిగి ఉందనేది మరో వాదన. ఏది ఏమైనప్పటికి ..దేశవ్యాప్తంగా అతిపెద్ద నెట్ వర్క్ కలిగిన బ్యాంక్ గా దీనికి పేరుంది . ఖాతాదారులకు ఒకింత సంతోషం కలిగించే విషయం . అయితే నష్టాలు వచ్చినప్పుడు ఆయా బ్యాంకులు భారీ ఎత్తున సర్వీస్ చార్జీల పేరుతో ఖాతాదారుల నెత్తిన శఠగోపం పెట్టేందుకు రెడీగా ఉంటాయి . మరి, లాభాలు ఆర్జించినప్పుడు వాటి లో కొంత మొత్తాన్ని ఖాతాదారులకు మేలు చేసినట్టవుతుంది. ఇంకో వైపు తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద బ్రాంచీలు కలిగిన ఆంధ్రా బ్యాంక్ కూడా ఈ ఆర్ధిక ఏడాది జూన్ మాసం అంతానికి లాభాలు గడించింది. ఇది కూడా ఖాతాదారులకు శుభవార్త. మొత్తం మీద ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల బాట పడితే మరో వైపు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా ప్రాఫిట్ బాట పట్టడం కూడా మంచి వార్తే కదూ .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి