ప్రపంచంలో ఢిల్లీనే బెటర్.. చావడం కంటే బతకడమే కష్టం..!
రోజులు మారాయి . చావడం కంటే బతకడం కష్టంగా మారింది . ఇండియాలో ఎక్కడికి వెళ్లినా ఇప్పుడు బతికే పరిస్థితులు లేవు . ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ మరింత పెరిగింది. చెన్నై , బెంగళూర్ , ముంబై , హైదరాబాద్ ..ఇలా చెప్పుకుంటూ పోతే బతకడం దుర్భరం . చావే నయం అన్న స్థితికి అటు కేంద్రం లోని బీజేపీ సర్కార్ ..ఇటు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు తీసుకు వచ్చాయి . ఉద్యోగం, చదువు, పెళ్లి.. అవసరం ఏదైనా కానివ్వడం ఒక చోట నుంచి మరొక చోటుకు ఇల్లు మార్చడం పెద్ద తలనొప్పి. ఇల్లు వెతకడం నుంచి మొదలు పెడితే అడ్వాన్స్, ట్రాన్స్‌పోర్ట్, ఇంటర్నెట్, ఫోన్, గ్యాస్ వంటి యుటిలిటీ చేంజెస్ వరకూ ప్రతి ఒక్కటీ టాస్కే. పైగా ఖర్చు కూడా..తడిసి మోపెడవుతోంది . ఇంటి షిఫ్టింగ్‌లో ప్రపంచ దేశాల్లోని ప్రధాన నగరాలతో పోలిస్తే మన దేశ రాజధాని ఢిల్లీ అత్యంత చౌక నగరమట. వినడానికి బాగుంది కదూ .
బెర్లిన్ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తున్న కొరియర్ అండ్ లాజిస్టిక్ కంపెనీ మూవింగ్ ప్రపంచ దేశాల్లోని 85 నగరాల్లో 2019 మూవింగ్ ఇండెక్స్ స్టడీని నిర్వహించింది. ఇంటి షిప్టింగ్‌లో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఇల్లు మారిన తర్వాత కుదురుకునే వరకూ తొలి మూడు నాలుగు నెలల పాటు ఆర్ధికంగా కొంత ఇబ్బందులు వుంటాయని స్డడీ వెల్లడించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆయా నగరాల పరంగా చూస్తే విస్తుగొలిపే లా ఉన్నాయి రేటింగ్స్ . ఇల్లు మారాలంటే ..భారీగా ఖర్చు చేయాల్సిందే. అత్యంత ఖరీదైన నగరం ఏదన్నా ఉందంటే అది అమెరికానేనట. శాన్‌ఫ్రాన్సిస్‌కోలో ఇండివిడ్యువల్స్ ఇల్లు షిఫ్టింగ్ చేయాలంటే 13,531 డాలర్లు ఖర్చు అవుతుంది.

న్యూయార్క్‌లో 12,041 డాలర్లు, స్విట్జర్లాండ్‌లోని జెనివాలో 11,694 డాలర్లు ఖర్చు అవుతుంది. ఇక మన ఇండియా వరకు వస్తే , అన్ని సిటీస్ లో కంటే ఢిల్లీలో 1,735 డాలర్లు ఖర్చు అవుతుందని సర్వే తెలిపింది. ఢిల్లీలో ఇండివిడ్యువల్స్ ఇంటి షిఫ్టింగ్ ఖర్చులు విభాగాల వారీగా చూస్తే.. శాశ్వత ఇంటి అద్దె 182 డాలర్లు, తాత్కాలిక ఇంటి అద్దె అయితే 392 డాలర్లు, అద్దె డిపాజిట్ 182 డాలర్లు, ఫుడ్ అండ్ డ్రింక్స్ 232 డాలర్లు, ట్రాన్స్‌పోర్ట్ 11 డాలర్లు, స్టోరేజీ 51 డాలర్లు, ఇంటర్నెట్ షిఫ్టింగ్ కోసం 4 డాలర్లు, ఫోన్ బిల్స్ 2 డాలర్లు ఖర్చు అవుతుందని వెల్లడించింది . ఫ్యామిలీ షిఫ్టింగ్ అయితే 4,232 డాలర్లు. ఫ్యామిలీ మొత్తం ఇల్లు షిఫ్టింగ్ చేయాలంటే అత్యంత ఖరీదైన నగరం శాన్‌ఫ్రాన్సిస్‌కో. ఇక్కడ 24,004 డాలర్లు ఖర్చు అవుతుంది.
బూస్టన్‌లో 20,738 డాలర్లు, జెనీవాలో 20,165 డాలర్లు అవుతుంది. ఇక ఢిల్లీలో కుటుంబంతో సహా షిఫ్ట్ చేయాలంటే 4,232 డాలర్లు అవుతుంది. విభాగాల వారీగా చూస్తే.. శాశ్వత ఇంటి అద్దె 335 డాలర్లు, తాత్కాలిక ఇంటి అద్దె అయితే 1,422 డాలర్లు, అద్దె డిపాజిట్ 335 డాలర్లు, ఫుడ్ అండ్ డ్రింక్స్ 533 డాలర్లు, ట్రాన్స్‌పోర్ట్ 29 డాలర్లు, స్టోరేజీ 51 డాలర్లు, ఇంటర్నెట్ షిఫ్టింగ్ కోసం 4 డాలర్లు, ఫోన్ బిల్స్ 5 డాలర్లు ఖర్చు అవుతుంది. మొత్తం మీద బతకాలంటే భారీగా ఖర్చు పెట్టాలన్నమాట. ఎంతైనా సంపాదించడం దేవుడెరుగు కానీ ..రోజు రోజుకు ఖర్చులు మోయలేనంత భారాన్ని నెత్తిన పెట్టుకోవాల్సి వస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి