స్వరరాగ సమ్మోహనం..మృదుమధురం..గాత్ర మాధుర్యం..!
ఈ వేళలో ఏం చేస్తూ వుంటావో అంటూ ఓ స్వరం మెల్లగా తెలుగు సినిమా రంగాన్ని ఊపేసింది. 25 ఏళ్లవుతోంది ఆమె తెలుగు సినీవాలీలోకి ప్రవేశించి. ఇదో రికార్డు. గాయనిగా, నటిగా, ప్రయోక్తగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అన్ని ఫార్మాట్‌లలో తనదైన ముద్రతో సునీత తనను తాను ప్రూవ్ చేసుకుంది. పది కాలాల పాటు ప్రతి తెలుగు వాకిట తన మాధుర్యపు గాత్రాన్ని గుర్తుంచుకునేలా చేశారు. ఆమె పూర్తి పేరు సునీత ఉపద్రష్ట. అద్భుతమైన పాటలు పాడారు. ఏపీలోని గుంటూరు జిల్లాలో 1978 మే 10న ఆమె జన్మించారు. వయసు రీత్యా 41 ఏళ్లవుతున్నా..ఆమె మాత్రం తన స్వరంతో ఆకట్టు కోవడమే కాక అందంతో మెస్మరైజ్ చేస్తున్నారు. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా సక్సెస్ అయ్యారు. 1995 నుంచి నేటి దాకా తన కెరీర్‌ను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళుతున్నారు. తనకంటూ ఓ స్పేస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సినిమాలు, సీరియల్స్, భక్తి పాటలు..ప్రైవేట్ సాంగ్స్, ఇలా చెప్పుకుంటూ వెళితే వందలాదిగా పాడారు. ఇంకా పాడుతూనే ఉన్నారు. ఎఫ్ఎం రేడియోలలో కూడా పనిచేశారు.
తన ప్రతిభకు ..గాత్ర మాధుర్యానికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా తన స్వరాన్ని అరువిచ్చారు. రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు తెలుగు, కన్నడ సినిమాలలో పాడినందుకు పొందారు. 9 నంది అవార్డులు, లైఫ్ టైం అచీవ్‌మెంట్ పురస్కారాన్ని తీసుకున్నారు. 1999లో మొదటిసారిగా ఏపీ ప్రభుత్వం నుండి నంది అవార్డును తీసుకున్నారు. 2002, 2006, 2010, 2012లలో వరుసగా పురస్కారాలు పొందారు. 2011లో ఆమె లతా మంగేష్కర్ పురస్కారాన్ని తీసుకోవడం ఆమె సాధించిన కృషికి మచ్చుతునక మాత్రమే. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన గులాబీ సినిమాకు మొదటిసారిగా సునీత పాడారు. ఆ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. ఈ వేలలో నీవు..ఏం చేస్తూ వుంటావో..అంటూ ఆమె పాడిన ఈ ఒక్క సాంగ్‌తోనే స్టార్ డమ్ పొందారు.
ఆమెకు అందంతో పాటు అద్భుతమైన గాత్రాన్ని ఆ దేవుడు సమకూర్చి పెట్టారు. ఇది ఆమెకు దక్కిన అదృష్టంగానే భావించాలి. ఓ వైపు గాయనిగా టాప్ రేంజ్‌లో ఉన్న సునీత..క్రమంగా వాయిస్ బాగుండడంతో దర్శక, నిర్మాతలు ఆమెలోని టాలెంట్‌ను గమనించారు. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు ఇచ్చారు. చాలా ప్రోగ్రామ్స్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు ఆమె. చాలా టీవీ కార్యక్రమాలకు గాయనీ గాయకులను ఎంపిక చేయడంలో న్యాయ నిర్ణేతగా కూడా సక్సెస్ అయ్యారు. మ్యూజికల్ రియాల్టీ షోలు సునీత కారణంగా సక్సెస్ అయ్యాయి. 110 మంది నటీమణులకు 750 సినిమాలకు గాత్రధారణ చేశారు. ఇది కూడా ఓ రికార్డు. ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పర్యటించారు. 19 దేశాలకు వెళ్లారు. అమెరికా, యుకె, దుబాయి, సింగపూర్, మలేషియా, ఉగాండా, నైజిరియా, టాంజానియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, స్కాట్‌లాండ్, ఐర్లాండ్, శ్రీలంక, థాయిలాండ్, జపాన్, ఓమన్, బెహ్రయిన్, ఖతార్, మారిషస్. కంట్రీస్‌లో జరిగిన ప్రోగ్రామ్స్‌లో సంగీత ప్రియులను అలరించారు. తన గాత్ర మాధుర్యాన్ని అందించారు.
సునీత ఆరేళ్ల వయస్సున్నప్పుడే సంగీతంలో శిక్షణ పొందారు. మ్యూజికల్ ట్రైనింగ్ లో స్కాలర్‌షిప్ తీసుకున్నారు. 19 సంవత్సరాలలో పెళ్లి చేసుకున్నారు. బాబు, కూతురు ఉన్నారు. టిక్ టిక్ టిక్, సవ్యసాచి సినిమాల్లో నటించారు సునీత.
17 ఏళ్ల వయసులో ఆమెలోని టాలెంట్‌ను గుర్తించిన మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతం సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన కన్నడ సినిమాకు 1997లో జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు.సునీత ఎందరో మ్యూజిక్ డైరెక్టర్ల ద్వారా పలు పాటలు పాడారు. వారిలో మణిశర్మ, రమణ గోగుల, ఎస్.ఎ. రాజ్ కుమార్, సందీప్ చౌతాలా, మిక్కీ జె మేయర్, దేవిశ్రీ ప్రసాద్, ఆర్పీ పట్నాయక్, చక్రి, నిహాల్, కళ్యాణి మాలిక్, అనూప్, సునీల్ కాష్యప్, సాలూరి వాసూ రావు, మాధవ పెద్ది సురేష్, సాకేత సాయి రాం, బంటి, వి. హరిక్రిష్ణ, జెస్సీ గిఫ్ట్, ఎస్. ఎస్. థమన్ , తదితరుల దగ్గర పాడారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో కలిపి 3 వేలకు పైగా పాటలు పాడారు.
గులాబీ సినిమా ఆమెకు మొదటి సినిమా..ఆ ఒక్క మూవీ సునీతకు బిగ్గెస్ట్ కెరీర్‌కు ప్రాణం పోసింది. ఈ వేళలో ఇప్పటికీ ఎప్పటికీ గుండెల్ని మీటుతోంది ఆ గాత్రం. ఎగిరే పావురమాలో మాఘ మాసం ఎప్పుడొస్తుందో..గుండె గూటికి పండుగొచ్చింది..నీ ఊహల్లో, ఓం అని, ఓ ప్రేమలో శుక్లాం బరదరం..అంటూ ఎస్పీతో కలిసి పాడారు. తమ్ముడు మూవీలో పెదవి దాటని మాట ఒకటుంది..బంగాళా ఖాతంలో ..చలి పిడుగులో, హే చికిత, యువరాజులో మనసేమో, తొలివలపే తీయనిది, చందమామ, అబ్బో నా బంగారు లడ్డు, అలనాటి రామచంద్రుడు అనే పాట మురారిలో కూడా పాడారు. పున్నమి జాబిలి, కాదంటావా చెప్పు అంటూ ఎస్పీతో పోటీపడి పాడారు సునీత. నీ నవ్వులా, నువ్వుంటే చాలు, మేఘాల పల్లకిలోనా, చందమామ కథలో, గంగా, సమయానికి, నన్నేదో సేయమాకు, చిరుగాలి వీచెనే, నా పేరు చెప్పుకోండి, నా పాట తేట తెలుగు, మా ఇంటికి నిన్ను పిలిచి పాటలు ఇప్పటికీ ఎప్పటికీ వినాలనిపించేవే.
అందమంటే ఎవరిది, నీ వాలు జడ, వెన్నెల్లోనా ఆడపిల్లను, నువ్వు నిజం, అందంగా లేనా, చాలు చాలు, నను బ్రోవమణి, శుభమో సుఖమో, నా కళ్లు వల్లే, అందగాడు ముట్టుకుంటే, అనగనగా, వెళుతున్నా ..హే మనసా, తార తళుకు తార, చినుకు చినుకు, నూనుగు మీసాలోడు, నీకోసం నేనున్నాంటూ, నీ ఇల్లు బంగారం, నీలాల నీ కళ్లు, గోవిందుడే కోకచుట్టి, ఆశ చిన్ని ఆశ, నా కళ్లలో, ఓ లాలన, స్వామి రా, ఎంతెంత దూరం, ఏలే ఏలే మరదలా వాలే వాలే కన్నులా...అంటూ పాడిన సాంగ్స్ హైలెట్. తిరుకొండ హారతి, నమ్మలేని కలే నిజమైనా, ఎంత ఎంత, ఎగిరిపోతే ఎంత బావుంటుంది..నీ నవ్వే కడదాకా, భీమవరం బుల్లోడా, కన్యా కుమారి, శరణు శరణు, నీ పాదములు, హారతి, నీకై శరణు, ఎక్కడయ్యా సాయి, ఆ వెన్నెలేదైనా, వేణు గాన లోలుడే, ఇంకా కొంచెం సేపు, ఈ వేళ మదిలోన, చక్కదనాల చుక్క, మళ్లీ రావా, చివరకు మిగిలేది, ఏమాయో తెలియదే, ఏదో ఏదో కావాలంటూ సునీత పాడి మెస్మరైజ్ చేశారు. శ్రీ రామచంద్ర కృప పేరుతో ప్రైవేట్ ఆల్బం రూపొందించారు.
వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా ఆమె అందించిన సినిమాలు ఊహించని రీతిలో సక్సెస్ అయ్యాయి. వాటిలో చూడాలని ఉంది, నిన్నే ప్రేమిస్తా, నువ్వు వస్తావని, శంకర్ దాదా ఎంబీబీఎస్, మన్మధుడు, శ్రీరామదాసు, నేనున్నాను, చూడాలని వుంది, ఆనంద్, గోదావరి, జయం ఉన్నాయి. టాప్ నటీమణులైన రాశి, సౌందర్య, సొనాలి బింద్రే, స్నేహ, అంజలా ఝవేరి, సిమ్రాన్, టబు, నయనతార, జెనీలియా, త్రిష, చార్మి, కమిలిని ముఖర్జీ, తమన్నా, కత్రీనా కైఫ్, లావణ్య త్రిపాఠి, సొనాల్ చౌహాన్, నమిత, నమితా ప్రమోద్, శ్రేయా శరణ్, ఆకాంక్ష సింగ్, అనిత, సదా, రీమా సేన్, మీరా జాస్మిన్, భూమిక, అనుష్క, లైలా, కళ్యాణి ఉన్నారు. సంగీత, రక్షిత, రిచా గంగోపాద్యాయ్, రెజీనా, పూనమ్ బాజ్వా, సింధు తులానీ, నవనీత్ కౌర్, ప్రియమణి, బిందు మాధవి, సంఘవి, సాక్షి శివానంద్, కంచి కౌల్, శృతి హసన్, ఇలియానా, హన్షిక, రంభ, తాప్సీ, సుహాసిని , భావనా మీనన్, గోపిక, కీర్తి రెడ్డి, రతి , పాయల్ ఘోష్, రైమా సేన్, మీరా చోప్రా, కీర్తి చావ్లా, సమీరా రెడ్డి, సోనియా అగర్వాల్, మౌనిక, సంతోషి, సోనాలి జోషి, ఉమ, అంకిత, ఇషా చావ్లా, సింధు మీనన్, అషీమా భల్లా, ఆర్తి చాబ్రియాకు తన గొంతును అరువిచ్చారు.
వారికి ప్రాణం పోశారు. పద్మ ప్రియ, నౌహీద్, సలోని, ఆదితి శర్మ, షహీన్ ఖాన్, నికిత, నేహా బాంబ్, శృతి రాజ్, గాయత్రి జయరామన్, కనిక, స్నేహ ఉల్లాల్, వేదిక సేట్, గౌరి ముంజాల్, ఆశిన్, పార్వతి మిల్టన్, లయ, దీక్షా సేఠ్, ఆర్తి అగర్వాల్, రాధికా ఆప్టే, నిషా అగర్వాల్, తను రాయ్, సురభి, గౌరి పండిట్, నేహా ఝుంకా, రచనా బెనర్జీ, నీలం, రిచా పాలడ్, మాళవిక, అమీషా పటేల్, ప్రీతి జింఘానియా, ఆషా షైని, ఆంత్రా మాళి, గ్రేసీ సింగ్, నమ్రతా శిరోధ్కర్, రేణు దేశాయి, రిమిసేన్, మంజరీ ఫడ్నవిస్, గజాలా, అర్చన, శ్రీదేవిలకు డబ్బింగ్ చెప్పారు ..అద్భుతంగా..అచ్చం వారు మాట్లాడినట్టే..పాడవే కోయిలా పేరుతో దూరదర్శన్‌లో చేశారు. జెమిని టీవీలో నవరాగం పేరుతో హోస్ట్ చేశారు. ఇదే టీవీలో యువర్స్ లవింగ్లీ, ఈటీవీలో సప్త స్వరాలుకు ప్రయోక్తగా ఉన్నారు. వనిత టీవీలో అంత్యాక్షరి కూడా సక్సెస్ అయింది. జీటీవీలో సరిగమప ప్రోగ్రాం మరింత పేరు తీసుకు వచ్చింది. హోస్ట్ అండ్ సింగర్ , ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ తనతోనే ఈటీవీ చేపట్టింది.
మాటీవీ సూపర్ సింగర్ ఫుల్ సక్సెస్. మెంటార్‌గా, జడ్జ్‌గా కూడా వ్యవహరించారు. 2014 నుంచి 2019 దాకా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం విజయవంతమైంది. ఈ ప్రోగ్రామ్‌కు సునీతనే యాంకర్, సింగర్ కూడా. దీని ద్వారా 1000 పాటలు పాడారు. కీరవాణి సంగీతం అందించగా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో సునీత పాడారు. ఇప్పటికీ టీటీడీ ఛానల్‌లో ఇదే టాప్ వన్‌లో ఉంది. నాద నీరాజనం..తిరుమల బ్రహ్మోత్సవం పేరుతో చేపట్టిన కార్యక్రమం భారీ సక్సెస్ . శ్రీవారి సేవలు కూడా సునీత పాడారు. పుట్టపర్తిలోని సాయి నిలయంలో కూడా తన మాధుర్యాన్ని పంచారు. రాగం షార్ట్ ఫిలింలో పూర్తిగా సునీత నటించి..మెప్పించారు. లెక్కలేనన్ని అవార్డులు..లెక్కించలేనన్ని పురస్కారాలు అందుకున్నారు ఈ గాయని. టాలీవుడ్‌లోకి వచ్చి 25 ఏళ్లవుతున్న సందర్భంగా వచ్చే నెల 4న హైదరాబాద్‌లో తన గాత్ర మాధుర్యాన్ని కళాభిమానులకు పంచబోతున్నారు. వీలైతే మీరూ తరించండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి