పోస్ట్‌లు

జులై 21, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

పేమెంట్స్ రంగంలోకి ఆదిత్య గ్రూప్ - ఆర్బీఐ లైన్ క్లియ‌ర్

చిత్రం
డిజిట‌ల్ టెక్నాల‌జీ పుణ్య‌మా అంటూ ఇండియాలో పెద్ద ఎత్తున బ్యాంకింగ్ రంగ వ్య‌వ‌స్థ ఎదుర్కొంటున్న క‌ష్టాలు తొల‌గి పోతున్నాయి. ప్ర‌భుత్వ బ్యాంకుల‌తో పాటు ప్రైవేట్ బ్యాంకులు పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వ‌హిస్తూ..ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తున్నాయి. ఇంకో వైపు నోట్ల ర‌ద్దు దెబ్బ‌కు భార‌తీయ ఆర్థిక వ్య‌వ‌స్థ కునారిల్లి పోయింది. జీఎస్టీ అమ‌లు చేయ‌డంతో కేంద్రానికి గ‌ణ‌నీయంగా ఆదాయం స‌మ‌కూరింది. దీంతో బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చింది. అన్ని లావాదేవీలతో పాటు రుణాలు, ఇత‌ర ఆర్థిక ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల‌న్నీఇపుడు మ‌రింత సుల‌భ‌త‌రం అయ్యాయి. అన్ని బ్యాంకులు టెక్నాల‌జీతో అనుసంధానం కావ‌డంతో సేవ‌లు వేగ‌వంతం అవుతున్నాయి. సంబంధిత బ్యాంకుల‌కు చెందిన యాప్‌ల‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు క్ష‌ణాల్లో ఎన్ని డ‌బ్బులైనా..ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా ఈజీగా పంపించు కోవ‌చ్చు. కోట‌క్ మ‌హీంద్ర‌, టాటా గ్రూప్ , రిల‌య‌న్స్ కూడా రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాయి. తాజాగా ఈ కామ‌ర్స్, లాజిస్టిక్ రంగంలో టాప్ రేంజ్‌లో ఉన్న ఆదిత్య , బిర్లా గ్రూప్ కంపెనీ పంట పండింది. పే మెంట్స్ బ్యాంక్ ల‌ను ప్రారంభించేందు...

క‌న్న‌డ స‌ర్కార్ ఉండేనా..ఊడేనా..మిగిలేది రాష్ట్ర‌ప‌తి పాల‌నేనా..!

చిత్రం
క‌న్న‌డ నాట రాజ‌కీయం చ‌ద‌రంగాన్ని ..వైకుంఠపాళి ఆట‌ను త‌ల‌పింప చేస్తోంది. అంతుచిక్క‌ని ట్విస్టుల‌తో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ కూట‌మి..బీజేపీలు ర‌క్తి కట్టించేలా చేస్తున్నాయి. క‌ర్నాట‌క‌లో సంక్షోభ ప‌రిస్థితి నెల‌కొని ఉన్న‌ది. ఇవాళ రేపు అంటూ దాట‌వేత ధోర‌ణిని అవ‌లంభిస్తూ..వాయిదా వేస్తూ వ‌స్తున్న స్పీక‌ర్ పై గ‌వ‌ర్న‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం, తిరిగి సీఎంకు లేఖ కూడా రాయ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది. తాము రాజ్యాంగ‌బ‌ద్దంగా ఎన్నిక‌య్యామ‌ని, ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డ‌మే బీజేపీ ప‌నిగా పెట్టుకుందంటూ విధాన‌స‌భ‌లో సీఎం కుమార స్వామి తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. మ‌రో వైపు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గుండురావుతో పాటు ముఖ్య‌మంత్రి కుమార సుప్రీంకోర్టులో గ‌వ‌ర్న‌ర్ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ పిల్ వేశారు. తాము సంకీర్ణ స‌ర్కార్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు రాజీనామాలు స్పీక‌ర్ ర‌మేష్ కుమార్‌కు స‌మ‌ర్పించారు. అవి స్పీక‌ర్ ఫార్మాట్‌లో లేవంటూ తిప్పి పంపించారు. దీనిని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. విచార‌ణ‌కు స్వీక‌రించిన ధ‌ర్మాస‌నం స్పీక‌ర్ ...

వెంక‌టేశ్వురుడి ఆశీస్సులే ఇస్రోకు శ్రీ‌రామ ర‌క్ష

చిత్రం
శాస్త్ర‌, సాంకేతిక రంగాల‌లో ఎంతో అభివృద్ధి సాధించినా..న‌మ్మ‌కాల విష‌యంలో ఇంకా మ‌నం ప్రారంభంలోనే ఉన్నామ‌నేందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. ఇండియ‌న్ స్పేస్ రిసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ (ఇస్రో) కు బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న , పేరొందిన‌, అనుభ‌వం క‌లిగిన శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌తిభ‌లో గొప్ప‌వారుగా ప‌రిగ‌ణించిన‌ప్ప‌టికీ మూఢ న‌మ్మ‌కాల విష‌యంలో తాము ఇంకా అధ‌మ స్థానంలోనే ఉన్నామ‌ని త‌మ‌ను తాము నిరూపించుకుంటున్నారు. ప్ర‌తిసారి ఇస్రో ప్ర‌యోగించే కొత్త రాకెట్‌లు, ఉప‌గ్ర‌హాల లాంఛింగ్ చేసేకంటే ముందు, ప్ర‌తిసారి తిరుమ‌ల‌లో కొలువై వున్న శ్రీ వేంకటేశ్వ‌రుడు, ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించు కోవ‌డం కొన్ని ద‌శాబ్దాలుగా వ‌స్తూనే ఉన్న‌ది. ముహూర్తం నిర్ణ‌యించేందుకు స్వామీజీల సల‌హాలు, సూచ‌న‌ల‌ను తీసుకుంటోంది. శాస్త్ర , సాంకేతిక ప‌రంగా ప్రపంచం మ‌నకంటే ముందుకు దూసుకెళుతోంది. ఓ వైపు ఉత్త‌ర కొరియా, అమెరికా, చైనా, జ‌పాన్, ర‌ష్యా, ఫ్రాన్స్, ఇరాన్ , త‌దిత‌ర దేశాల‌న్నీ త‌మ ఆయుధ‌, సాంకేతిక‌, శాస్త్ర సంప‌త్తిని పెంచుకుంటూ వెళుతున్నాయి. టాప్ పొజిష‌న్‌లో ఉంటున్నాయి. చంద్ర‌యాన్ -2 పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీ‌హ‌రికోట‌లో ఉన...

ఫ్లిప్‌కార్ట్ మార్కెటింగ్ హెడ్‌గా వికాస్ గుప్తా

చిత్రం
ఇండియాలో అటు ఆన్‌లైన్..ఇటు ఆఫ్‌లైన్‌లో ఈకామ‌ర్స్ రంగంలో త‌న‌కంటూ ఓ బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకున్న భార‌తీయ కంపెనీ ఫ్లిప్ కార్ట్ వికాస్ గుప్తాను మార్కెటింగ్ హెడ్‌గా నియ‌మించింది. భారీ ఎత్తున అత‌డికి ఆఫ‌ర్ చేసిన‌ట్టు స‌మాచారం. ఓ వైపు అమెరికా దిగ్గ‌జ కంపెనీ అమెజాన్‌కు ఫ్లిప్ కార్ట్ నుంచే గ‌ట్టి పోటీ ఎదుర‌వుతోంది. దీంతో భారీ డిస్కౌంట్ల‌తో ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తూ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తోంది అమెజాన్. అయినా ప‌క్కా లోక‌ల్, దేశీయ బ్రాండ్ పేరుతో ఫ్లిప్ కార్ట్ రోజు రోజుకు త‌న వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రించుకుంటూ వెళుతోంది. దీంతో ఆదాయం గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. ఫ్లిప్ కార్ట్‌ను మ‌రో అమెరిక‌న్ కంపెనీ వాల్ మార్ట్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇవ్వ‌డ‌మే కాక భారీగా డీల్ కుదుర్చుకుంది. దీంతో అతి పెద్ద ఈకామ‌ర్స్ సంస్థ‌గా ఏసియ‌న్ మార్కెట్‌లో టాప్ రేంజ్‌లో నిలిచింది. లాజిస్టిక్ రంగంలో పెను మార్ప్పులు చోటు చేసుకుంటున్నాయి. డిజిట‌ల్ మార్కెటింగ్ మ‌రింత అభివృద్ధి చెంద‌డంతో ఈ కామ‌ర్స్ బిజినెస్ కొత్త హంగులు దిద్దుకుంటూ మార్కెట్ వ‌ర్గాలకు అంద‌నంత దూరంలోకి వెళుతున్నాయి. ఈ స‌మ‌యంలో పోటీని త‌ట్టుకుని , వ్యాప...

బ్రూక్ ఫీల్డ్ బిగ్ డీల్ - రిల‌య‌న్స్ కు బంప‌ర్ ఆఫ‌ర్ ..!

చిత్రం
ఏ స‌మ‌యంలో ఇండియాలో ధీరూబాయి అంబానీ రిల‌య‌న్స్ సంస్థ‌ను ప్రారంభించాడో కానీ ఇవాళ భార‌తదేశం అంటేనే రిల‌య‌న్స్ అనే స్థాయికి చేరుకుంది ఈ కంపెనీ. అత్యల్ప కాలంలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ..ఎప్ప‌టికప్పుడు త‌న మార్కెట్ స్ట్రాట‌జీని మార్చుకుంటూ ..ప్ర‌త్య‌ర్థుల కంపెనీల‌కు చుక్క‌లు చూపిస్తూ..గ‌ణనీయ‌మైన ఆదాయాన్ని గ‌డిస్తూ రికార్డుల‌ను తిర‌గ రాస్తోంది..రిల‌య‌న్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. టెలికాం, ఆయిల్, లాజిస్టిక్, డిజిట‌ల్ టెక్నాల‌జీ, జ్యూయ‌ల‌రీ, త‌దిత‌ర రంగాల‌లోకి ఎంట‌రైంది. టెలికాం రంగంలో జియో రిల‌య‌న్స్ కొట్టిన దెబ్బ‌కు ఎయిర్‌టెల్ , ఐడియా, వొడాఫోన్ , బిసీఎన్ఎల్ , త‌దిత‌ర కంపెనీలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ, డిజిట‌ల్, డేటా బేస్డ్ ఆధారంగా అందిస్తున్న సేవ‌లు జ‌నాన్ని స‌మ్మోహితుల‌ను చేశాయి. దెబ్బ‌కు ఇత‌ర ప్రైవేట్ టెలికాం ఆప‌రేట‌ర్లు కోలుకోలేని స్థితికి చేరుకున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టికే ఫైబ‌ర్ ఆప్టిక్ నెట్‌వ‌ర్క్ క‌లిగిన రిల‌య‌న్స్ త‌న హ‌వాను కొన‌సాగిస్తోంది. ఏకంగా ఆసియా ఖండంతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా టెలికాం రంగంలో ఏకంగా 33 కోట్ల మందికి పైగా స‌బ్‌స్క్రైబ‌ర్స్‌గా చ...

బంగారు త‌ల్లీ..హిమ‌దాస్ ..నీకో స‌లాం..!

చిత్రం
ఈ దేశం నిన్ను ఎప్ప‌టికీ మ‌రిచి పోదు..త‌ల్లీ హిమ‌వ‌ర్షిణి..నీ ప్ర‌య‌త్నం గొప్ప‌ది. నీ త్యాగం నిరుప‌మానం. నీ ప‌ట్టుద‌ల ముందు ఆట ఓడిపోయింది. క‌ష్టాలు వ‌చ్చినా..క‌న్నీళ్లు దిగ‌మింగుకుని బంగారు ప‌తాకాన్ని ముద్దాడ‌డం నీకు మాత్ర‌మే చేత‌న‌వును..హిమ‌దాస్. నిన్ను చూసిన‌ప్పుడ‌ల్లా అభివృద్ధికి దూరంగా ఉన్న ప‌ల్లెలు గుర్తుకు వ‌స్తున్నాయి. చిరుత పులుల గురించి సినిమాల్లో, డిస్క‌వ‌రీ ఛాన‌ల్స్‌లో చూడ‌ట‌మే త‌ప్పా..నిజ జీవితంలో నువ్వు నిజ‌మైన చిరుతవి హిమ‌. వ‌య‌సు రీత్యా 19 ఏళ్ల‌యినా ఇంకా ఎంతో భ‌విష్య‌త్ ఉన్న‌ప్ప‌టికీ ..నీ అడుగులు త‌ప్ప‌లేదు. నీ ల‌క్ష్యం గురి ప‌క్క‌కు వెళ్ల‌లేదు. నీ చూపు..నీ ధ్యాసంతా ఆట మీద‌నే. క‌ష్టాన్ని న‌మ్ముకుంటే..ప‌ట్టుద‌ల‌తో ఉంటే దేనినైనా సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించిన నీకు వేలాది వంద‌నాలు త‌ల్లీ. నువ్వు ఇలాగే ఆడాల‌.  ఇదే క‌సితో నువ్వు మైదానంలోకి అడుగు పెట్టాల. ఒక‌టా రెండా ఎంతో పోటీని త‌ట్టుకుని అయిదు బంగారు ప‌త‌కాలు తీసుకున్న నీకు అభినంద‌న‌లు. నీవు సాధించిన ఈ విజ‌యాలు..ఈ ప‌త‌కాలు ..నీకు మాత్ర‌మే కాదు..నిన్ను క‌న్న‌వారికి..నిన్ను పంపించిన ఊరికి..వంద కోట్ల‌కు పైగా ఉన్న జ‌నానికి నువ...

స్వ‌ర‌రాగ స‌మ్మోహ‌నం..మృదుమ‌ధురం..గాత్ర మాధుర్యం..!

చిత్రం
ఈ వేళ‌లో ఏం చేస్తూ వుంటావో అంటూ ఓ స్వ‌రం మెల్ల‌గా తెలుగు సినిమా రంగాన్ని ఊపేసింది. 25 ఏళ్ల‌వుతోంది ఆమె తెలుగు సినీవాలీలోకి ప్ర‌వేశించి. ఇదో రికార్డు. గాయ‌నిగా, న‌టిగా, ప్ర‌యోక్త‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా అన్ని ఫార్మాట్‌ల‌లో త‌న‌దైన ముద్ర‌తో సునీత త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంది. పది కాలాల పాటు ప్ర‌తి తెలుగు వాకిట త‌న మాధుర్య‌పు గాత్రాన్ని గుర్తుంచుకునేలా చేశారు. ఆమె పూర్తి పేరు సునీత ఉప‌ద్ర‌ష్ట‌. అద్భుత‌మైన పాట‌లు పాడారు. ఏపీలోని గుంటూరు జిల్లాలో 1978 మే 10న ఆమె జ‌న్మించారు. వ‌య‌సు రీత్యా 41 ఏళ్ల‌వుతున్నా..ఆమె మాత్రం త‌న స్వ‌రంతో ఆక‌ట్టు కోవ‌డ‌మే కాక అందంతో మెస్మ‌రైజ్ చేస్తున్నారు. వాయిస్ ఓవ‌ర్ ఆర్టిస్ట్‌గా స‌క్సెస్ అయ్యారు. 1995 నుంచి నేటి దాకా త‌న కెరీర్‌ను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళుతున్నారు. త‌న‌కంటూ ఓ స్పేస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సినిమాలు, సీరియ‌ల్స్, భ‌క్తి పాట‌లు..ప్రైవేట్ సాంగ్స్, ఇలా చెప్పుకుంటూ వెళితే వంద‌లాదిగా పాడారు. ఇంకా పాడుతూనే ఉన్నారు. ఎఫ్ఎం రేడియోల‌లో కూడా ప‌నిచేశారు. త‌న ప్ర‌తిభ‌కు ..గాత్ర మాధుర్యానికి ఎన్నో అవార్డులు, పుర‌స్కారాలు, ప్ర‌శంస‌లు అందుకున్నారు...

విండీస్ ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా జ‌ట్లు ఖ‌రారు - ప్ర‌క‌టించిన ఎంఎస్‌కె

చిత్రం
ప్ర‌పంచ క‌ప్‌లో సెమీ ఫైన‌ల్ దాకా వెళ్లి కివీస్‌తో ఓట‌మి పాలైన భార‌త క్రికెట్ జ‌ట్టు స‌భ్యులు తిన్న‌గా ఇండియాకు వచ్చేశారు. ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీ అయి పోయారు. తాజాగా వెస్టిండీస్ లో టీమిండియా మూడు ఫార్మాట్‌ల‌లో ఆడాల్సి ఉంది. ఎవ‌రు ఉంటారో ..ఎవ‌రు ఊడి పోతారోన‌నే ఉత్కంఠ దేశ వ్యాప్తంగా నెల‌కొన్న‌ది. ఇప్ప‌టికే భార‌త క్రికెట్ బోర్డు సెల‌క్ష‌న్ క‌మిటీపై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. పాలిటిక్స్ జోక్యం ఎక్కువ కావ‌డం, స‌రైన జ‌ట్టును ఎంపిక చేయ‌లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్న‌మెంట్‌లో నాలుగో ప్లేస్‌లో ఆట‌గాళ్లు కుదుర‌క పోవ‌డం, జ‌ట్టులో కెప్టెన్, వైస్ కెప్టెన్‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు కూడా అప‌జ‌యానికి కూడా కార‌ణ‌మైంద‌న్న వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఇండియాకు ప్ర‌పంచ క‌ప్‌ను తీసుకు వ‌చ్చిన మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ ఉన్నా సెమీ ఫైన‌ల్‌లో భార‌త్‌ను గ‌ట్టెక్కించ లేక పోయాడు. రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ ఆట‌గాడు ఇంకా త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌లేదు. కానీ విండీస్ టూర్‌కు తాను అందుబాటులో ఉండ‌లేనంటూ ముందే బీసీసీఐకి తెలియ ప‌రిచాడు. దీంతో టీమిండియా జ‌ట్ల ఎంపికకు అడ్డు లేకుండా...